babri masjid issue
-
అయోధ్య కేసు; ధావన్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: రామ జన్మభూమి –బాబ్రీమసీదు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు ముస్లిం పక్షాలు ఉద్వాసన పలికాయి. అనారోగ్యంతో ఉన్నానంటూ అర్థం లేని కారణం చూపి ఈ కేసు నుంచి తప్పించారని న్యాయవాది రాజీవ్ ధావన్ మంగళవారం వెల్లడించారు. ‘బాబ్రీ కేసు నుంచి నన్ను తప్పించినట్లు కక్షిదారైన జమియత్ ఉలేమా– ఇ– హింద్ ప్రతినిధి ఏవోఆర్ (అడ్వొకేట్ ఆన్ రికార్డు) ఎజాజ్ మక్బూల్ తెలపగా వెంటనే అంగీకరించా. ఈ కేసులో నా జోక్యం ఉండదు’అని అన్నారు. ‘నన్ను తొలగించేందుకు ఎజాజ్‌కు అధికారం ఉంది. కానీ, నాకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే తీసేసినట్లు పేర్కొనడం అర్థం లేనిది. అనారోగ్యంతో ఉంటే ఇతర కేసులను ఎలా డీల్ చేస్తున్నా?’అని ప్రశ్నించారు. కాగా, అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. -
‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
అయోధ్య తీర్పు: తెరపైకి కొత్త డిమాండ్!
లక్నో : గతంలో అయోధ్యలో ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల్లోనే మసీదు నిర్మాణానికి కూడా భూమిని కేటాయించాలని ముస్లిం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా జరగని పక్షంలో తమకు ఐదెకరాల భూమి అక్కర్లేదని స్పష్టం చేశాయి. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ క్రమంలో తొలుత సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిన ముస్లిం లా బోర్డు.. అటుపిమ్మట చర్చల అనంతరం తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో మసీదు నిర్మాణానికి స్థల కేటాయింపు విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో ప్రధాన కక్షిదారు ఇక్బాల్ అన్సారీ మాట్లాడుతూ.. ఒకవేళ తమకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. తాము కోరిన చోటే కేటాయించాలని పేర్కొన్నారు. ‘మాకు అనువైన చోట.. ఆ 67 ఎకరాల్లోనే స్థలం కేటాయించాలి. అప్పుడే మేం దానిని స్వీకరిస్తాం. లేదంటే తిరస్కరిస్తాం. బయటకు వెళ్లండి. అక్కడే మసీదు నిర్మించుకోండి అనడం సరైంది కాదు కదా’ అని పేర్కొన్నారు. ఇక ఈ వివాదంలో మరో కక్షిదారు హాజీ మహబూబ్, అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ హాజీ అసద్ అహ్మద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘ మాకు ఇలాంటి తాయిలాలు అక్కర్లేదు. మేము అడిగిన చోట మసీదు నిర్మాణానికి భూమి ఇస్తారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలి’ అని అసద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఇక మరికొంత మంది ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ‘మా మనోభావాలను కోర్టు, ప్రభుత్వాలు గౌరవించినట్లయితే 18వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు ఖాజీ ఖుద్వా సమాధి ఉన్న ప్రాంతంలోనే భూమి కేటాయించాలి. మేం ఇన్నాళ్లు బాబ్రీ మసీదు కోసమే పోరాడాం. భూమి కోసం కాదు. మేం కోరిన చోట భూమి ఇవ్వనట్లయితే.. మాకు కేటాయిస్తానన్న భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చేస్తాం’ అని పేర్కొంటున్నారు. మరోవైపు యూసఫ్ ఖాన్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల వివాదానికి తెరపడిందని హర్షం వ్యక్తం చేశారు. ‘మేం ప్రార్థనలు చేసుకునేందుకు అయోధ్యలో ఇప్పటికే ఎన్నో మసీదులు ఉన్నాయి. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంతటితో ఈ వివాదం ముగిసింది. మసీదు నిర్మాణం కోసం భూమి అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తమకు కేటాయించిన భూమి విషయమై చర్చించేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు నవంబరు 26న లక్నోలో సమావేశం కానుంది. -
బాబ్రీ తాళాలు తెరిచింది రాజీవే : ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకే బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సోమవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన హోం శాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గోడ్బోలే వ్యాఖ్యలే దీనికి సాక్ష్యాలని అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాద పరిష్కారానికి అప్పటి ఎంపీలు షాబుద్దీన్, మంత్రి కరణ్ సింగ్‌లు పలు సలహాలిచ్చినా వాటిని రాజీవ్ గాంధీ పెడచెవిన పెట్టారన్న మాధవ్ గోడ్బోలే వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంకించారు. అదే విధంగా పరిష్కార మార్గాల పట్ల రాజీవ్ ఎలాంటి ఆసక్తి చూపించలేదని ఒవైసీ వెల్లడించారు. మాధవ్ రాసిన పుస్తకంలో బాబ్రీ మసీదులో పూజలకు అనుమతించిన జిల్లా జడ్జి మొదటి కరసేవకుడిగా, రాజీవ్ గాంధీని రెండో కరసేవకుడిగా వర్ణించిన విషయం గుర్తు చేశారు. కాగా, అయోధ్య కేసులో దాదాపు 40 రోజులు రోజువారీ విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 17 వ తేదీలోగా తుది తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
భవిష్యత్ తరాలపై ప్రభావం
న్యూఢిల్లీ: సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లింల తరఫు కక్షిదారులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా, లిఖిత పూర్వకంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్‌కు వారు సోమవారం సమర్పించారు. ‘ఆ కాపీ సీల్డ్ కవర్లో నాముందుంది. కానీ అందులోని అంశాలు ఈరోజు పత్రికలో పతాక శీర్షికలో వచ్చాయి’ జస్టిస్ గొగోయ్ అన్నారు. ‘ఈ కోర్టు ఇచ్చే తీర్పు ఏదైనా.. దాని ప్రభావం భవిష్యత్ తరాలపై ఉంటుంది. తీర్పు పరిణామాలు దేశ రాజకీయాలపై కనిపిస్తాయి. 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పుడు ఆమోదించిన రాజ్యాంగవిలువలపై విశ్వాసం ఉన్న ప్రజల ఆలోచనలపై ఈ కోర్టు నిర్ణయం ప్రబల ప్రభావం చూపుతుంది’ అని ఆ కాపీలో పేర్కొన్నారు. ఆ కాపీని ముస్లింల తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ రూపొందించారు. ‘సమాజంపై ఈ తీర్పు చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేసి, దేశం నమ్ముతున్న రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా తీర్పు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం’ అని అందులో అభ్యర్థించారు. తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా పేర్కొంటూ హిందూ వర్గాలు శనివారమే తమ కాపీలను సుప్రీంకోర్టుకు అందించాయి. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేస్తున్నారని రామ్ లల్లా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తాను రూపొందించిన కాపీలో పేర్కొన్నారు. -
‘బాబ్రీపై వెనక్కితగ్గం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు ఇస్లాం విశ్వాసంలో కీలక భాగమని, ముస్లింలు మసీదును ఎన్నటికీ వదులుకోరని ఓ ప్రకటనలో పేర్కొంది. మసీదు భూమిని బదలాయించడం లేదా మసీదు భూమి మార్పిడికి అంగీకరించబోమని తేల్చిచెప్పింది. బాబ్రీ మసీదు పునర్నిర్మాణ పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు అయోధ్య వివాదంపై రాజీ ఫార్ములాను ప్రతిపాదించిన మౌలానా సల్మాన్ నద్వీని బోర్డు నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐఎంపీఎల్బీ తెలిపింది. బాబ్రీ మసీదు వ్యవహరంపై బోర్డు రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని తేల్చిచెప్పినా సభ్యుడు సల్మాన్ నద్వీ బోర్డు వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయనపై వేటు వేసినట్టు వెల్లడించింది. నద్వీని తొలగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ చెప్పారు. -
విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
-
విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
► ఈరోజు అయోధ్య వెళ్తా.. రామ మందిరాన్ని కట్టాల్సిందే ► నన్ను రాజీనామా చేయాలనే హక్కు కాంగ్రెస్‌కు లేదు ► అవును... నేను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నా ► కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందన న్యూఢిల్లీ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు.. అవసరమైతే ఉరి తీయించుకోడానికైనా తాను సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. విచారణ రెండు గంటలు గడిచినా, రెండు సంవత్సరాలు గడిచినా దాన్ని తాను ఎదుర్కొంటానన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిరాన్ని నిర్మించాలనే తాను చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తనను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె చెప్పారు. తిరంగా వివాదం సమయంలో తన మీద ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టే తాను అప్పట్లో రాజీనామా చేశానన్నారు. తాను ఈరోజు అయోధ్య వెళ్తానని, కాంగ్రెస్ ఆరోపణల మీద, తాను రాజీనామా చేయాలన్న వాళ్ల డిమాండు మీద మాత్రం స్పందించబోనని తెలిపారు. అసలు ఏ విషయమైనా చెప్పడానికి వాళ్లెవరని ఆమె ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించింది వాళ్లు, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది వాళ్లు, 1984 మత ఘర్షణలకు కారణమైంది వాళ్లేనని ఉమాభారతి మండిపడ్డారు. రామ మందిరాన్ని తాము కట్టాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని, రామ మందిరం అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని ఆమె చెప్పారు. ఎలాంటి తీర్పునైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి కుట్ర లేదని, అంతా బహిరంగంగానే ఉందని అన్నారు. తన ఉద్దేశం, చర్యలు అన్నీ ఒకటేనని, తాను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నానని కూడా ఉమాభారతి చెప్పారు.