మోదీపై విరుచుకుపడిన అసదుద్దీన్ ఒవైసీ
థానె: ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయ సాధనంగా వాడుకొని లబ్ధి పొందాలని మోదీ భావిస్తున్నారని విరుచుకుపడ్డారు.
‘దేశంలో 7.3 కోట్లమంది పెళ్లయిన ముస్లింలు ఉన్నారు. వారంతా విడాకులు తీసుకోవడం లేదు. కేవలం ఒక్కశాతం ముస్లింలు మాత్రమే ‘తలాక్’ తీసుకుంటున్నారు. కానీ, మోదీ తన ’మన్ కీ బాత్’లో ఈ అంశాన్ని ప్రస్తావించి.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. ముస్లింలకు విడాకులు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ట్రిపుల్ తలాక్’ విధానంపై పలు ముస్లిం మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో దీనిని రద్దుచేసే అంశంపై కేంద్ర లా కమిషన్ ప్రజాభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతి అంశాలపై లా కమిషన్ ప్రజాభిప్రాయాన్ని కోరడాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.