సాక్షి, ఔరంగబాద్: ట్రిపుల్ తలాక్ విషయంలో న్యాయం పేరిట ఇస్లామిక్ చట్టం ‘షరియత్’ను లక్ష్యంగా చేసుకుంటున్నారని అలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ. 15 లక్షలు బ్యాంకులో వేయకపోయినా.. ట్రిపుల్ తలాక్ బాధితులకు కనీసం నెలకు రూ. 15వేలు అయినా ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 15 లక్షలు కాదు 15వేలు అయినా ఇవ్వండి మిత్రులారా (పంద్రా లాక్ నహితో పంద్రా హజర్ హి దేదో మిత్రోన్) అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
సత్వర విడాకుల విధానమైన ట్రిపుల్ తలాఖ్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 ఇటీవల లోక్‌సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిపక్షాల మెజారిటీ ఉన్న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment