Afghanistan Taliban Crisis: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం పనిచేయనుందని సీనియర్ తాలిబన్ నాయకుడు తాజాగా ప్రకటించారు.
అఫ్గానిస్తాన్‌ను ఎలా నడిపిస్తారనే అంశంపై ఇంకా అనేక అంశాలు ఖరారు కాలేదని, గ్రూప్ నాయక్వతం త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హషిమి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అఫ్గన్‌లో ప్రజాస్వామ్యం పద్ధతిలో పాలన ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండదు, ఎందుకంటే దీనికి తమ దేశంలో ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి రాజకీయ వ్యవస్థను వర్తింపజేయాలన చర్చేలేదు.. ఎందుకంటే తాము అమలు చేయబోయేది షరియా చట్టమే అనేది సుస్పష్టం అసలు అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునాదులే లేవన్నారు. సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా దేశాధినేతగా ఉంటారని హషీమీ చెప్పారు. పాలక మండలిలో సాయుధ దళాల నుండి మాజీ పైలట్లు ,సైనికులను చేరవచ్చన్నారు. అయితే ప్రభుత్వ నిర్మాణంపై అంతర్జాతీయ నేతలతో ఇంకా చర్చిస్తున్నామని చెప్పారు.
కాగా కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి ప్రవేశించిన తర్వాత తాలిబన్లు అఫ్గాన్‌పై పూర్తి నియంత్రణ సాధించారు. ఈ క్రమంలో భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికల గురించి దోహాలో తాలిబన్ నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తాలిబాన్ కమాండర్, హక్కానీ నెట్‌వర్క్ గ్రూప్ సీనియర్ నాయకుడు అనాస్ హక్కానీని కలిశారని తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబాన్లు చివరిసారిగా అధికారంలో ఉన్నప్పటి 1996-2001 నాటి పాలనను పోలి ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి.
చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది!
Afghanistan Crisis: తాలిబన్లకు బైడెన్ సర్కార్ భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment