
లక్నో: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ పై చట్టం చేసినా ఇంకా అనుకున్న మార్పు రాలేదు. ఇందుకు ఉదాహరణగా లక్నోలోని రశీద్ అనే వ్యక్తి తన భార్య సిమ్మికి చూయింగ్ గమ్ ఇవ్వగా ఆమె తిరస్కరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనిపై సిమ్మి స్పందిస్తూ తాను 2004లో సయ్యద్ రశీద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని చెప్పారు. అయితే వివాహమైనా కొద్ది రోజుల్లోనే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కోసం తీవ్రంగా వేధించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసు విచారణలో భాగంగా సివిల్ కోర్టులో వాదనలు వినిపించడానికి రాగా, భర్త తనకు చూయింగ్ గమ్ ఇచ్చాడని దీనిని తాను తిరస్కరించగా ఈ కారణంతో మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి వాజిర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం పై ఎస్‌పీ వికాస్ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ వారి కుటుంబ కలహాల అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment