శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.
ఇక.. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment