tripple talak
-
భార్య చూయింగ్ గమ్ తినలేదని...
లక్నో: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ పై చట్టం చేసినా ఇంకా అనుకున్న మార్పు రాలేదు. ఇందుకు ఉదాహరణగా లక్నోలోని రశీద్ అనే వ్యక్తి తన భార్య సిమ్మికి చూయింగ్ గమ్ ఇవ్వగా ఆమె తిరస్కరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనిపై సిమ్మి స్పందిస్తూ తాను 2004లో సయ్యద్ రశీద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని చెప్పారు. అయితే వివాహమైనా కొద్ది రోజుల్లోనే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కోసం తీవ్రంగా వేధించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసు విచారణలో భాగంగా సివిల్ కోర్టులో వాదనలు వినిపించడానికి రాగా, భర్త తనకు చూయింగ్ గమ్ ఇచ్చాడని దీనిని తాను తిరస్కరించగా ఈ కారణంతో మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వాజిర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం పై ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ వారి కుటుంబ కలహాల అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
మేం తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ఉచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరువాత.. ఇక దీనిలో నేరాన్ని వర్తింపజేసే అంశం ఎక్కడ ఉందని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. నాన్ బెయిలబుల్ కేసు, మూడేళ్ల జైలు శిక్ష తదితర అంశాలతో కూడిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ లింగ సమానత్వాన్ని కోరుకుంటోంది. మహిళా సాధికారత కోసం నిలబడింది. మహిళాభ్యున్నతికి పాటుపడుతోంది. ఏపీ నూతన సీఎం ప్రారంభించిన అన్ని పథకాలు మహిళల అభ్యున్నతికి దోహదపడేవే. ఆయన మతసామరస్యం కోసం నిలబడే వ్యక్తి. సాధ్యమైన అన్ని మార్గాల్లో మహిళా సాధికారత కోసం మేం నిలబడుతాం. అయితే ప్రస్తుత రూపంలో ఈ బిల్లును మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఐఏ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు తదితర ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. 2017 ఆగస్టులో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. నాన్ బెయిలబుల్ కేసు వర్తింపజేయడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వివాహ బంధాల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పటికే గృహహింస నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 498ఏ తదితర చట్టాలున్నాయి. గృహహింస చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం మహిళకు మెయింటెనెన్స్ చెల్లించాలి. భర్త జైలులో పడితే మహిళలకు సామాజిక ఆర్థిక సహకారం ఎలా అందుతుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని చెబుతున్న ప్రభుత్వం దీనిలో మాత్రం విశ్వాస్ లేకుండా చేసింది. కొన్ని అభద్రతలు యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వం పునఃపరిశీలించి అభ్యంతరాలను పరిష్కరించి బిల్లును పాస్ చేయాలి. మేం మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం నిలబడుతున్నాము’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!
కౌలాలంపూర్ : ట్రిపుల్ తలాక్ ద్వారా మలేషియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ తన భార్య , రష్యా బ్యూటీక్వీన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారని రాజు తరుపు న్యాయవాది తెలియజేశారు. ‘2019, జూన్ 22న షరియా చట్టాల ద్వారా మూడు సార్లు తలాక్ చెప్పి సుల్తాన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారు’ అని సింగపూర్‌కు చెందిన సదరు అడ్వకేట్ ప్రకటించారు. కాగా రాజు భార్య, మాజీ మిస్ మాస్కో ఆక్సానా మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. తామిద్దరు కలిసి దిగిన ఫొటోలు, తమ బంధానికి గుర్తుగా జన్మించిన కుమారుడి ఫొటోలను షేర్ చేస్తూ, తాము విడాకులు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో అనారోగ్య కారణాల దృష్ట్యా సుల్తాన్ సెలవులో ఉండటంతో విడాకుల విషయమై ఆయన స్పందించలేదు. కాగా సుల్తాన్ కారణంగా ఆక్సానాకు కుమారుడు కలగలేదని అతడి న్యాయవాది పేర్కొనడం పట్ల ఆక్సానా ఫైర్ అయ్యారు. ఇక బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలో మొహమ్మద్ తన స్థానం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో క్రీడాకారుడిగా పేరొందిన సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఆ దేశ కొత్త రాజుగా ఎన్నికయ్యారు. కాగా బ్యూటీక్వీన్తో రహస్య వివాహంతో వార్తల్లోకెక్కిన మొహమ్మద్ ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా మరోసారి చర్చనీయాంశమయ్యారు. -
అది చట్ట విరుద్దమని కోర్టు ఇదివరకే తీర్పిచ్చింది: దత్తాత్రేయ
హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్ట్ ఇది వరకే తీర్పు ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ఖురాన్లో మహిళలు, పురుషులు సమానం అని ఉందని అన్నారు. ట్రిపుల్ తలాక్ 14 వందల సంవత్సరాల నుంచి సంప్రదాయంగా సాగుతోందని, ఆ విషయం మీద ముస్లిం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పేరు మీద ఎవరినీ జైలు పంపించే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సామాజిక న్యాయం మహిళలకు కావాలని అన్నారు. కాంగ్రెస్ ముస్లింల అభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని, కేవలం వారిని ఓటు బ్యాంక్‌గానే చూశాయని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన రోజు చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. అసద్ రాజకీయ ఉద్దేశం బీజేపీకి అంటగట్టడం సరైంది కాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో పాస్ అయినందుకు ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి నసీమా బీజేపీలో చేరారని చెప్పారు. 2018 సంవత్సరం బీజేపీకి ఉద్యమాల సంవత్సరం అన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు పోతుందని విమర్శించారు. -
శీతాకాల సమావేశాల్లో ‘తలాక్’
న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే వివాదాస్పద ఇస్లాం ఆచారం ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేలా తగిన చట్టం రూపొందించడం లేక నేర శిక్షాస్మృతిలో ప్రస్తుతమున్న నిబంధనలను సవరించేలా బిల్లును ప్రతిపాదించడానికి మంత్రుల కమిటీని నియమించినట్లు ప్రభుత్వ అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది. మత గురువులు కూడా ఆమెకు ఎలాంటి సాయం చేసే స్థితిలో లేరు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు దాన్ని ఆగస్టులోనే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా ఇంకా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవగాహనలేమి, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించేలా తగిన చట్టం లేకపోవడమే దీనికి కారణాలుగా భావిస్తున్నారు. -
ట్రిపుల్ తలాఖ్‌కు 3.5కోట్ల ముస్లిం మహిళల మద్దతు
ముస్లిం పర్సనల్ లా బోర్డు జైపూర్: షరియత్, ట్రిపుల్ తలాఖ్‌కు అను కూలంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ముస్లిం మహిళల నుంచి విజ్ఞాపన పత్రాలు అందాయని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) మహిళా విభాగం ముఖ్య నిర్వాహకురాలు అస్మా జోహ్ర చెప్పారు. జైపూర్‌లోని ఈద్గా మైదానంలో ముస్లిం మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లిం జనాభాలో విడాకుల రేటు అధికమన్న వాతావరణం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్, షరియత్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహి ళలు చాలా తక్కువగా ఉన్నారని జోహ్ర చెప్పారు. షరియత్, ఇస్లాంలో తమకున్న హక్కుల్ని తెలుసుకునేందుకు ముస్లిం మహిళలకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు.