Anantnag district
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
అనంత్‌నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
జమ్మూ కశీ్మర్లో అనంత్‌నాగ్–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 2022 పునర్విభజనలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్సీ కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ హస్నాయిన్ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్ బకర్వాల్ మత నాయకుడు, పార్టీ సీనియర్ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్ సలీమ్ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలో ఉన్నారు. ఆరి్టకల్ 370 రద్దు నేపథ్యంలో బల్దేవ్ కుమార్ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్. లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్! 2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్), కశ్మీర్లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్–రాజౌరీగా చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కశీ్మరీ పండిట్ ఒంటరి పోరు కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్ కుమార్ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్ అహ్మద్‌లకు గట్టి సవాల్ విసురుతున్నారు. పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్లో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్‌్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్..
జమ్మూకశ్మీర్: అనంత్‌నాగ్ జిల్లాలోని కుల్చోహర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో సోమవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనిక బలగాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. (పుల్వామాలో ఎన్కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం) -
ఉగ్రదాడి: ఒక జవాన్ సహా బాలుడి మృతి
శ్రీనగర్: దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహరా జాతీయ రహదారిపై గస్తీ కాస్తున్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉగ్రదాడిలో ఒక జవానుతో పాటు ఒక బాలుడు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా మరికొంత మంది జవాన్లు, పలువురు స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనూహ్య ఉగ్రదాడితో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ప్రతిదాడికి దిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సీఆర్పీఎఫ్తో పాటు ఆర్మీ బృందం, స్థానిక పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. దీంతో బిజ్‌బెమరా ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మిలిటెంట్లు మృతి
కశ్మీర్: జమ్మూ- కశ్మీర్‌తో కాల్పుల మోత మోగింది. దక్షిణ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని గుండ్బాబా సంగంలో భద్రతా దళాలకు లష్కరే తొయిబా మిలిటెంట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దాళాలు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. మృతి చెందిన వారిలో లష్కరే తొయిబా మిలిటెంట్ల స్థానిక కమాండర్ ఫుర్కాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బహరాలోని బగేంద్ర మొహల్లాలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపట్టాయి. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులు జరిపిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన ఉగ్రవాదులను సఫ్ద్ అమీన్ భట్, బుర్హాన్ అహ్మద్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే , ఎస్ఎల్ఆర్ రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
శ్రీనగర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో భద్రత బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీగా ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు. -
అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్
శ్రీనగర్ : జుమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని లాల్ చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంలో సైన్యం ఆ ప్రాంతాన్ని అర్ధరాత్రి నుంచి జల్లెడ పడుతుంది. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు. ఉయం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున కాల్పుల, పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొందరు తీవ్రవాదులు ఇక్కడి ఇళ్లలో ఉన్నారనే సమాచారంతో తాము కార్డన్ సెర్చ్ చేపట్టినట్టు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ప్రారంభం కాగానే అధికారులు అనంత్‌నాగ్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా శ్రీనగర్ నుంచి బనిహల్ మార్గంలో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నుట్టు రైల్వే అధికారులు తెలిపారు. -
అనంత్‌నాగ్‌లో ఎన్కౌంటర్: మహిళ మృతి
శ్రీనగర్: భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బాత్పుర ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో శనివారం రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని చుట్టు ముట్టి జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ముందుగా కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతికాల్పులు జరుపుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కాల్పుల్లో తాహెరా(44) అనే మహిళ మృతి చెందింది. సమీపంలోని ఓ భవంతిలో లష్కరే తొయిబా ముఖ్య కమాండర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు దాక్కొని ఉండటంతో పోలీసులు అక్కడి నుంచి స్థానికులను తరలించడానికి యత్నిస్తున్నారు. కార్డెన్ సెర్చ్ చేస్తున్న బలగాలపై పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కాశ్మీర్లో కాల్పులు : తీవ్రవాది మృతి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని కల్హార్ ప్రాంతంలో తీవ్రవాదులు... భద్రత దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాది మృతి చెందాడని పోలీసులు చెప్పారు. అతడి మృతదేహం వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌తోపాటు మూడు ఏకే మేగజీనులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భద్రత దళాలకు చెందిన వారికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.