కేంబ్రిడ్జ్ అనలిటికా అంశంపై ఫేస్‌బుక్ వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత ప్రభుత్వం కూడా వివరణ కొరుతూ ఫేస్‌బుక్ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పలు దేశాల అంతర్గత చర్చల్లో కూడా ఫేస్‌బుక్ డేటా లీకేజీ చర్చనీయాంశంగా మారింది. కానీ సింగపూర్ మాత్రం ఫేస్‌బుక్‌కు నేరుగా తమ అభిప్రాయాలను తెలిపింది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగపూర్ మంత్రి ఫేస్‌బుక్ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించారు.