సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కించపర్చే వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. ఆమెపై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఆదివారం తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు.
స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ముంబై కలెక్టివ్’ నిర్వహించిన ప్యానెల్ చర్చలో స్వర భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సంస్థపైదాడిగా పేర్కొంటూ ఆమెపై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ న్యాయవాదులు మహేక్ మహేశ్వరి, అనుజ్ సక్సేనా, ప్రకాష్ శర్మలతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ ప్రతికూలంగా స్పందించారు. కాగా ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరం.
Comments
Please login to add a commentAdd a comment