
ప్రతీకాత్మకచిత్రం
శ్రీనగర్: దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరా జాతీయ రహదారిపై గస్తీ కాస్తున్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉగ్రదాడిలో ఒక జవానుతో పాటు ఒక బాలుడు మృతి చెందినట్లు సీఆర్‌పీఎఫ్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా మరికొంత మంది జవాన్లు, పలువురు స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనూహ్య ఉగ్రదాడితో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ బలగాలు వెంటనే ప్రతిదాడికి దిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఆర్మీ బృందం, స్థానిక పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. దీంతో బిజ్‌బెమరా ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment