
శ్రీనగర్: మంగళవారం దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతులిద్దరూ కశ్మీర్‌కు చెందిన స్థానిక యువకులుగా పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మీ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. లొంగిపోవాల్సిందిగా సూచించినప్పటికీ ఉగ్రవాదులు వినిపించుకోపోగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment