పీపీ చౌదరి (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ఇస్లామిక్ దేశం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మీనాకాశీ లేఖీ అన్నారు. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా దేశంలో ప్రతి జిల్లాలో షరియత్ కోర్టులు (దారుల్ ఖ్వాజా) ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం స్పందించిన లేఖీ... షరియత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి దేశంలో చోటులేదని, ఇదేవి ఇస్లాం దేశం కాదని వ్యాఖ్యానించారు. షరియత్ కోర్టులు ఏర్పాటు చేసే హక్కు ఆలిండియా ముస్లిం లా బోర్డుకు లేదని కేంద్ర సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అవి రాజ్యాంగ విరుద్ధమైనవని, వీటి వెనుకు రాజకీయ నాయకుల హస్తం ఉందని తెలిపారు.
షరియత్ కోర్టులు చట్ట విరుద్ధమని, వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు యూపీ వక్ఫ్ బోర్టు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. యూపీలో ప్రస్తుతం 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, అవన్ని చట్టబద్దమైనవేనని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కోర్టులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment