ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు ఇస్లాం విశ్వాసంలో కీలక భాగమని, ముస్లింలు మసీదును ఎన్నటికీ వదులుకోరని ఓ ప్రకటనలో పేర్కొంది. మసీదు భూమిని బదలాయించడం లేదా మసీదు భూమి మార్పిడికి అంగీకరించబోమని తేల్చిచెప్పింది. బాబ్రీ మసీదు పునర్నిర్మాణ పోరాటం కొనసాగుతుందని పేర్కొంది.
మరోవైపు అయోధ్య వివాదంపై రాజీ ఫార్ములాను ప్రతిపాదించిన మౌలానా సల్మాన్ నద్వీని బోర్డు నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది. బాబ్రీ మసీదు వ్యవహరంపై బోర్డు రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని తేల్చిచెప్పినా సభ్యుడు సల్మాన్ నద్వీ బోర్డు వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయనపై వేటు వేసినట్టు వెల్లడించింది. నద్వీని తొలగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment