కౌలాలంపూర్ : ట్రిపుల్ తలాక్ ద్వారా మలేషియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ తన భార్య , రష్యా బ్యూటీక్వీన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారని రాజు తరుపు న్యాయవాది తెలియజేశారు. ‘2019, జూన్ 22న షరియా చట్టాల ద్వారా మూడు సార్లు తలాక్ చెప్పి సుల్తాన్ ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు విడాకులు ఇచ్చారు’ అని సింగపూర్‌కు చెందిన సదరు అడ్వకేట్ ప్రకటించారు. కాగా రాజు భార్య, మాజీ మిస్ మాస్కో ఆక్సానా మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. తామిద్దరు కలిసి దిగిన ఫొటోలు, తమ బంధానికి గుర్తుగా జన్మించిన కుమారుడి ఫొటోలను షేర్ చేస్తూ, తాము విడాకులు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో అనారోగ్య కారణాల దృష్ట్యా సుల్తాన్ సెలవులో ఉండటంతో విడాకుల విషయమై ఆయన స్పందించలేదు.
కాగా సుల్తాన్ కారణంగా ఆక్సానాకు కుమారుడు కలగలేదని అతడి న్యాయవాది పేర్కొనడం పట్ల ఆక్సానా ఫైర్ అయ్యారు. ఇక బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలో మొహమ్మద్ తన స్థానం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో క్రీడాకారుడిగా పేరొందిన సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఆ దేశ కొత్త రాజుగా ఎన్నికయ్యారు. కాగా బ్యూటీక్వీన్‌తో రహస్య వివాహంతో వార్తల్లోకెక్కిన మొహమ్మద్ ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా మరోసారి చర్చనీయాంశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment