shanmugam
-
లెదరు బ్యాగూ... బ్రీఫు కేసూ...
ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ రోజున చాలా విరివిగా వాడుతున్న మాట, ‘బడ్జెట్’. వ్యక్తిగత స్థాయిలో గృహస్థు, లేదా గృహిణి ఎప్పటికప్పుడు జమా, ఖర్చులు బేరీజు వేసుకుంటూ ఒడుపుగా సంసారాన్ని నడపడం కూడా బడ్జెట్ కూర్పు లాంటిదే. ప్రభుత్వాల స్థాయిలో అయితే ఏడాది కాలానికి సరిపోయే ఆదాయ, వ్యయాల ప్రణాళికకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అది యావద్దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది కనుక అన్ని వర్గాలవారూ దానికోసం చకోరపక్షులవుతారు. తీరా వచ్చాక ఆశాభంగాలూ ఉంటాయి, ఆశోద్దీపనలూ ఉంటాయి. ఆ విధంగా బడ్జెట్ ఆర్థికాంశాల కూర్పే కాదు; ఆశ నిరాశల కలగలుపు కూడా! కిందటి వారమే కేంద్రం స్థాయిలో మరో బడ్జెట్ సమర్పణ ముగిసింది కానీ, దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడమూ ఆసక్తిదాయకమే. లాటిన్లో తోలుసంచీని ‘బుల్గా’ అనేవారు. ఆ మాటే ఫ్రెంచిలో ‘బూజ్’, ‘బగెట్’ అయింది. వాటినుంచే ‘బడ్జెట్’ పుట్టి 15వ శతాబ్ది నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆదాయ, వ్యయాల ముందస్తు ప్రకటన అనే అర్థంలో ఈ మాటను మొదటిసారి 1733లో ఉపయోగించారట. కోశాగార మంత్రి తన ద్రవ్య ప్రణాళికను ఉంచుకునే తోలుసంచీ ‘బడ్జెట్’ అనే మాటను ప్రపంచానికి అందించింది. ఈ రోజున విరివిగా వాడే ‘వాలెట్’, ‘పౌచ్’లు కూడా బడ్జెట్ అనే తోలుసంచీకి లఘురూపాలే. 14వ శతాబ్ది నుంచి వాడుకలో ఉన్న ‘వాలెట్’కు వస్తువులను చుట్టబెట్టేదని అర్థం. ఇది ‘వెల్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలం నుంచి వచ్చింది. విశేషమేమిటంటే, సంస్కృతంలో ‘వలతే’, ‘వలయం’ అనే మాటల మూలాలు కూడా ‘వెల్’లోనే ఉన్నాయని భాషావేత్తలు అంటారు. ‘పౌచ్’ అనే మాటే రకరకాల రూపాల మీదుగా ‘ప్యాకెట్’ అయింది. బడ్జెట్ అనబడే తోలుసంచే బడ్జెట్ రోజున నేటి ఆర్థికమంత్రులు చేతుల్లో బ్రీఫ్ కేస్‌గా మారిన సంగతిని ఊహించడం కష్టం కాదు. బడ్జెట్ వివరాల గోప్యతకు సంకేతంగా కూడా దానిని తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో మన దేశంలో బడ్జెట్ సంప్రదాయం 1860లో మొదలైందనీ, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భారత ఆర్థికమంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్ దానికి నాంది పలికారనీ చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ సమర్పకులు ఆర్.కె.షణ్ముగం చెట్టి కాగా, బడ్జెట్‌కు నేటి రూపూ, రేఖా కల్పించిన ఆర్థిక పండితుడు పి.సి.మహలనోబిస్. అయితే, చరిత్ర కాలానికి వెళితే, మౌర్యుల కాలంలోనే ఒక ఏడాదికి సరిపోయే బడ్జెట్‌నూ, గణాంకాలనూ కూర్చేవారని చరిత్ర నిపుణులంటారు. ఆ కాలానికే చెందిన కౌటిల్యుని అర్థశాస్త్రం దానికి ఆధారం. కాకపోతే, అప్పట్లో ఏడాదికి 354 రోజులు. గురుపూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ నుంచి సంవత్సరాన్ని లెక్కించేవారు. నేటి బడ్జెట్ తరహా కూర్పే ఇంచుమించుగా అర్థశాస్త్రంలోనూ కనిపిస్తుంది. అర్థమంటే డబ్బు కనుక అర్థశాస్త్రం కేవలం ఆర్థిక విషయాలే చెబుతుందనుకుంటారు కానీ, కౌటిల్యుని ఉద్దేశంలో అర్థమంటే, మనుషుల జీవన విధానానికీ, వారు నివసించే భూమికీ చెందిన అన్ని విషయాలనూ చెప్పేదని– ప్రసిద్ధ సంçస్కృత పండితుడు, అర్థశాస్త్ర వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు అంటారు. అర్థశాస్త్రం ప్రకారం నాటి బడ్జెట్ సంవత్సరాన్ని ‘రాజవర్షం’ అనేవారు. నేటి ఆర్థికమంత్రిని పోలిన అధికారిని ‘సమాహర్త’ అనేవారు. ఏయే ఆదాయ వనరు నుంచి ఎంత ఆదాయం రావాలో నిర్ణయించడం, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం అతని బాధ్యత. ‘ఆయముఖాలు’ అనే పేరుతో ఆదాయాన్ని వర్గీకరించేవారు. ఆదాయమిచ్చే వస్తువును ‘ఆయశరీర’ మనేవారు. నగరం, జనపదం, గనులు, సేద్యపు నీటి వనరులు, అడవులు, పశువుల పెంపకం, వర్తక మార్గాలు, వ్యవసాయం, సుంకాలు, జరిమానాలు, తూనికలు, కొలతలు, ప్రవేశానుమతులు (పాస్‌పోర్ట్‌లు), మద్యం, దారం, నెయ్యి, ఉప్పు, ఖనిజాలు, రంగురాళ్ళు, బంగారపు పని, కళారంగం, ఆలయాలనే కాక; ఆ కాలపు రీతి రివాజులను బట్టి వేశ్యావృత్తిని, జూదాన్ని కూడా ఆదాయ మార్గంగానే చూసేవారు. వీటిలో ఒక్కోదానికీ పర్యవేక్షణాధికారి ఉండేవాడు. మతపరమైన తంతులు, సాయుధ దళాలు, ఆయుధాలు, గిడ్డంగులు, కర్మాగారాలు, కార్మికులు, రాజప్రాసాద నిర్వహణ ప్రభుత్వం ఖర్చు కిందికి వచ్చేవి. రాజుకు వ్యక్తిగత సంపద ఉండేది కానీ, రాచకుటుంబంలోని మిగతా సభ్యులకు జీతాలు చెల్లించేవారు. అయితే, ఆదాయం చాలావరకు వస్తురూపంలో ఉండేది కనుక గిడ్డంగులలో భద్రపరిచేవారు. గిడ్డంగులపై అధికారిని ‘సన్నిధాత్రి’ అనేవారు. ఇంకా విశేషమేమిటంటే, నేటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ లాంటిదే అప్పుడూ విడిగా ఉండేది. ఆదాయవ్యయ పత్రాలనూ, లెక్కలనూ తనిఖీ చేసే ఆ విభాగాధికారిని ‘అక్షపటలాధ్యక్షుడ’నేవారు. ఇప్పుడున్నట్టు ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నులు, వడ్డీ రాయితీ వంటివీ; సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవల వంటి వర్గీకరణలూ; సంక్షేమ స్పృహా అప్పుడూ ఉండేవి. కాకపోతే ఇప్పటిలా అభివృద్ధి కేంద్రితమైన ఆలోచనలు అర్థశాస్త్రంలో లేవని పండితులంటారు. కాలానుగుణమైన తేడాలను అలా ఉంచితే, ‘‘ప్రజాహితమే రాజు హితం, ప్రజలకు ప్రియమైనదే రాజుకూ ప్రియమైనది కావా’’లనే అర్థశాస్త్ర నిర్దేశం త్రికాల ప్రభుత్వాలకూ వర్తించే తిరుగులేని సూత్రం. -
టీడీపీ నేత షణ్ముగం అరెస్ట్
-
‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు'
2005లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో మొదలైన షణ్ముగం నేరచరిత్ర ఇప్పటి వరకు 14 కేసులకు చేరుకుంది. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన పాత్రికేయుడిని బెదిరించడం నుంచి విధినిర్వహణలో ఉన్న పోలీసును కొట్టడం, మోసాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, చెక్‌బౌన్స్ కేసులు ఇలా జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, బంగారుపాళ్యం తదితర ఏడు స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టుకాకుండా టీడీపీ నేతల పేర్లుచెప్పి ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. చిత్తూరు టౌన్ బ్యాంకును బురిడీ కొట్టించిన కేసులో ఎట్టకేలకు అరెస్టయ్యాడు. సాక్షి, చిత్తూరు అర్బన్: షణ్ముగం.. చిత్తూరులో పరిచయం అవసరం లేని పేరు. ఎంతటివారైనా ఇతని వాగ్ధాటి ముందు చిన్నబోవాల్సింది. వేటగాడి ఉచ్చునుంచి చిరుతపులైనా తప్పించుకోవచ్చుగానీ.. ఇతని మాటల ఉచ్చు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి వ్యక్తికి నాటి టీడీపీ పాలకులు వేలాదిమంది ఖాతాదారులు కష్టాన్ని దాచుకున్న టౌన్‌బ్యాంకు పాలకవర్గం పగ్గాలు అప్పగించారు. దొంగ చేతికి తాళం అందినట్టుగా చైర్మన్ హోదాలో బ్యాంకుకే శఠగోపం పెట్టాడు. 5.16 కిలోల నకిలీ బంగారు ఆభరణాలతో తప్పుడు ఖాతాలతో చిత్తూరు సహకార టౌన్‌బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ మోసగాడి దెబ్బకు బకాయిలు రూ.1.20 కోట్లకు చేరుకున్నాయి. అతన్ని మంగళవారం అరెస్టుచేసిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిత్తూరు నగర డీఎస్పీ కవలకుంట్ల ఈశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ ఎన్.భాస్కర్‌రెడ్డిలు విలేకరులకు షణ్ముగం నేరాలచిట్టాను వివరించారు. చదవండి: అమరావతిలో పరిటాల బంధువుల పాగా షణ్ముగంను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ♦టౌన్‌బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడే షణ్ముగం ఉద్దేశపూర్వకంగా బ్యాంకును బురిడీకొట్టించాలని పథకం పన్ని ఖాతాదారుల డిపాజిట్ల నుంచి నకిలీ బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో తన ఇద్దరు భార్యలకు రెండు కార్లు, మొదటి భార్య కుమార్తెకు నాగాలమ్మ గుడి వద్ద ఓ ఇల్లు, రెండో భార్య పేరిట టెలిఫోన్ కాలనీలో మరో ఇల్లు కొన్నాడు. దాదాపు రూ.కోటి విలువచేసే ఆస్తు లు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ♦టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి వద్ద తన కుమారుడు పేషీగా పనిచేస్తున్నట్లు చూపించి టీటీడీకి వందలాది సిఫారసు లేఖలు ఇచ్చి దర్శనాలు, గదులు, ప్రసాదాలు పొందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని టీటీడీ విజిలెన్స్‌కు లేఖ రాస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ♦ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు గుంజేసినట్లు ఫోన్లో ఫిర్యా దులు వచ్చాయని.. దీనిపై బాధితులు ధైర్యంగా ముందుకువచ్చి జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెట్టొచ్చని డీఎస్పీ పేర్కొన్నారు. ♦ తిరుపతిలో ఇనామ్ భూములు పేరుమార్చి ఇస్తానని చెప్పి రూ.17.60 లక్షలు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి చెందిన కృష్ణారెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆభరణాలు తాకట్టుపెడతానని చెప్పి తనపేరిట ఖాతా తెరచి తీరా నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రూ.6.55 లక్షలు అప్పుచేశాడని మరో బాధితుడు చిరంజీవి తెలిపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసినట్లు తాజాగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు మరో ఫిర్యాదు అందగా.. దీనిపై విచారణ చేస్తున్నారు. ఇంత జరిగిన తరువాత ఎలాంటి వ్యక్తిలో అయినా పశ్చాత్తాపం ఉంటుంది. కానీ షణ్ముగం మాత్రం ‘‘బ్రదర్.. ఇది పూర్తిగా అన్యాయం. నాపై రాజకీయకక్షతో కేసులు పెట్టించారు. నాకేమీ తెలియదు..’’ అంటూ కేకలు వేయడం అతనికే చెల్లుతుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న వ్యక్తికి టౌన్‌బ్యాంకు చైర్మన్ పదవిలో ఎలా కూర్చోబెట్టారని పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షణ్ముగంపై రౌడీషీట్ తెరవడానికి ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. తమ పేరిట నకిలీ బంగారు పెట్టాడని చెబుతున్న బాధితుడు చిరంజీవి టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్ చిత్తూరు సహకార టౌన్బ్యాంకును మోసం చేసి నకిలీ ఆభరణాలతో రూ.1.20 కోట్లు బకాయిపడ్డ టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిరుపమాబాంజ్దేవ్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం షణ్ముగంను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరులోని 4వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. షణ్ముగంను మార్చి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ టీడీపీ నేత అరెస్ట్
-
చిత్తూరు బ్యాంకుపై టీడీపీ నేత భస్మాసుర హస్తం
నిగనిగలాడే ఖద్దరు షర్టు. నలుగురిలో నిలబడితే ‘ఏం బ్రదర్’ అంటూ గంభీరమైన గొంతుసమావేశాల్లో ఊకదంపుడు ప్రసంగాలు.కారు రోడ్డుపైకి వస్తే హంగామావీటన్నింటికంటే మించితెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి.అతనే చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగం. సీన్ కట్‌చేస్తే..బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ కేసు. చిత్తూరు అర్బన్: చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో భారీ మోసం వెలుగుచూసింది. గిల్టు నగలను బ్యాంకులో తాకట్టుపెట్టి ఏళ్ల తరబడి ఖాతాదారుల సొమ్ముతో జల్సా చేశారు. అధికారులను బెదిరించి.. మభ్యపెట్టి లోబరుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న పి.షణ్ముగం ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడంటూ బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం షణ్ముగంపై 420 కేçసు నమోదైంది. చిత్తూరు నగరంలోని సహకార టౌన్ బ్యాంకుకు మూడు శాఖలున్నాయి. వీటిలో దర్గా బ్రాంచ్ మేనేజరు పిఆర్.సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదులో.. ‘‘2014 నుంచి టౌన్ బ్యాంకు చైర్మన్‌గా షణ్ముగం కొనసాగుతున్నాడు. 2016–17వసంవత్సరంలో షణ్ముగం తనకు సంబంధించిన 12 మంది వ్యక్తులతో గిల్టు నగలు కుదువపెట్టాడు. అప్రైజర్ జీఎం.ధరణీసాగర్‌ను బెదిరించి 39 ఖాతాల్లో రుణాలు తీసుకున్నాడు. నన్ను గత ఏడాది 18వ తేదీ బదిలీ చేయించాడు. కొత్త మేనేజరుకు లెక్కలు చెప్పడానికి కుదువలో ఉన్న ఆభరణాలు పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. అప్రైజర్‌ను నిలదీయగా షణ్ముగం తనను బెదిరించి, ఉద్యోగం నుంచి తీసేస్తాని చెప్పి రుణాలు తీసుకున్నాడని చెప్పాడు. దీంతో నేను, అప్రైజర్ కలిసి షణ్ముగంను సంప్రదించాం. చైర్మన్‌గా నేనుండా మీకెందుకు భయం..? ఏదైనా సమస్య వస్తే నా ఆస్తులు అమ్మైనా డబ్బులు కట్టేస్తా అని మమ్మల్ని మభ్యపెట్టాడు. మాకు భయంవేసి పలు మార్లు షణ్ముగంను నిలదీస్తే ఇందులో నాకు సంబంధం లేదని, ఏంచేస్తారో చేసుకోండి అంటూ అడ్డం తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ మేనేజరు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర శాఖలపై అనుమానం దర్గా బ్రాంచ్‌లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో నకిలీ నగలతో దాదాపు రూ.80 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి వడ్డీ కలిపి రూ.1.20 కోట్లు పేరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చని అధికారులు సందేహిస్తు్తన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా టీడీపీలో ఇద్దరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వీళ్లకు రెండేళ్ల క్రితమే విషయం తెలిసినా షణ్ముగంను కాపాడుతూ వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్నాం టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగంపై ఆ బ్యాంకు మేనేజరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశాం. ఐపీసీ సెక్షన్ 409, 417, 420 ఇతర సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడుతాం. – ఈశ్వర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు -
‘అమ్మ’ను హల్వా తినిపించి చంపేశారు
సాక్షి, చెన్నై: జయలలిత మృతి విషయంలో మరోమారు తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హల్వాను తినిపించి మరీ జయలలితను చంపేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యే అని విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలం, నివేదికలపై న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్రంగానే విరుచుకుపడ్డారు. అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారని, ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త ఐఏఎస్‌లు, మంత్రుల మధ్య వ్యాఖ్యల సమరానికి దారి తీసింది. ఈనేపథ్యంలో జయలలిత మరణం విషయంలో సీవీ షణ్ముగం మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో షణ్ముగం ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో స్లో పాయిజన్‌గా తీపి వస్తువుల్ని ఇవ్వడం మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రధానంగా హల్వాను అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జయలలితకు మధుమేహం ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని, చివరి క్షణంలో గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి మారే రీతిలో హల్వా తినిపించినట్లు ఆరోపించారు. -
విదేశాలకు తీసుకెళ్తే అమ్మ బతికేవారు..
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మృతిపై తమిళనాడు న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను విదేశాలకు తరలించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేవారని వ్యాఖ్యానించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా ఆమె ఆరోగ్యంపై వైద్యారోగ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహనరావులు విచారణ కమిషన్‌ను అవాస్తవ సమాచారంతో తప్పుదారి పట్టించారని షణ్ముగం ఆరోపించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా వీరి పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చికిత్స నిమిత్తం జయలలితను విదేశాలకు తీసుకువెళ్లే ప్రతిపాదనను వైద్యారోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వ్యతిరేకించారని, అలా చేస్తే భారత వైద్యుల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన భావించారని చెప్పారు. ఆయన స్వయంగా డాక్టర్ అయి ఉండీ రోగి పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జయలలితకు యాంజయోగ్రామ్ నిర్వహించాలని ముగ్గురు వైద్యులు సూచించినా ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఆమెకు ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదని, తప్పుడు వైద్యం ఎవరు చేపట్టారని నిలదీశారు. ఆస్పత్రిపై ఎవరు అజమాయిషీ చేశారనే వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉందన్నారు. కాగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అపోలో ఆస్పత్రితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆర్ముగస్వామి కమిషన్ పిటిషన్లో ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జయ ఆస్పత్రిలో ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహన్‌రావు తప్పుడు ఆధారాలు సమర్పించారని ఈ పిటిషన్ ఆరోపించింది. జయలలిత మృతిపై ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ప్రశ్నల వర్షం...
సింగపూర్ : కేంబ్రిడ్జ్ అనలిటికా అంశంపై ఫేస్బుక్ వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత ప్రభుత్వం కూడా వివరణ కొరుతూ ఫేస్బుక్ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పలు దేశాల అంతర్గత చర్చల్లో కూడా ఫేస్బుక్ డేటా లీకేజీ చర్చనీయాంశంగా మారింది. కానీ సింగపూర్ మాత్రం ఫేస్‌బుక్‌కు నేరుగా తమ అభిప్రాయాలను తెలిపింది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగపూర్ మంత్రి ఫేస్బుక్ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సింగపూర్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ వారం రోజుల పాటు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తి గురించి పరిశీలించి, నివేదిక రూపొందించింది. ఈ కమిటీలో ఫేస్బుక్ పసిఫిక్ ఆసియా ఉపాధ్యక్షుడు(పబ్లిక్ పాలసీ) సైమన్ మిల్లర్‌తో పాటు గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ నివేదిక గత గురువారం రోజు(మార్చి 22) పార్లమెంటేరియన్ సదస్సులో చర్చకు వచ్చింది. ఫేస్బుక్, గూగుల్, ట్వీట్టర్పై కమిటీ అధ్యయనం చేసినప్పటికీ, ఫేస్బుక్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సింగపూర్ న్యాయశాఖ మంత్రి కె. షణ్ముగం, ఫేస్బుక్ ప్రతినిధి మిల్లర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేంబ్రిడ్జ్ అనలిటికా ద్వారా 5 కోట్ల మంది వివరాలు చోరికి గురయినప్పటికీ ఫేస్బుక్ గుర్తించలేకపోయిందని షణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అకౌంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో దాదాపు గంట పాటు షణ్ముగం, మిల్లర్ మధ్య వాగ్వాదం నడిచింది. ఫేస్‌బుక్‌పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. మిల్లర్ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నిస్తుంటే ‘యస్ ఆర్ నో’ ఏదో ఒకటే చెప్పాలన్నారు . గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు తమ సైట్లలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ఏకధాటిగా ప్రశ్నలు
-
100 ఎద్దులను ఒకేసారి వదలగా..
వెల్లోర్: తమిళనాడులో దారుణం జరిగింది. ఆలయంలో దేవుడి దర్శనానికి బయలుదేరిన వ్యక్తిని ఓ ఎద్దు కొమ్ములతో కుమ్మేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఇప్పటికే నిషేధం విధించిన ఎరుతు విదుమ్ విఝా(బుల్ రేస్) నిర్వహించడమే ఇందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంత్రి పండుగ సందర్భంగా తమిళనాడులోని వెల్లోర్ జిల్లా వెల్లకుట్టాయ్ అనే గ్రామంలో ఎద్దుల పరుగుపందెం ప్రారంభించారు. ఇది కూడా జల్లి కట్టులాగే ఓ సంప్రదాయ పండుగ. దీనిని నిర్వహించే సమయంలో అందరూ దారి పొడవునా ఉండి వీక్షిస్తుంటారు. అయితే, పందెంలో భాగంగా ఒకేసారి వంద ఎద్దులను రేస్‌లోకి వదిలారు. వాటిల్లో ఒక ఎద్దు నేరుగా జనాలపైకి వెళ్లింది. పీ షణ్ముగం అనే వ్యక్తిని తన కొమ్ములతో కుమ్మేసింది. దీంతో అతడి ఎడమ దవడ తీవ్రంగా గాయాలవడమే కాకుండా శరీరం లోపల కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన 4.30గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా 6గంటల ప్రాంతంలో చనిపోయాడు. పోలీసులు దీనిని అసాధారణ మరణం కింద నమోదు చేసుకున్నారు. -
కళ్లలో కారం చల్లి రూ. 80 లక్షలు చోరీ
మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీ యజమాని పరార్ చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరీకి రహస్యంగా తరలిస్తున్న రూ.80 లక్షల హవాల సొమ్మును దొంగలెత్తుకెళ్లడం నగరంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి వాంజినాథన్ వీధికి చెందిన చోళియన్ (40). ఇతను విదేశీ కరెన్సీకి భారత కరెన్సీని ఇచ్చే మనీ ఎక్చ్సేంజ్ ఏజన్సీని పుదుచ్చేరీలో నడుపుతున్నాడు. ఇతని వద్ద అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం (37) అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. పుదుచ్చేరీలో పెద్ద ఎత్తున సాగే కరెన్సీ మార్పిడి వ్యాపారంలో భాగంగా సదరు షణ్ముగం 15 రోజులకు ఒకసారి చెన్నైకి వచ్చి ఇక్కడి బ్రాడ్వేలోని ఒక ప్రముఖ మనీ ఎక్సేంజ్ ద్వారా హవాలా సొమ్ముగా మార్చుకుంటాడు. ఈ హవాలా సొమ్ముతో తిరిగి పుదుచ్చేరికి చేరుకుంటాడు. మనీ ఎక్సేంజ్కీ ఎలాంటి డాక్యుమెంటు అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమ సంస్థకు వచ్చిన ఐరోపా దేశ యూరో కరెన్సీని భారత కరెన్సీగా మార్చేందుకు షణ్ముగం మంగళవారం చెన్నైకి వచ్చాడు. బ్రాడ్వేలోని మనీ ఎక్చ్సేంజ్‌కు వెళ్లి యూరోలను రూ.80 లక్షల భారత కరెన్సీగా మార్చుకుని సిటీ బస్సులో తిరువాన్మియూరు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి పుదుచ్చేరీకి వెళ్లేందుకు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అక్కడి వాల్మీకి మునీశ్వర ఆలయం వద్ద బస్ కోసం వేచి ఉన్నాడు. ఆ సమయంలో మూడు బైక్‌లలో వచ్చిన ఆరుగురు షణ్ముగం ముఖంపై కారం పొడి చల్లి రూ.80 లక్షలను లాక్కున్నారు. వెంటనే వారి సమీపంలోకి వచ్చిన ఒక కారులో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరు బైక్‌లో పరారయ్యారు. తిరువాన్మీయూరు పోలీసులను షణ్ముగం ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పుదుచ్చేరీకి చెందిన ఒక ఎమ్మెల్యే అన్న కుమారుడికి కూడా రూ.80 లక్షల సొమ్ము వ్యవహారం తెలుసని, అతని ప్రోద్బలం ఉండవచ్చని షణ్ముగం పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. సొమ్ము చోరీకి గురికాగానే మనీ ఎక్చ్సేంజ్ ఏజెన్సీ యజమాని చోళియన్ పారిపోవడంతో పోలీసులు అతన్ని కూడా అనుమానిస్తున్నారు. మనీ ఎక్చ్సేంజ్ వ్యాపారం ద్వారా లెక్కల్లో చూపని రూ.80 లక్షల తరలింపు వెనుక మర్మం ఏమిటని పోలీసులు విచారిస్తున్నారు. -
ఆంధ్రాను సింగపూర్‌లా మార్చొచ్చు
శ్రీకాళహస్తి సందర్శించిన సింగపూర్ మంత్రి శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ నుంచి నిపుణులతో కూడిన ఓ బృం దాన్ని సింగపూర్ పంపితే అక్కడి అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన వస్తుందని సింగపూర్ విదేశీ వ్యవహారాలు, న్యాయ శాఖ మంత్రి షణ్ముగం అన్నారు. ఏపీలో చక్కటి వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే మరో సింగపూర్‌లా మారుతుందన్నారు. శనివారం ఆయన శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సింగపూర్‌లో ప్రతి వ్యక్తీ ఓ వ్యా పారవేత్తని.. అధిక సమయం పనిచేస్తారని వెల్లడించారు. అక్కడ నిర్లక్ష్యం అనే మాటే ఉండదన్నారు. శ్రీకాళహస్తి ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతమని కొనియాడారు. కాగా సింగపూర్ మంత్రి షణ్ముగం తిరుమల వెంకటేశ్వరుని కూడా దర్శించుకున్నారు. -
ఇళ్ల నిర్మాణం కోసం సింగపూర్ సహకారం
న్యూఢిల్లీ: ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సింగపూర్ సహకారం కోరారు. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం ఈ రోజు ఇక్కడ మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చు ఇళ్ల నిర్మాణ పరిజ్ఞానం విషయమై మోడీ సింగపూర్ సహకారం కోరారు. తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తుందని మోడీ చెప్పారు. అంతకు ముందు షణ్ముగం మన విదేశీవ్యవహారల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిశారు.