సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసుల వాదనలనూ వింటామంటూ.. వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. తుది విచారణలో భాగంగా అందరి వాదనలు వింటామంది. నిందితులు జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లలో తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని, తమ వాదనలు వినాలని కోరుతూ పోలీసులు, దిశ తండ్రితోపాటు మరికొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302కు బదులు 307 కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని, అది వారి వృత్తితోపాటు వ్యక్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒకసారి దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించాక మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమనే పరిధి, అధికారం మేజి్రస్టేట్‌కు ఉండదు. అయితే సీఆర్‌పీసీ సెక్షన్ 482, రాజ్యాంగంలోని అర్టికల్ 226 కింద విచక్షణాధికారం మేరకు కేసును కొట్టివేయడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే పరిధి ఈ కోర్టుకు ఉంటుంది. పిటిషనర్లు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. నిబంధనల మేరకు కోర్టు ముందుకొచ్చి న పిటిషన్‌ను వినాలి. అలాగే పారదర్శక విచారణ కోసం పోలీసుల వాదనలనూ వింటాం’అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment