సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు అంశంలో బీజేపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి పార్లమెంట్ కమిటీకి(సెలక్ట్) సమీక్ష కోసం పంపేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అవి చేసే సూచనలు, ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణించాల్సి ఉంటుంది.
అదే జరిగితే వచ్చే పార్లమెంట్ సెషన్స్‌లోనే బిల్లు మళ్లీ చర్చకు వచ్చే అవకాశాలున్నాయి . కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు స్పష్టమైన మెజార్టీతో ఆమోదం పొందగా, రాజ్యసభలోనే కాంగ్రెస్ పార్టీ, విపక్షాల నినాదాలతో చర్చకు కూడా నోచుకోకుండానే పోయింది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ కీలకనేతలు కాంగ్రెస్ పార్టీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసారంగా ట్రిపుల్ తలాక్ బిల్లు లేదని, అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవటం, దీనికితోడు అన్నాడీఎంకే, బిజ్జూ జనతా దళ్ సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనని కోరటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment