shariat law
-
ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు
ఓ వైపు ఫ్యూచర్ కరెన్సీగా బిజినెస్ టైకూన్లు మద్దతు ఇస్తున్నా మరోవైపు అదే స్థాయిలో క్రిప్టో కరెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా దేశాల్లో క్రిప్టో కరెన్సీపై ఆంక్షలు, నిషేధాలను ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మత పెద్దలు సైతం రంగంలోకి దిగారు. క్రిప్టోపై ఎలా ప్రపంచలోనే అత్యధికమంది ముస్లింలు నివసిస్తున్న దేశంగా ఇండోనేషియాకు గుర్తింపు ఉంది. ఇటీవల ఇండోనేషియా సెంట్రల్ బ్యాంకు, అక్కడి ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలో తెలపాలంటూ నేషనల్ ఉలేమా కౌన్సిల్‌ని కోరింది. షరియాకి విరుద్ధం క్రిప్టో కరెన్సీ తయారీ, చలామనీ తదితర విషయాలపై చర్చలు చేపట్టిన ఉలేమా బోర్డు చివరకు దాన్ని నిషేధించాలంటూ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్కి భద్రత లేకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. షరియా చట్టాలకు అది విరుద్ధమంటూ పేర్కొంది. పెట్టుబడికి తప్పకుండా లాభం వస్తుందని ఆధారాలు చూపిస్తే క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చంటూ తెలిపింది. ఏం జరగవచ్చు నేషనల్ ఉలేమా కౌన్సిల్ నిర్ణయంతో దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పూర్తిగా నిలిచిపోకున్నా ముస్లిం మతస్తులు మాత్రం ఇన్వెస్ట్ చేసేందుకు వెనుకాడుతారని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి నెలకొంది. -
అఫ్గన్ పాలన: తాలిబన్ల సంచలన ప్రకటన
Afghanistan Taliban Crisis: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం పనిచేయనుందని సీనియర్ తాలిబన్ నాయకుడు తాజాగా ప్రకటించారు. అఫ్గానిస్తాన్‌ను ఎలా నడిపిస్తారనే అంశంపై ఇంకా అనేక అంశాలు ఖరారు కాలేదని, గ్రూప్ నాయక్వతం త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హషిమి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అఫ్గన్‌లో ప్రజాస్వామ్యం పద్ధతిలో పాలన ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండదు, ఎందుకంటే దీనికి తమ దేశంలో ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి రాజకీయ వ్యవస్థను వర్తింపజేయాలన చర్చేలేదు.. ఎందుకంటే తాము అమలు చేయబోయేది షరియా చట్టమే అనేది సుస్పష్టం అసలు అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునాదులే లేవన్నారు. సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా దేశాధినేతగా ఉంటారని హషీమీ చెప్పారు. పాలక మండలిలో సాయుధ దళాల నుండి మాజీ పైలట్లు ,సైనికులను చేరవచ్చన్నారు. అయితే ప్రభుత్వ నిర్మాణంపై అంతర్జాతీయ నేతలతో ఇంకా చర్చిస్తున్నామని చెప్పారు. కాగా కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి ప్రవేశించిన తర్వాత తాలిబన్లు అఫ్గాన్‌పై పూర్తి నియంత్రణ సాధించారు. ఈ క్రమంలో భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికల గురించి దోహాలో తాలిబన్ నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తాలిబాన్ కమాండర్, హక్కానీ నెట్వర్క్ గ్రూప్ సీనియర్ నాయకుడు అనాస్ హక్కానీని కలిశారని తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబాన్లు చివరిసారిగా అధికారంలో ఉన్నప్పటి 1996-2001 నాటి పాలనను పోలి ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! Afghanistan Crisis: తాలిబన్లకు బైడెన్ సర్కార్ భారీ షాక్! -
విద్యాసంస్థల్లో బుర్ఖాపై నిషేధం
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. ఇస్లాం మతాన్ని పాటించడంలో తప్పులేదని కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను సాటించడం సరికాదని ఫజల్ గఫూర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ ముధుక్కోయ థంగల్ మాట్లాడుతూ మత పరమైన అంశాలను ఎంఈఎస్ నిర్ణయించలేదన్నారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ తీసుకున్న నిర్ణయం సరి కాదన్నారు. బుర్ఖాను ధరించడం ఇస్లాం సాంప్రదాయంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మత సాంప్రదాయాన్ని వారు పాటించే హక్కు అందరికీ ఉందని.. నిబంధనలపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జఫ్రీ కోరారు. అయితే జఫ్రీ వ్యాఖ్యలపై స్పంధించిన ఎంఈఎస్ కేవలం కళాశాల ఆవరణంలోనే ఈ ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టమని వివరించారు. -
‘ఇది ఇస్లామిక్ దేశం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ఇస్లామిక్ దేశం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మీనాకాశీ లేఖీ అన్నారు. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా దేశంలో ప్రతి జిల్లాలో షరియత్ కోర్టులు (దారుల్ ఖ్వాజా) ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం స్పందించిన లేఖీ... షరియత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి దేశంలో చోటులేదని, ఇదేవి ఇస్లాం దేశం కాదని వ్యాఖ్యానించారు. షరియత్ కోర్టులు ఏర్పాటు చేసే హక్కు ఆలిండియా ముస్లిం లా బోర్డుకు లేదని కేంద్ర సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అవి రాజ్యాంగ విరుద్ధమైనవని, వీటి వెనుకు రాజకీయ నాయకుల హస్తం ఉందని తెలిపారు. షరియత్ కోర్టులు చట్ట విరుద్ధమని, వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు యూపీ వక్ఫ్ బోర్టు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. యూపీలో ప్రస్తుతం 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, అవన్ని చట్టబద్దమైనవేనని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కోర్టులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
‘షరియత్ కోర్టులు చట్ట వ్యతిరేకం’
లక్నో : షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చట్ట వ్యతిరేకమని యూపీ షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాలో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వాసిం రిజ్వీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉండొచ్చని, షరియత్ కోర్టులు మాత్రం ఏర్పాటు చేయాడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖ్వాసి (జడ్జి)లను నియమించడం సరికాదని అన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి సొంతంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది, ముస్లిం లా బోర్డు సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ.. ప్రస్తుతం యూపీలో 40 కోర్టులు ఉన్నాయని అవి పూర్తిగా చట్టబద్దమైనవని స్పష్టం చేశారు. షరియత్ కోర్టులు చట్టవ్యతిరేకమైనవని ప్రజలు భావిస్తే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 15 బోర్డు సభ్యులందరూ సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని జిలానీ పేర్కొన్నారు. -
త్వరలో దేశవ్యాప్తంగా షరియత్ కోర్టులు
లక్నో: ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టు (దారుల్ కాజా)లు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) భావిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ కోర్టులు ఏర్పాటుచేస్తే ముస్లింలు తమ సమస్యల పరిష్కారానికి ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరముండదని బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ తెలిపారు. జడ్జీలు, లాయర్లు, సామాన్యులకు షరియత్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను తఫీమ్–ఈ–షరియత్ కమిటీని పునఃప్రారంభించనున్నామన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బోర్డు ఆహ్వానిస్తుందన్నారు. -
అది సాకు మాత్రమే.. మోదీపై ఒవైసీ ఫైర్
సాక్షి, ఔరంగబాద్: ట్రిపుల్ తలాక్ విషయంలో న్యాయం పేరిట ఇస్లామిక్ చట్టం ‘షరియత్’ను లక్ష్యంగా చేసుకుంటున్నారని అలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ. 15 లక్షలు బ్యాంకులో వేయకపోయినా.. ట్రిపుల్ తలాక్ బాధితులకు కనీసం నెలకు రూ. 15వేలు అయినా ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15 లక్షలు కాదు 15వేలు అయినా ఇవ్వండి మిత్రులారా (పంద్రా లాక్ నహితో పంద్రా హజర్ హి దేదో మిత్రోన్) అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. సత్వర విడాకుల విధానమైన ట్రిపుల్ తలాఖ్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 ఇటీవల లోక్‌సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిపక్షాల మెజారిటీ ఉన్న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. -
వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు
వేరే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఇండోనేషియాలో ఓ మహిళను బహిరంగంగా బెత్తంతో కొట్టారు. బాధతో ఆమె విలవిల్లాడుతూ గట్టిగా ఏడుస్తుంటే.. చుట్టూ ఉన్నవాళ్లంతా వినోదం చూస్తూ ఉండిపోయారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను వివిధ నేరాల కింద పట్టుకున్న అధికారులు.. రాష్ట్ర రాజధాని అయిన బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద అందరూ చూస్తుండగా బెత్తంతో దెబ్బలు కొట్టారు. వాళ్లలో 34 ఏళ్ల మహిళ తన భర్త కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆమెను ఏడుసార్లు బెత్తంతో కొట్టారు. కొట్టిన వ్యక్తి కళ్లు తప్ప మిగిలిన శరీరం మొత్తం దుస్తులతో నిండిపోయి ఉంది. దెబ్బలు కొడుతుంటే తనకు చాలా నొప్పిగా ఉందని ఆమె భరించలేక ఏడ్చేసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన వ్యక్తికి కూడా ఏడు దెబ్బల శిక్ష విధించారు. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారికి 100 చొప్పున బెత్తం దెబ్బల శిక్ష పడింది. మరోవ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడికి 22 దెబ్బలు పడ్డాయి. అతడి భాగస్వామి గర్భవతి కావడంతో.. ఆమెకు ఇంకా ఏశిక్ష విధించేదీ చెప్పలేదు. సాధారణంగా గర్భిణులకు ఇలాంటి శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. అసె రాష్ట్రానికి 2001 నుంచి ప్రత్యేక స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అక్కడ షరియా చట్టం అమలులో ఉంది.