ఆంధ్రాను సింగపూర్‌లా మార్చొచ్చు | Andhrapradesh can be changed as Singapore | Sakshi
Sakshi News home page

ఆంధ్రాను సింగపూర్‌లా మార్చొచ్చు

Published Sun, Jul 6 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఆంధ్రాను సింగపూర్‌లా మార్చొచ్చు

ఆంధ్రాను సింగపూర్‌లా మార్చొచ్చు

 శ్రీకాళహస్తి సందర్శించిన సింగపూర్ మంత్రి

శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ నుంచి నిపుణులతో కూడిన ఓ బృం దాన్ని సింగపూర్ పంపితే అక్కడి అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన వస్తుందని సింగపూర్ విదేశీ వ్యవహారాలు, న్యాయ శాఖ మంత్రి షణ్ముగం అన్నారు. ఏపీలో చక్కటి వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే మరో సింగపూర్‌లా మారుతుందన్నారు. శనివారం ఆయన శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సింగపూర్‌లో ప్రతి వ్యక్తీ ఓ వ్యా పారవేత్తని.. అధిక సమయం పనిచేస్తారని వెల్లడించారు. అక్కడ నిర్లక్ష్యం అనే మాటే ఉండదన్నారు. శ్రీకాళహస్తి ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతమని కొనియాడారు. కాగా సింగపూర్ మంత్రి షణ్ముగం తిరుమల వెంకటేశ్వరుని కూడా దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement