షరియత్, ట్రిపుల్ తలాఖ్‌కు అను కూలంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ముస్లిం మహిళల నుంచి విజ్ఞాపన పత్రాలు అందాయని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) మహిళా విభాగం ముఖ్య నిర్వాహకురాలు అస్మా జోహ్ర చెప్పారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు
జైపూర్:
షరియత్, ట్రిపుల్ తలాఖ్‌కు అను కూలంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ముస్లిం మహిళల నుంచి విజ్ఞాపన పత్రాలు అందాయని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) మహిళా విభాగం ముఖ్య నిర్వాహకురాలు అస్మా జోహ్ర చెప్పారు. జైపూర్‌లోని ఈద్గా మైదానంలో ముస్లిం మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లిం జనాభాలో విడాకుల రేటు అధికమన్న వాతావరణం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ట్రిపుల్ తలాఖ్, షరియత్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహి ళలు చాలా తక్కువగా ఉన్నారని జోహ్ర చెప్పారు. షరియత్, ఇస్లాంలో తమకున్న హక్కుల్ని తెలుసుకునేందుకు ముస్లిం మహిళలకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు.