డేటా స్కాండల్ విషయంలో ఫేస్‌బుక్ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చేసిందని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్‌కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది