![CRPF jawan Dies, Another Injured In Terrorist Attack In Srinagar - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/4/crpf.jpg.webp?itok=HOZoOLUC)
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాబలగాలు మైసుమా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని.. గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
మరోవైపు వలసదారులపైనా వరుస దాడులకు ముష్కరులు తెగబడుతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు జరిగాయి. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు బిహార్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం.. నౌపొరా ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలపైనా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు.
చదవండి: రీట్వీట్ చేసిన కేటీఆర్.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment