Haj pilgrim
-
‘హజ్ సువిధ’లో 10 భాషల్లో హజ్ యాత్ర సమాచారం!
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ‘హజ్ సువిధ’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ యాప్ హాజీలకు అవసరమైన సమయాల్లో సమీపంలోని ఆరోగ్య సదుపాయాలను గుర్తించడంలోనూ సహాయపడుతుందని ఆమె తెలిపారు. ‘హజ్ సువిధ’యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. హజ్ 2024 కోసం ‘హజ్ గైడ్’ 'హజ్ సువిధ’ యాప్‌లను ఆవిష్కరించాం. 2024లో హజ్‌కు వెళుతున్న భారతీయులకు శుభాకాంక్షలు’ అని స్మృతి ఇరానీ ఆ పోస్టులో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, బెంగాలీతో సహా మొత్తం 10 భాషల్లో ఈ ‘హజ్ గైడ్’ అందుబాటులో ఉండనుంది. 'హజ్ సువిధ’ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్‌తో నేరుగా కమ్యూనికేషన్ అందుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సహాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. समन्वय, सुगमता और बढ़ता विश्वास!🕋 देश के यशस्वी पीएम @narendramodi जी के नेतृत्व में, हज यात्रा पर जाने वाले भारतीयों को बेहतर सुविधा प्रदान करने एवं उनके लिए यात्रा सरल, सुखद एवं सुरक्षित बनाने की दिशा में @MOMAIndia ने एक अहम प्रगति की है। हज 2024 हेतु आज विज्ञान भवन, नई… pic.twitter.com/jV1LyhEKhz — Smriti Z Irani (@smritiirani) March 3, 2024 -
‘హజ్ సబ్సిడీ పేరుతో మోసం చేశారు’
సాక్షి, లక్నో : హజ్ సబ్సిడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడింది. తాజాగా హజ్ సబ్సిడీని ఉసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన అర్థం లేనిదని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రెటరీ మౌలానా వాలీ రెహమాని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు సాధారణ రోజుల్లో ఇక్కడ నుంచి సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ధర.. రూ. 32 వేలు మాత్రమే. అదే హజ్ యాత్ర రోజుల్లో ఈ టిక్కెట్‌ధర రూ. 65 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. సబ్సిడీకన్నా అసలు టిక్కెట్ ధరే తక్కువని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వాలు ముస్లింలను మోసగించాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. హజ్ యాత్రికులు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకపోయినా.. ఎయిర్ ఇండియా మాత్రం నష్టాల్లో నడుస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిచారు. ఇదిలావుండగా.. హజ్ సబ్సిడీని ఎత్తివేయడంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు హర్షం వ్యక్తం చేసింది. అలాగే సబ్సిడీ మొత్తాన్ని ముస్లిం పేద విద్యార్థినులకోసం ఖర్చు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని షియా బోర్డు ఛైర్మన్ యాసూబ్ అబ్బాస్ స్వాగతించారు. -
బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి
భవిష్యత్తులో మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్ల బడ్జెట్ ► వృద్ధి రేటులో రాష్ట్రం నంబర్ వన్: కేసీఆర్ ► హజ్ యాత్రను ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధన కోసం అల్లాను ప్రార్థించాలని హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని హజ్ ఆరాధనల్లో దువా చేయాలని కోరారు. మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికుల బస్సును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని తిరిగి రావాలని ఆకాంక్షిం చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందన్నారు. నిజాం పాలకులు మక్కా, మదీనాలో నిర్మించిన రుబాత్‌లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా 1,280 మంది యాత్రికులకు ఉచిత వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అడిగేవారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు దేశంలో ఎక్కడా లేవని వారికి చెప్పాను. వారికి తెలంగాణ కట్టుబాట్లు పరిచయం చేశాను. 1927లో గాంధీజీ హైదరాబాద్ సంస్థానానికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన, హిందూ.. ముస్లింల ఐక్యతకు ఎంతో ప్రభావితమయ్యారు. ఇక్కడి సంస్కృతిని ఉత్తర భారతీయులు నెర్చుకోవాలని ఆయన చెప్పారు. నిజాం దాన గుణం గల వ్యక్తి. ప్రపంచంలో హైదరాబాద్‌కు ధనిక సంస్థానంగా పేరుండేది. చైనా యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఆర్థిక సాయం కోరగా దేశంలో నిజాం తప్ప ఎవరూ స్పందించలేదు. నిజాం ఆరు టన్నుల బంగారం ఇచ్చి పంపించారు. బంగారాన్ని తిరిగి ఇస్తామంటే... ముందు దేశ రక్షణకు పాటుపడమని నిజాం పేర్కొన్నారు’ అని కేసీఆర్ కొనియాడారు. సీఎం అంటే ప్రధాన సేవకుడు... మూడేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు 21 శాతానికి చేరుకుందని సీఎం చెప్పారు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంద న్నారు. ఛత్తీస్‌గఢ్ 10.05 శాతంతో రెండో స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రా నికి ఎంతో నష్టం జరిగిందన్నారు. మైనార్టీ లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ‘మైనార్టీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన సాగిస్తున్నాం. ఓ గ్రామంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లినప్పు డు... విద్యా బోధన, సౌకర్యాల గురించి ఆరా తీశారు. తమ పిల్లలకు ఇలాంటి విద్య, సౌకర్యలు లభిస్తాయని ఉహించలేదంటూ తల్లిదండ్రులు కంట తడి పెట్టుకున్నారని ఫారుఖ్ చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోంది. మైనార్టీ సంక్షేమానికి ఈ ఏడాది రూ.12 వందల కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో దీనిని రూ.12 వేల కోట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సురక్షితంగా, సుఖశాంతులతో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రధాన సేవకుడు మాత్రమే’ అని సీఎం చెప్పారు. కేసీఆర్‌తోనే మైనార్టీల అభివృద్ధి: మహమూద్ అలీ దేశంలోని హజ్ కమిటీల ఏర్పాట్ల కంటే తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర హజ్ కమిటీ సభ్యులు కితాబిచ్చారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడు ఏకే ఖాన్, కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సేన్, ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ నేతలు ముజీబ్, మసీవుల్లాఖాన్ పాల్గొన్నారు. -
మక్కాలో నగర హజ్ యాత్రికురాలు మృతి
హైదరాబాద్: హైదరబాద్కి చెందిన హజ్ యాత్రికురాలు హుర్మతున్నీసా మక్కాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నగరంలోని ఆసీఫ్ నగర్ లోని ఎస్బీహెచ్ కాలనీలో నివాసముండే హుర్మతున్నీసా గత ఆగస్టు 23న భర్త ముహమ్మద్ గౌస్‌తో కలిసి హజ్‌యాత్ర కోసం మక్కాకు వెళ్లారు. ఈ నెల 11న నగరానికి తిరిగి రావాల్సి ఉంది. హజ్ ముగిసిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చికిత్సకోసం మక్కాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో ముస్లిం సంప్రదాయంప్రకారం ఆమె మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ అహమ్మద్ సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి భర్త మహమ్మద్ గౌస్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత రాయబారికి ఫోన్లో విజ్ఞప్తి చేశారు.