శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు! | terrorists attack CRPF vehicle in Srinagar | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు!

Published Sat, Jun 24 2017 7:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు!

శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు!

అమరుడైన ఒక జవాను.. ఇద్దరికి గాయాలు
కొనసాగుతున్న ఆపరేషన్‌


శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. భారీ ఆయుధాలతో కూడిన ఉగ్రవాదులు శనివారం సాయంత్రం గస్తీ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక జవాను అమరుడు అవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనగర్‌ పంథా చౌక్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై సాయంత్రం 6. 15 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు ఏకే-47 రైఫిళ్లతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై విచక్షణారహితంగా 29వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు.

కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను సమీపంలోని బాదమిబాఘ్‌ సైనిక ఆస్పత్రికి తరలించగా.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాహబ్‌ శుక్లా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాద ఆడితో అలర్ట్‌ అయిన పోలీసులు, పారా మిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని ముష్కరులను ఏరివేసే ఆపరేషన్‌ను చేపట్టారు. శ్రీనగర్-రహదారిని మూసివేసి ముమ్మరంగా ఆపరేషన్ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement