సాక్షి, లక్నో : హజ్ సబ్సిడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడింది. తాజాగా హజ్ సబ్సిడీని ఉసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన అర్థం లేనిదని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రెటరీ మౌలానా వాలీ రెహమాని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాకు సాధారణ రోజుల్లో ఇక్కడ నుంచి సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ధర.. రూ. 32 వేలు మాత్రమే. అదే హజ్ యాత్ర రోజుల్లో ఈ టిక్కెట్‌ధర రూ. 65 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. సబ్సిడీకన్నా అసలు టిక్కెట్ ధరే తక్కువని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వాలు ముస్లింలను మోసగించాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. హజ్ యాత్రికులు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకపోయినా.. ఎయిర్ ఇండియా మాత్రం నష్టాల్లో నడుస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిచారు.
ఇదిలావుండగా.. హజ్ సబ్సిడీని ఎత్తివేయడంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు హర్షం వ్యక్తం చేసింది. అలాగే సబ్సిడీ మొత్తాన్ని ముస్లిం పేద విద్యార్థినులకోసం ఖర్చు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని షియా బోర్డు ఛైర్మన్ యాసూబ్ అబ్బాస్ స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment