
జమ్మూకశ్మీర్: అనంత్‌నాగ్ జిల్లాలోని కుల్చోహర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో సోమవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనిక బలగాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. (పుల్వామాలో ఎన్‌కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం)
Comments
Please login to add a commentAdd a comment