కోట: రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఎన్‌కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్‌డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.
ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.
సీసీటీవీ ఫుటేజ్‌లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్‌గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు
Comments
Please login to add a commentAdd a comment