సాక్షి, విజయవాడ: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.
ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించింది. సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్‌లో స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్ తగిలింది. రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌షీట్‌తో పటాపంచలయ్యాయి.
ఇదీ చదవండి: టీడీపీ వెన్నులో వణుకు.. జగన్ జన బలం సుప్ర‘సిద్ధం’!
Comments
Please login to add a commentAdd a comment