జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన ఆధారాల దరిమిలా దోడాలోని ఉత్తర ప్రాంతంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులు సోమవారం రాత్రి 7.45కి దేశా అటవీ ప్రాంతంలో జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ అధికారి, నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని, చివరి నివేదిక వచ్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment