Select Committee
-
అద్దె గర్భాల బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో చెప్పారు. సరోగసీని వాణిజ్యానికి వాడకుండా నిరోధించడం, మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. కొత్త బిల్లు ప్రకారం.. దేశంలో భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అబార్షన్ మొదలుకొని సరోగసి వరకూ వేర్వేరు అంశాల్లో మహిళల హక్కులపై ప్రధాని మోదీ విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. సూచనలు చేసింది. వీటిని పొందుపరిచిన బిల్లును బుధవారం కేబినెట్ ఆమోదించగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుంది. కశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు ఆదేశాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. దేశం మొత్తానికి అన్వయించే కేంద్ర చట్టాలు (జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి) ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది. కేంద్రం ఆమోదంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో హరియాణా, తమిళనాడుల్లో రెండు ఆహార సంబంధిత సంస్థలకు జాతీయ స్థాయి కల్పిస్తూ నిర్ణయం జరిగింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,మేనేజ్మెంట్ చట్టానికి సవరణలు చేశామని జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు తర్వాత ఆ సంస్థలు విదేశీ సంస్థల నుంచి నేరుగా సాయం పొందొచ్చు. బిల్లులోని ముఖ్యాంశాలు కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు ► అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంచారు. ► మానవ పిండాలు, గామేట్స్ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి. భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35–45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి లభిస్తుంది. -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్‌కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్‌కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు. (చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో) మండలి చైర్మన్ నిర్ణయంతోనే.. పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. -
ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్ కమిటీని నియమించాలని చైర్మన్ ఎంఏ షరీఫ్ పంపిన ఫైలును లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబు లెజిస్లేచర్ కార్యదర్శిని కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి అభ్యంతరం సెలెక్ట్ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా చైర్మన్ షరీఫ్ లెజిస్లేచర్ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం. మండలి చైర్మన్ నిర్ణయంతో వివాదం పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు) -
సరోగసీకి ఇంకా సమస్యలే
ఎట్టకేలకు సరోగసీ (అద్దె గర్భం) బిల్లుపై సెలెక్ట్ కమిటీ సిఫార్సులు పెద్దల సభ ముందుకొచ్చాయి. బిల్లుకు ఏర్పడిన అవరోధాలు తొలగి అది పార్లమెంటు ఆమోదం పొందాలని సంతాన లేమితో బాధపడుతూ, సరోగసీ కోసం ఎన్నో జంటలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడో 2008లో బిల్లు పని ప్రారంభం కాగా, చట్టాల రూపకల్పనలో రివాజుగా సాగే జాప్యాన్ని దాటడానికి ఇంతకాలం పట్టింది. దీనిపై ఇంకా సభలో చర్చ జరగాల్సివుంది. బిల్లును అధ్యయనం చేసిన సెలెక్ట్ కమిటీ 15 సూచనలు చేసింది. ఇందులో అద్దె గర్భానికి అంగీకరించే మహిళ, దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధన తొలగించమని చేసిన సూచన కూడా ఉంది. అలాగే మరో కీలకమైన సూచన కూడా చేసింది. వివాహమైన దగ్గర నుంచి అయిదేళ్లపాటు ఎదురుచూశాకే అద్దె గర్భం ప్రత్యా మ్నాయాన్ని దంపతులు ఎంచుకోవాలన్న నిబంధన కూడా సరికాదని కమిటీ అభిప్రాయపడింది. సంతానం అవసరమని భావించే దంపతులు సంతానలేమి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్న నిబంధనను కమిటీ వ్యతిరేకించింది. దీనికి బదులు వైద్యపరంగా వారిని అద్దె గర్భం ద్వారా ‘సంతానం కోరుకునే జంట’గా పరిగణిస్తే సరిపోతుందని తెలిపింది. ‘సంతానం కోరుకునే జంట’ గా ఎవరిని పరిగణించాలన్న విషయమై బిల్లులోని నిబంధనను మార్చాలని కమిటీ సూచించింది. వివాహమైన జంట మాత్రమే సరోగసీకి అర్హులన్న నిబంధన బదులు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు వారు విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా ఎంచుకునేలా మార్పు చేయాలని సూచించింది. అయితే ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు, సహజీవనం చేస్తున్న జంటలు, స్వలింగసంపర్కులకు బిల్లులో ఉన్న అనర్హత కొనసాగాలని పేర్కొంది. ఈ కేటగిరీలోని వారికి ఇప్పటికే దత్తత చట్టాల ప్రకారం ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు సరోగసీలో బిడ్డను పొందే హక్కును వారికి నిరాకరించడంలో హేతుబద్ధత కనబడదు. సరోగసీ సాంకేతికత మొదలయ్యాక మన దేశంలో అది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. 2000 సంవత్సరంనాటికి మన దేశాన్ని అందరూ ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అనేవిధంగా అది వ్యాపించింది. పేదరికం ఉన్నచోట ఏమైనా చేయొచ్చునన్న అభిప్రాయం సంపన్నుల్లో ఉండటం దీనికి కారణం. ఈ అంశాన్ని మొదట ప్రభుత్వం గుర్తించలేదు. మహిళా ఉద్యమకారులు, ఆరోగ్య రంగ కార్యకర్తలు గమనించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా మరో ఎనిమిదేళ్లకుగానీ బిల్లు రూపొందించే ప్రక్రియ మొదలుకాలేదు. ఆ తర్వాతైనా ఆ పని చకచకా పూర్తికాలేదు. చివరకు బిల్లు తయారైనా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు కూడా పోలేదు. ఈలోగా యూపీఏ పాలన ముగిసి, ఎన్డీఏ అధికారంలోకొచ్చింది. అనంతరం 2016లో కేంద్ర మంత్రివర్గం ముందుకు ఈ బిల్లు వచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఈ బిల్లును అధ్యయనం చేసి అనేక సవరణలు సూచించింది. ఆ సవరణల్లో చాలావాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వస్తున్న తరుణంలోనే అది లోక్‌సభ ముందు కెళ్లింది. తీవ్ర గందరగోళం మధ్య పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది. బిల్లు సమగ్రంగా లేదని, సరోగసీకి ఇందులో ఎన్నో పరిమితులు విధించారని రాజ్యసభలో విమర్శలు వచ్చిన నేప థ్యంలో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఆ కమిటీ సిఫా ర్సులు రాజ్యసభ ముందుకొచ్చాయి. బిల్లు త్వరగా చట్టంగా మారితే నిరుపేద అమాయక మహిళ లకు ఇప్పుడెదురవుతున్న అనేకానేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో అసలు సరోగసీ కోరుకునే జంటలకు చట్టం సమస్యాత్మకంగా మారకూడదు. ఈ బిల్లుపై మొదటినుంచీ మహిళా సంఘాలనుంచీ, ఆరోగ్యరంగ కార్యకర్తల నుంచి ఎదుర వుతున్న మౌలిక అభ్యంతరాల గురించి సెలెక్ట్ కమిటీ సరిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఉదాహ రణకు సరోగసీ అనేది ‘నిస్వార్థమైనది’గా ఉండాలని బిల్లు నిర్దేశిస్తోంది. బిడ్డను కని ఇచ్చే మహిళకు అవసరమైన వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము ఇవ్వాలి తప్ప ఇతరత్రా డబ్బిస్తే అది వాణిజ్యపరమైన సరోగసీ అవుతుందని బిల్లు చెబుతోంది. నిజానికి అన్యులైతే చట్టవిరుద్ధంగా డబ్బు ప్రమేయంతో సరోగసీ సాగుతుందని అనుమానించి, సన్నిహిత బంధువులైన మహిళలు మాత్రమే సరోగసీకి అర్హులని బిల్లులో నిబంధన పెట్టారు. సెలెక్ట్ కమిటీ దీన్ని తొల గించాలని సూచించడం మంచిదే అయినా... ఎవరికోసమో బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుని, అందుకోసం తొమ్మిదినెలలపాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొనడానికి సిద్ధపడే మహిళ ఆ పని నిస్వార్థంగా చేయాలన్న నిబంధన సరికాదు. దీన్ని కూడా కమిటీ వ్యతిరేకించి ఉంటే బాగుండేది. భారత్‌లో సంతానం లేని జంటల కోసం ఎంతో పెద్ద మనసుతో, త్యాగబుద్ధితో సరోగసీకి సిద్ధపడే మహిళలుంటారన్న భుజకీర్తులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. డబ్బు లావాదేవీలు మాత్రం చట్టం కన్నుగప్పి సాగుతూనే ఉంటాయి. ఇందులో ఉండే సమస్యేమంటే... తొలుత అంతా మాట్లాడుకుని, ఆ తర్వాత మహిళకు సొమ్ము ఎగ్గొట్టిన పక్షంలో ఆ నిస్సహాయురాలికి చట్టం అండ దండలుండవు. పైగా ఫిర్యాదు చేస్తే ఆమె కూడా చట్టప్రకారం నిందితురాలవుతుంది. కనుక మౌనంగా ఉండిపోవాల్సివస్తుంది. అయితే సరోగసీకి సిద్ధపడే మహిళకు వైద్య ఖర్చులు, బీమా సౌకర్యంతోపాటు పౌష్టికాహార అవసరాలు, గర్భిణిగా ధరించాల్సినవి సమకూర్చుకోవడానికయ్యే ఖర్చుల్ని కూడా ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టాలని కమిటీ సూచించింది. బీమా సౌకర్యం ఇప్పుడున్న 16 నెలలనుంచి, 36 నెలలకు పొడిగించాలన్నది. ఏదేమైనా సరోగసీ బిల్లు రూపకల్పనలో మహిళా కార్యకర్తలు, ఆరోగ్య రంగ కార్యకర్తల అభిప్రాయాలకు చోటిచ్చివుంటే బాగుండేది. -
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది. ► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది. ► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది. ► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది. ► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. -
ప్రభుత్వానికీ విచక్షణాధికారం
సాక్షి, అమరావతి: శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి కూడా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని, వాటికి విరుద్ధంగా ఎలా చెబితే అలా అధికారులు చేయలేరని అన్నారు. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం మంత్రులకు లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. రూల్ ప్రకారం వెళ్లాలని అధికార పక్షం కోరితే, ప్రతిపక్షం మాత్రం రూల్‌కు విరుద్ధంగా వెళ్లాలని చెప్పడం మండలి చరిత్రలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర పరిణామమని బొత్స అన్నారు. ఆ విషయం కేంద్రం ఎప్పుడో చెప్పింది రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్ చేయూత’ పథకం అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ఆయా వర్గాల పేద మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారు అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రబాబు నిరూపించాలి రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆ విషయం నిరూపించగలరా? అని బొత్స సవాల్ విసిరారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీడియా, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. -
లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లేని సెలెక్ట్ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి యువజన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సభలో టీడీపీకి నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారని ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను తాత్కాలిక అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరని సజ్జల అన్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల బరితెగింపు యవ్వారాలు మరింత పెరిగాయి. ఇప్పటికే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న పచ్చ పార్టీ తాజాగా సెలెక్ట్ కమిటీ పేరుతో తప్పుడు ప్రచారానికి తెరతీసింది. శాసన మండలి చైర్మన్ అన్ని పార్టీలకు సెలెక్ట్ కమిటీ విషయమై లేఖలు రాశారంటూ అనుకూల మీడియాకు అసత్యపు లీకులు విడుదల చేస్తున్నారు. దీంతో చైర్మన్ లేఖల పేరుతో ఎల్లో మీడియాలో టీడీపీ విషప్రచారానికి పూనుకుంది. కాగా, ఈ విషయమై పలు రాజకీయ పార్టీలను వివరణ కోరగా.. తమకు మండలి చైర్మన్ నుంచి ఎటువంటి లేఖలు అందలేదని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల వద్ద చైర్మన్ లేఖల అంశాన్ని ప్రస్తావించగా ముఖం చాటేస్తున్నారు. ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని అసెంబ్లీ అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా సెలెక్ట్ కమిటీపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు. లేఖలతో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. -
బిల్లుపై స్పష్టతనిచ్చిన మండలి చైర్మన్
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. మండలి చైర్మన్ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై మండలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే సందిగ్దత నెలకొంది. (చదవండి : నన్నెవరూ బెదిరించలేదు: షరీఫ్) ఇక ‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా? మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు? -
చైర్మన్ నిర్ణయం అనైతికం కాదా..?
-
ఆ పిటిషన్లను ప్రస్తుతం విచారణకు స్వీకరించలేం
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వ్యాజ్యాలపై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మండలిలో బుధవారం జరిగిన పరిణామాల గురించి ఆరాతీసింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమాధానమిస్తూ.. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, సెలెక్ట్ కమిటీ నిర్ణయం వెలువరించేంత వరకు వేచిచూడాలని పిటిషనర్లకు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని.. వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని వివరించారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ గురించి బిజినెస్ రూల్స్ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశి్నంచింది. సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువు ఉందని రోహత్గీ వివరించగా.. అందుకే అప్పటి వరకు ఆగాలని పిటిషనర్లకు సూచించింది. అవి సాధారణ బిల్లులే.. ద్రవ్య బిల్లులు కాదు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ వాదనలు వినిపిస్తూ.. ఆ రెండు బిల్లులకు గవర్నర్ అనుమతి అవసరమని, అయితే గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనికి రోహత్గీ అడ్డుతగులుతూ, ఆ బిల్లులు ద్రవ్యబిల్లులు కాదని స్పష్టంగా చెప్పామని, అలాంటప్పుడు ద్రవ్యబిల్లుకు వర్తించే రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. అశోక్‌భాన్ జోక్యం చేసుకుంటూ, బుధవారం అడ్వొకేట్ జనరల్ ఈ రెండింటిని అధికరణ 207 కింద సాధారణ బిల్లులుగా చెప్పారన్నారు. భాన్ వాదనను ధర్మాసనం ఖండిస్తూ.. సాధారణ బిల్లులని మాత్రమే ఏజీ చెప్పారని, అధికరణ 207 కింద బిల్లులని చెప్పలేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాలు తేలేంత వరకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని అశోక్‌భాన్ కోరారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే.. ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం పేర్కొంది. -
మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించిపంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బుధవారం మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నిబంధనలు పాటించకుండా చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారన్నారు. మండలిలో అధికార పార్టీ ఎమ్మెల్సీలతో పాటు, బీజేపీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు అందరూ సెలెక్ట్ కమిటీని వ్యతిరేకించినా ఒక టీడీపీ కార్యకర్తలాగా చైర్మన్ వ్యవహరించి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే బిల్లులను అడ్డుకునే అధికారం మండలికి లేదని, కేవలం ఆ బిల్లులపై అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు మాత్రమే చెప్పేహక్కు ఉందన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు అర్హతలేని వారందరినీ దొడ్డిదారిన రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తమను ఉద్దేశించి మాట్లాడుతూ తాగి వచ్చారని అన్నారని, యనమల వ్యాఖ్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళితే నారా లోకేష్ తనపైకి దురుసుగా వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చోని సెల్ఫోన్లో సూచనలు ఇస్తూ చైర్మన్‌ను ప్రభావితం చేశారని చెప్పారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మండలి పరిణామాలను ఎల్లోమీడియా వక్రీకరించి కథనాలు రాసిందని, తప్పు చేశానని చైర్మనే చెప్పినా కూడా ఆ పత్రికలు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ఆ రెండు పత్రికలు రాష్ట్రాన్ని శాసిస్తాయా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అప్రజాస్వామ్యిక విధానాలు అమలు చేస్తుంటే ఎలా సమరి్థంచాలని, దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా చర్చించాలని అన్నారు. తాము ప్రజాబలంతో రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. -
సెలెక్ట్ కమిటీకి ‘డేటా’ బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో.. పౌరుల సమాచార భద్రతకు ఉద్దేశించిన ‘వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు’పై (పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు) కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ ప్యానల్ పరిశీలనకు పంపిస్తున్నట్లు ఐటీ మంత్రి రవి శంకర్ చెప్పారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను బడ్జెట్ సమావేశాల్లోపు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తడం తెల్సిందే. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. ఆందోళనల నేపథ్యంలో బిల్లును కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు. -
శ్రీలంక పార్లమెంట్ నిర్వహణకు సెలెక్ట్ కమిటీ
కొలంబో: పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అక్టోబర్ 26న ప్రధాని విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంట్లో బలపరీక్ష జరపగా..కొత్త ప్రధాని రాజపక్స అందులో ఓడిపోయారు. ఈ పరిణామం అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు గందరగోళం మధ్య సాగుతున్నాయి. సభా కార్యకలాపాలు సవ్యంగా సాగేలా చూసేందుకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి ప్రతిపాదనకు సోమవారం అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, ఇందులో ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉండాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ప్రశ్నల వర్షం...
సింగపూర్ : కేంబ్రిడ్జ్ అనలిటికా అంశంపై ఫేస్బుక్ వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత ప్రభుత్వం కూడా వివరణ కొరుతూ ఫేస్బుక్ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పలు దేశాల అంతర్గత చర్చల్లో కూడా ఫేస్బుక్ డేటా లీకేజీ చర్చనీయాంశంగా మారింది. కానీ సింగపూర్ మాత్రం ఫేస్‌బుక్‌కు నేరుగా తమ అభిప్రాయాలను తెలిపింది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగపూర్ మంత్రి ఫేస్బుక్ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సింగపూర్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ వారం రోజుల పాటు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తి గురించి పరిశీలించి, నివేదిక రూపొందించింది. ఈ కమిటీలో ఫేస్బుక్ పసిఫిక్ ఆసియా ఉపాధ్యక్షుడు(పబ్లిక్ పాలసీ) సైమన్ మిల్లర్‌తో పాటు గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ నివేదిక గత గురువారం రోజు(మార్చి 22) పార్లమెంటేరియన్ సదస్సులో చర్చకు వచ్చింది. ఫేస్బుక్, గూగుల్, ట్వీట్టర్పై కమిటీ అధ్యయనం చేసినప్పటికీ, ఫేస్బుక్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సింగపూర్ న్యాయశాఖ మంత్రి కె. షణ్ముగం, ఫేస్బుక్ ప్రతినిధి మిల్లర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేంబ్రిడ్జ్ అనలిటికా ద్వారా 5 కోట్ల మంది వివరాలు చోరికి గురయినప్పటికీ ఫేస్బుక్ గుర్తించలేకపోయిందని షణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అకౌంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో దాదాపు గంట పాటు షణ్ముగం, మిల్లర్ మధ్య వాగ్వాదం నడిచింది. ఫేస్‌బుక్‌పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. మిల్లర్ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నిస్తుంటే ‘యస్ ఆర్ నో’ ఏదో ఒకటే చెప్పాలన్నారు . గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు తమ సైట్లలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ఏకధాటిగా ప్రశ్నలు
-
తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ప్రతిష్టంభన వీడలేదు. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లుపై చర్చను ప్రారంభించాలని ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో గురువారం ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదాపడింది. ట్రిపుల్ తలాక్‌పై ప్రతిపక్ష సభ్యుల సవరణ తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెల్లనిదిగా ప్రకటించడంతో ప్రతిపక్షం నిరసన కొనసాగించింది. బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం రానట్లయితే చర్చ సాధ్యం కాదని స్పష్టం చేస్తూ సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా నేడే శీతాకాల సమావేశాల చివరి రోజు కావడంతో.. బిల్లు ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ చర్చకు చేపట్టింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, తృణమూల్ ఎంపీ సుఖేందు రాయ్‌లు బుధవారం ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు నిబంధనలకు అనుగుణంగా లేదని.. దానిని తిరస్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. అయితే తన తీర్మానంపై చర్చించాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఆ తీర్మానం చెల్లదని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం రాకుండా చర్చ సాధ్యం కాదని సభకు కురియన్ స్పష్టం చేశారు. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ లేచి ‘ముస్లిం మహిళలకు ప్రతిపక్షం సాధికారతను కోరుతుంటే ప్రభుత్వం మాత్రం వారిని నిరాశ్రయుల్ని చేయాలని చూస్తోంది’ అని ఆరోపించారు. వెంటనే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ.. ‘ప్రతిపక్షం నిజంగానే మహిళల సాధికారతను కోరుతుంటే.. వెంటనే బిల్లుపై చర్చించాలి’ అని సూచించారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చించకుండానే గురువారం రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు ఉదయం సభ ప్రారంభం కాగానే మహారాష్ట్రలో కుల ఘర్షణల్ని రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. ఘర్షణలపై నిష్పాక్షిక, త్వరితగతి విచారణ నిర్వహించి దోషుల్ని శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. జడ్జీల జీతాల పెంపు బిల్లుకు ఆమోదం సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల జీతాల్ని రెండింతలకు పైగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. మరోవైపు ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(సవరణ) బిల్లు, ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్ట్రప్సీ కోడ్(సవరణ) బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో సవరణలను ఇంతకుముందే రాజ్యసభ ఆమోదించింది. ‘న్యాయవ్యవస్థ పరిధి మీరొద్దు’ శాసన సంబంధ విషయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పరిధులు దాటరాదని లోక్‌సభ అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ జోక్యాన్ని గనుక నిలువరించకుంటే వచ్చే పదేళ్లలో న్యాయ, శాసస వ్యవస్థల మధ్య సంక్షోభం తలెత్తుతుందని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాల మాదిరిగానే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణలను నేరుగా ప్రసారం చేయాలని కొందరు సూచించారు. చర్చలతో పరిష్కరించుకోండి రాజ్యసభ సజావుగా నడిచేందుకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. పలు అంశాలపై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది సభ ప్రతిష్టను పెంచేందుకేనని, సభ్యులు కూడా అదే విధంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై విభేదాల్ని అధికార, ప్రతిపక్ష సభ్యులు పరిష్కరించుకోవాలని వెంకయ్య సూచించినట్లు సమాచారం. రాజకీయ ఎజెండా కోసం తరచూ సభకు అంతరాయం కలిగించడం, వాయిదా పడటం సరైందా? కాదా? అనే అంశంపై పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రధాన పార్టీలు సభకు అంతరాయం కలిగిస్తూ.. చిన్న పార్టీలకు అవకాశం రాకుండా చేస్తున్నాయని కొందరు సమావేశంలో ఫిర్యాదు చేశారు. -
పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు అంశంలో బీజేపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి పార్లమెంట్ కమిటీకి(సెలక్ట్) సమీక్ష కోసం పంపేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అవి చేసే సూచనలు, ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణించాల్సి ఉంటుంది. అదే జరిగితే వచ్చే పార్లమెంట్ సెషన్స్‌లోనే బిల్లు మళ్లీ చర్చకు వచ్చే అవకాశాలున్నాయి . కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు స్పష్టమైన మెజార్టీతో ఆమోదం పొందగా, రాజ్యసభలోనే కాంగ్రెస్ పార్టీ, విపక్షాల నినాదాలతో చర్చకు కూడా నోచుకోకుండానే పోయింది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ కీలకనేతలు కాంగ్రెస్ పార్టీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసారంగా ట్రిపుల్ తలాక్ బిల్లు లేదని, అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవటం, దీనికితోడు అన్నాడీఎంకే, బిజ్జూ జనతా దళ్ సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనని కోరటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
జీఎస్టీ బిల్లుకు సెలెక్ట్ కమిటీ మద్దతు
భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన కాంగ్రెస్, అన్నాడీఎంకే, లెఫ్ట్ పార్టీలు న్యూఢిల్లీ: దేశ పరోక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలకు ఉద్దేశించిన ‘వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ’ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. జీఎస్టీ బిల్లును అధ్యయనం చేసేం దుకు బీజేపీ సభ్యుడు భూపేందర్ యాద వ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 21 మంది సభ్యు ల కమిటీ బుధవారం రాజ్యసభకు తన నివేదికను సమర్పించింది. జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు మొత్తం నష్టా న్ని పరిహారంగా ఇవ్వాలన్న ప్రతిపాదన సహా బిల్లులోని దాదాపు అన్ని ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయాన్ని కోల్పోతాయని, ఆ మేరకు కేంద్రం పరిహారం అందించాలని టీఎంసీ సహా పలు పార్టీలు డిమాండ్ చేసిన విషయంతెలిసిందే.అంతర్రాష్ట్ర సరుకు రవాణా విషయంలో రాష్ట్రాలకు అదనంగా 1 శాతం లెవీ విధించుకునే అధికారానికి సంబంధించి కూడా కమిటీ ఒక సవరణ చేసింది. అమ్మిన వస్తువులపైననే ఆ 1% అదనపు పన్ను విధిం చాలని, కంపెనీల మధ్య జరిగే వస్తు నిల్వల అంతర్రాష్ట్ర రవాణాపై ఆ అదనపు భారం వేయకూడదని సూచించింది. ఈ విషయాన్ని బిల్లులో వివరించాలంది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,అన్నాడీఎంకే, లెఫ్ట్ సభ్యు లు నివేదికలో తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును యథాతథంగా అంగీకరించబోమన్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం లభించ గా.. రాజ్యసభలో మెజారిటీ ఉన్న విపక్షాల ఒత్తిడిపై ఎంపికసంఘానికి పంపించారు. 2016, ఏప్రిల్ 1నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కమిటీచేసిన సూచనలు.. -అదనపుపన్ను విధింపు అధికారాన్ని ఇప్పుడు బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. పన్ను భారంపెరుగుతుంది. బిల్లులో పేర్కొన్న అన్ని రకాల సరఫరా’ అనే పదంలో ‘సరఫరా’ అనేపదాన్ని స్పష్టంగా నిర్వచించాలి. * పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్న నిర్ణయం హర్షణీయం. * రాష్ట్రాల ఆదాయ వనరులు పెంచేందుకు ‘బ్యాండ్ రేట్’ నిర్వచనాన్ని చట్టంలోనే పొందుపర్చాలి. స్థానిక అవసరాల కోసం ఎంపిక చేసిన వస్తు, సేవలపై రాష్ట్రాలు అదనపు పన్ను విధించుకోవచ్చు. అయితే, అది బ్యాండ్ రేట్ పరిధి లోపలే ఉండాలి. -
సెలెక్ట్ కమిటీకి గనుల బిల్లు
నిరసనల మధ్య రాజ్యసభలో బిల్లు న్యూఢిల్లీ: బీజేపీకి బలం లేని రాజ్యసభలో విపక్షాలు మరోసారి పంతం నెగ్గించుకున్నాయి. మంగళవారం గనులు, ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. బిల్లును నేరుగా ఆమోదింపజేసుకోవాలనుకున్న ప్రభుత్వ యత్నం విఫలమైంది. మెజారిటీ లేని కారణంగా విపక్షాల ఒత్తిడికి తలొగ్గి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష సవరణను ఆమోదిందించిన నిస్సహాయ స్థితి నుంచి తేరుకోకముందే ప్రభుత్వానికి పెద్దల సభలో మళ్లీ షాక్ తగిలింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య రాజ్యసభలో మంత్రి నరేంద్ర సింగ్ గనుల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చకు ముందే విపక్షాలు బిల్లుపై అభ్యంతరం చెప్పాయి. దీన్ని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలా వద్దా అన్న అంశంపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. తమ వాదనలకు బలంగా అధికార, విపక్షాలు సభా నియమాలను చెప్పుకొచ్చాయి. ప్రభుత్వం దొడ్డిదారిన చట్టాలు తెస్తోందని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. నిరసన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో బిల్లును స్థాయీసంఘానికి పంపడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ సంఘానికి కాలపరిమితిని బుధవారం నిర్ణయిస్తారు. -
‘బీమా’పై చర్చలు విఫలం
అఖిలపక్షంలో కుదరని ఏకాభిప్రాయం సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాల పట్టు న్యూఢిల్లీ: వివాదాస్పద బీమా బిల్లుపై సందిగ్ధం నెలకొంది. సోమవారం ఇది రాజ్యసభలో చర్చకు రావాల్సి ఉన్నప్పటికీ.. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని 9 విపక్షాలు చైర్మన్‌కు నోటీసిచ్చాయి. వెంటనే ప్రతిపక్షాలతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో ప్రస్తుతానికి బిల్లు మూలన పడినట్లే కనిపిస్తోంది. ప్రధాని మోడీ చేపడుతున్న ఆర్థిక సంస్కరణల్లో భాగంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రభుత్వానికి కేవలం 68 మంది బలమే ఉంది. దీంతో బిల్లు గట్టెక్కాలంటే కాంగ్రెస్, ఇతర పక్షాల మద్దతు తప్పనిసరి. బిల్లులోని కొన్ని అంశాలపై ఆయా పార్టీల నేతలు అభ్యంతరాలు తెలపడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సోమవారమే వారితో భేటీ అయ్యారు.ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బిల్లులోని అంశాలే తాజా బిల్లులోనూ ఉన్నాయని, పెద్దగా మార్పుల్లేవన్నారు. అయినా విపక్ష నేతలు వినిపించుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఈ కీలక బిల్లు విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇస్తే వాటిని కూడా పరిశీలించి.. సభలో చర్చకు పెడతామని కేంద్రం ఇప్పటికే విపక్షాలకు స్పష్టం చేసింది. బిల్లును గత ప్రభుత్వ హయాంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, అప్పుడే దాన్ని ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అప్పగించారని వెంకయ్యనాయుడుతెలిపారు. ఆ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని మళ్లీ బిల్లును తీసుకొచ్చామని మీడియాకు చెప్పారు. మరో రెండు రోజుల్లో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించామని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. సిండికేట్ బ్యాంక్ సీఎండీ సస్పెన్షన్ న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సిండికేట్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) ఎస్కే జైన్‌ను ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. భూషణ్ స్టీల్ కంపెనీ రుణపరిమితిని పెంచేందుకు రూ. 50 లక్షలు లంచం తీసుకున్నాడంటూ జైన్‌ను సీబీఐ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జైన్‌ను విధుల్లోంచి తొలగించామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి జీఎస్ సంధూ ప్రకటించారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సిండికేట్ బ్యాంక్‌కు గత ఏడాది జూలైలో జైన్ సీఎండీగా నియమితులయ్యారు. జైన్‌తో పాటు మరో ఏడుగురిని ఆదివారం అదుపులోకి తీసుకున్న సీబీఐ.. మరో నాలుగురోజులపాటు వారిని విచారించనుంది. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తుండటం విశేషం. భూషణ్ స్టీల్ కంపెనీ, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 100 కోట్ల రుణాన్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించడాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలు జైన్‌పై ఉన్నాయని సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి.