terrorist attack
-
న్యూఓర్లీన్స్ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్?
కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్ గతంలో టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్‌గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్‌ను అధికారులు పరిశీలించారు.👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్‌కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్‌తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్‌బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్(ఐసిస్‌కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్‌బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్ జబ్బార్‌ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్‌బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్‌లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్‌డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్‌బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్‌లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. -
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్ రోడ్లో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో(మోడర్గాం, ఫ్రిసాల్ ఏరియా) ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉన్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. నిందితుల కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో ఉగ్రవాదులను గాలిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్, రియాసి ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులపై వేట కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్‌లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్‌తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్‌పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్‌లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్‌లోనూ, ఇటు పాకిస్తాన్‌లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్‌లోని కెర్మాన్‌లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్‌కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్‌ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్‌తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
పూంచ్‌లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్‌లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
పాక్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది. సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు. బలోచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్‌తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. -
కశ్మీర్ మళ్లీ మొదటికి?!
అడపా దడపా జరిగే ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా ఉన్నట్టు కనబడిన కశ్మీర్‌పై ఉగ్ర వాదులు పంజా విసిరారు. ఒక ఎన్కౌంటర్ సందర్భంగా అనంతనాగ్ జిల్లాలో బుధవారం సైనికాధికారులు కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆషిష్, డీఎస్పీ హుమాయిన్ ముజామిల్ భట్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు నేలకొరగడం... అదే ప్రాంతంలో శుక్రవారం మరో ఆర్మీ జవాన్ మిలిటెంట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. దట్టంగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాలను ఎంచుకుని భద్రతా బలగాలపై దాడికి తెగబడటం ఇటీవలి కాలంలో మిలిటెంట్లు అనుసరిస్తున్న వ్యూహం. గత నెలలో ముగ్గురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ప్రాంతం కుల్గామ్ కూడా దట్టమైన అటవీ ప్రాంతమే. కొండలు, కోనలు ఉండే అటవీప్రాంతంపై సమగ్ర అవగాహన ఉంటే తప్ప సైన్యం మిలిటెంట్లను తిప్పికొట్టడం సాధ్యం కాదు. తమకు బాగా పట్టున్న ఇలాంటి ప్రాంతాల్లో వారానికి సరిపడా ఆహారం, మందుగుండు సిద్ధం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మిలిటెంట్లు సైన్యాన్ని తామున్నచోటకు రప్పిస్తున్నారు. కొండలపై మాటుగాసి తమవైపు వస్తున్న బలగాలపై కాల్పులు జరపటం మిలిటెంట్లకు సులభమవుతోంది. ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల భద్రతా బలగాలకు బాసటగా వచ్చే హెలికాప్టర్లపై సునాయాసంగా దాడులు చేయగలుగుతున్నారు. పైగా మిలిటెంట్ల ఫోన్ సంభాషణలను వినటం, వారి ఆనుపానులు ఎక్కడ వున్నాయో కచ్చితంగా అంచనా వేయటంలాంటి అంశాల్లో సైన్యం విఫలమవుతోంది. మైదాన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. అక్కడ భద్రతా బలగాలకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మిలిటెంట్ల ఆటలు సాగడం లేదు. ఉగ్రవాద దాడులు పెరగటం వెనక ఎప్పటిలాగే పాకిస్తాన్ హస్తం ఉండటం బాహాటంగా కన బడుతోంది. వాస్తవానికి పాక్ ఆర్థికంగా దివాలా తీసి, ఇప్పట్లో కోలుకునే అవకాశం లేని స్థాయికి చేరుకుంది. రాజకీయంగా సరేసరి. ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించిన నాటినుంచీ సైన్యంపై సాధారణ ప్రజానీకంలో ప్రతికూలత పెరిగింది. మరోపక్క ఉగ్రవాదులకు నిధులు అందజేయటానికి తోడ్పడే సంస్థలనూ, దేశాలనూ నిరోధించేందుకు అంతర్జాతీయంగా ఏర్పాటైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్‌పై నిఘా ఉంచింది. అయినా సరే అది తన వెనకటి గుణాన్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదని కశ్మీర్ తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగిన దాడులకు బాధ్యు లుగా చెప్పుకున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా పుట్టుకొచ్చిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఆంక్షలను అధిగమించటానికి పాకిస్తాన్ ఈ కొత్త ఉగ్ర సంస్థను సృష్టించిందని సులభంగానే గ్రహించవచ్చు. సరిహద్దులకు ఆవలినుంచే టీఆర్ఎఫ్కు ఆయుధాలు, డ్రగ్స్ అందుతున్న సంగతి కూడా నిర్ధారణ అవుతోంది. 370వ అధికరణను రద్దుచేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి నాలుగేళ్లు కావస్తోంది. అటు తర్వాత కశ్మీర్లో పరిస్థితి మెరుగు పడిందని, ఆర్థికంగా కోలుకోవటంతోపాటు భద్రతరీత్యా సురక్షితంగా ఉన్నదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. గతంతో పోలిస్తే కశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నగరాలు, పట్టణాల్లో మిలిటెంట్ల ఆటలు సాగటం లేదు. కానీ అంతమాత్రానికే సంతృప్తి పడితే ప్రమాదకర పర్యవసానా లుంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి ఎన్కౌంటర్లను పరిశీలిస్తే బలగాలకు మార్గదర్శకాలిచ్చి వారిని నడిపించాల్సిన ప్రధాన అధికారులే బలవుతున్న సంగతి అర్థమవుతుంది. దాడులకు సీనియర్ అధికారులు నేతృత్వం వహించాలన్నది ఒకరకంగా మంచి నిర్ణయమే. ఇందువల్ల దాడుల్లో చురుగ్గా పాల్గొనేందుకు కింది స్థాయి జవాన్లు సంసిద్ధులవుతారు. అయితే దానికి తగినట్టుగా మిలిటెంట్లు మాటువేసిన ప్రాంతాన్ని నిర్ది ష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారించుకోవటానికి అవసరమైన పరికరాలు వారికి అందుబాటులో ఉంచటం అతి ముఖ్యం. తగిన వ్యూహాన్ని రూపొందించటంలో, బలగాల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి నమ్మ కాన్ని గెల్చుకోవటంలో సీనియర్ల పాత్ర కీలకమైనది. అటువంటి అధికారులను కోల్పో వటం వల్ల భద్రతా బలగాలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇవన్నీ శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించినవి. వీటికి సమాంతరంగా కశ్మీర్లో మళ్లీ రాజకీయ ప్రక్రియ ప్రారంభించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడ గొట్టాక అంతా మెరుగైందని బీజేపీ నేతలు చెబుతున్నా ఉగ్రవాదుల ఆగడాలు క్రమేపీ పెరుగుతున్న సంగతి కాదనలేనిది. పండిట్లపైనా, వలస వచ్చినవారిపైనా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయని గతంలో కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించిన బృందంలోని సభ్యురాలు రాధాకుమార్ ఇటీవలే గుర్తుచేశారు. కశ్మీర్లో నిరుద్యోగిత దేశ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువున్నదని ఆమె అంటు న్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం 2015 నుంచి మిలిటెన్సీకి దూరంగా ఉంది. అక్కడ గత ఏడెనిమిదేళ్లుగా చెప్పుకోదగిన ఘటనలు లేవు. అటువంటిచోట ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులు చేయగలిగారంటే ఆలోచించాలి. కశ్మీర్లో నిరుడు దాదాపు వందమంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారని, వీరిలో చాలామంది టీఆర్‌ఎఫ్‌వైపు మొగ్గారని గణాంకాలు చెబు తున్నాయి. కనుక ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించటం, యువతలో నిరుద్యోగితను అరికట్టడం వంటి చర్యలు అవసరం. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
ఇంకా రహస్య యుద్ధమే విధానమా?
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్–ఎ– తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) భయంకరమైన దాడులను చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి దిగజారుతోంది. అయినా పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని బజౌర్ జిల్లాలో జూలై 30న జమీయత్ ఉలేమా– ఎ–ఇస్లాం ఫజల్ (జేయూఎల్–ఎఫ్) సమావేశంపై జరిగిన ఉగ్రదాడిలో 50 మందికి పైగా మరణించారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించింది. గతంలో కూడా జేయూఎల్–ఎఫ్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ అనేక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రధాన కారణాలలో ఒకటి, అఫ్గానిస్తాన్ తాలిబన్లతో జేయూఎల్–ఎఫ్‌కు ఉన్న అనుబంధం; మరొక కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి జేయూఎల్–ఎఫ్ ఇస్తున్న మద్దతును ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకించడం అని చెప్పాలి. బలూచిస్థాన్ లోని ఝోబ్ ఆయుధాగారంపై ఇటీవల జరిగిన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖచిత్రంలో తాజా ప్లేయర్ అయిన తెహ్రీక్– ఎ–జిహాద్ పాకిస్తాన్ (టీజేపీ) ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. టీజేపీ, తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. టీటీపీ పాకి స్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తున్న భయంకరమైన సంస్థ. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఖైబర్ పఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్లలో టీటీపీ దాడులు పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. తాలిబన్లతో చెడిన మైత్రి అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాజీ పౌర, సైనిక నాయకత్వం వ్యూహాత్మక విజయంగా భావించిన దానికి ఇది విరుద్ధంగా నడుస్తోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సంబంధాలలో రెండు సమస్యలు కీలకంగా ఉన్నాయి. మొదటిది, డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబన్లు విముఖత వ్యక్తం చేయడంతోపాటు, సరిహద్దుల్లో కంచె వేయడాన్ని వారు ప్రతిఘటించడం. రెండవది, మిలిటెంట్ గ్రూపునకు మద్దతు నిచ్చే స్థావరాన్ని విడిచిపెట్టమని పాకిస్తాన్ సైన్యం పదే పదే సందేశం పంపినప్పటికీ, టీటీపీని తాలిబన్ ప్రోత్సహిస్తోంది. పైగా కాబూల్‌లో ప్రాతినిధ్య పాలన ఓడిపోయిన తర్వాత టీటీపీ గణనీయంగా బల పడింది. తాలిబన్ తో టీటీపీ బలమైన సైద్ధాంతిక (వ్యూహాత్మక) కూటమిని పంచుకున్నందున ఇది ఊహించదగినదే. టీటీపీ అనేది అఫ్గాన్ తాలిబన్లకు సైద్ధాంతిక విస్తరణ. పైగా ఉగ్రవాదంపై అమెరికా సాగించిన యుద్ధ సమయంలో తాలిబన్లకు ఇది మద్దతునిచ్చింది. కాబట్టి తిరిగి సహాయం చేయడం కోసం టీటీపీకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత అఫ్గాన్ తాలిబన్లపై ఉంది. అయితే తాలిబన్లు తమ భూభాగంలో టీటీపీ ఉందనడాన్ని ఖండించారు. అంతేకాకుండా అఫ్గాన్ గడ్డపై దాడులను చేయరాదని పాకిస్తాన్ ను హెచ్చరించారు కూడా. అయినప్పటికీ, టీటీపీకి అఫ్గాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ సైన్యం గుర్తించింది. పైగా ఈ విషయంలో తదుపరి చర్యపై బలమైన ప్రకటనలను జారీ చేస్తోంది. ఝోబ్ దాడి తరువాత, ‘అఫ్గానిస్తాన్‌లో టీటీపీకి అందుబాటులో ఉన్న సురక్షిత స్వర్గ ధామాలు, కార్యాచరణకు చెందిన స్వేచ్ఛపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు’ పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఇటువంటి దాడులు సహించలేనివనీ, పాకిస్తాన్ భద్రతా దళాలు వీటిపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయనీ ప్రకటించింది. ఉ్రగ్ర సంస్థలు ఏకమయ్యే ప్రమాదం ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్–ఖైదా, అనుబంధ గ్రూపులు, వ్యక్తులకు సంబంధించి... ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ‘ది ఎనలిటికిల్ సపోర్ట్ అండ్ శాంక్సన్స్ మానిటరింగ్ టీమ్’ సమర్పించిన 32వ నివేదిక టీటీపీ ఒక ప్రాంతీయ ముప్పుగా మారవచ్చని పేర్కొంది. ‘తాలిబన్ నియంత్రణలో దాడి ప్రయత్నాలను తప్పించు కుంటూ, అనేక రకాల విదేశీ సమూహాలు ఏకఛత్రంగా పనిచేస్తాయి లేదా ఐక్యమవుతాయి’ అని ఈ నివేదిక తెలిపింది. అయితే టీటీపీ గురించిన సైన్యం ప్రతిస్పందనపై పుష్కలమైన ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం, పౌర, సైనిక ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసింది. ఈ సందర్భంలో మూడు ఎంపికలను విశ్లేషించవచ్చు: ఒకటి: పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీని తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న గత ప్రభుత్వం టీటీపీ గ్రూప్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించి 100 మందికి పైగా టీటీపీ ఖైదీలను విడుదల చేసింది. ఇది టీటీపీ గ్రూప్ బలాన్ని పెంచింది. ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాని డిమాండ్లపై రాజీ పడేందుకు టీటీపీ ఎలాంటి సంకేతాన్నీ చూపలేదు. తీవ్రవాద దాడుల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ పదే పదే బాధ్యత వహించారని చెప్పవచ్చు. రెండు: అఫ్గాన్ తాలిబన్ ను పాకిస్తాన్ విశ్వాసంలోకి తీసుకుంటుంది. తరువాత గ్రూపును నియంత్రించే బాధ్యత తీసుకుంటుంది. అయితే తాలిబన్, టీటీపీల మధ్య బలమైన సంబంధాలు, తాలిబన్ నుండి టీటీపీ ప్రేరణ పొందడం, పైగా వారిని రోల్ మోడల్‌గా చూడటం ఈ అవకాశ సాధ్యా సాధ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, పాకిస్తాన్ లోని అస్థిర పరిస్థితులను బట్టి, ఇది అక్కడి పాలనా వ్యవస్థకు సాధ్యమైన ఎంపికగానే కనిపిస్తోంది. మూడు: టీటీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతి–తిరుగుబాటు చేయడం. పాక్ మిలిటరీ ఇంతకుముందు 2014లో జర్బ్–ఎ–అజ్బ్, 2017లో రద్–ఉల్–ఫసాద్ వంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించింది. ఇవి టీటీపీ సంఖ్యను, ఉగ్రవాద దాడులను నిర్వహించగల దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ఈ గ్రూప్ తనను తాను నిలబెట్టుకుని తాలిబన్ మద్దతుతో వృద్ధి చెందింది. అయితే నాలుగు కారణాల వల్ల పాక్ సైనిక ప్రతిస్పందనకు అవరోధం ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో గణనీయమైన స్థానభ్రంశాలు చోటు చేసుకోవడం; భయంకరమైన ఆర్థిక సంక్షోభం (దాంతో పాటు వరదల వల్ల కలిగిన దుఃస్థితి); ఏ సైనిక చర్య అయినా దేశంపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతర చేయడం; అఫ్గాన్ తాలిబన్ల నుండి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అపారంగా ఉండటం. కుట్రలో భాగమా? అయితే టీటీపీ గ్రూప్ కార్యకలాపాలను నియంత్రించకపోవడం పాక్ సైన్య ఉద్దేశపూర్వక కుట్ర చర్యలో భాగమనీ, ఉగ్రవాద వ్యతిరేక సహాయాన్ని అమెరికా నుంచి ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పాక్ సైన్యం తన ఎంపికలను అప్రమత్తంగా పరిశీలిస్తుండగా, పాకిస్తాన్ మాత్రం తన వ్యూహాత్మక ఎంపికల బురదలో చిక్కుకుందనేది వాస్తవం. పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. శాలినీ చావ్లా వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్టికీ బాంబులు, గ్రనేడ్లు, స్టీలు బుల్లెట్లు.. ఉగ్రదాడిలో కీలక విషయాలు..!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పూంఛ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు ఈ దాడికి స్టికీ బాంబులు, స్టీల్ బుల్లెట్లు, గ్రనేడ్లు ఉపయోగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. స్టికీ బాంబులు అంటే పేలుడు పరికరాలు. వీటిని వాహనానికి అమర్చి డిటోనేటర్ల ద్వారా లేదా టైమర్ సెట్ చేసి పేలుస్తారు. ఘటనా స్థలంలో స్టికీ బాంబులతో పాటు, రెండు గ్రనేడ్ పిన్నులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో రెండు ఉగ్ర సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులు పాల్గొన్నారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు అయి ఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో.. కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏకు అందించింది. దాడి అనంతరం నిందితుల కోసం వేట మొదలుపెట్టాయి భారత బలగాలు. 2000కు పైగా కామాండోలను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన సైనికులు వీరే.. -
పూంఛ్ ఘటన ప్రమాదం కాదు.. ఉగ్రదాడి: భారత ఆర్మీ
ఢిల్లీ: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో గురువారం జవాన్ల ట్రక్కుకు జరిగింది ఘోరం ప్రమాదం కాదని.. అది ఉగ్రదాడి అని భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది ఆర్మీ. జమ్ము-పూంచ్ హైవేపై రాజౌరీ సెక్టార్ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, మంటలు చెలరేగి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ తెలిపింది. మరో జవాన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జవాన్లను ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి మోహరించే క్రమంలోనే ఈ ఘోరం జరిగింది. వర్షం పడుతుండడంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, ఇది ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారని సైన్యం తెలిపింది. తొలుత ఇది పిడుగు ప్రమాదంగా భావించిన ఆర్మీ.. దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా.. చివరికి ఉగ్రదాడిగానే తేల్చింది. -
Rajouri: గ్రామస్థుల చేతికే ఆయుధాలు.. కేంద్రం సంచలన నిర్ణయం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఇళ్లల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక అడుగు వేసింది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 5,000 మంది స్థానికులు ఆయుధాల కోసం పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా వీడీజీగా ఈ నిఘా బలగాలను పిలుస్తారు. గడిచిన రెండు దశాబాద్దాల్లో భారీస్థాయిలో గ్రామ రక్షణ గ్రూప్స్ లేదా కమిటీలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ఈ గ్రూపుల్లోని ప్రతిఒక్కరికి .303 రైఫిల్, 100 రౌండ్ల తూటాలు అందిస్తారు. అలాగే వారికి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ కూడా అందించాలని ప్రభుత్వం భవిస్తోంది. ఏమిటీ ఈ గ్రామ రక్షణ కమిటీలు? జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రత పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. 1990లో దోడా జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడీసీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 28000 మంది వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి తగ్గిపోయింది. కానీ, ఇటీవలే హిందువులపై ఉగ్రదాడి తర్వాత గ్రామ రక్షణ కమిటీలు తిరిగి పురుడుపోసుకున్నాయి. రాజౌరీ జిల్లాలోని పంచాయతీల్లో ఆయుధాలను తనిఖీ చేసి గ్రామస్థులకు శిక్షణ ఇస్తోంది పోలీసు శాఖ. చాలా కాలం క్రితం కుటుంబంలోని పెద్దలకు, తల్లిదండ్రులకు అందించిన ఆయుధాలను యువకులు చేతబడుతున్నారు. ‘రైఫిల్‌ను శుభ్రం చేసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దీనిని తనిఖీ చేయిస్తున్నా. మాపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నా.’ అని టింకూ రైనా అనే ఓ యువకుడు తెలిపారు. తాను పోలీసు రికార్డుల్లో పేరు నమోదు చేసుకోలేదని, కానీ తన వద్ద .303 రైఫిల్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జోగిందర్ సింగ్ అనే మరో యువకుడు తన ఇంట్లో వారికి చెందిన రెండు రైఫిల్స్‌ను ఆయుధాల తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను వీడీసీ బృందంలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఆయుధాల అందజేత.. వీడీసీ గ్రూప్ సభ్యులకు కొత్త ఆయుధాలు అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా పోలీస్ చీఫ్ మొహమ్మద్ అస్లాం. ఫైరింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. మరోవైపు.. వీడీసీ సభ్యులకు రూ.4000 గౌరవవేతనం ఇస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత వరకు అమలులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలకు అందిస్తున్న ఆయుధాలు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. సుమారు 200లకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్‌లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్‌పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్‌లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్‌కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్‌గా ఉగ్రదాడి ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ ఉగ్ర కుట్ర ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జాహిద్ అరెస్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేసింది. హైదరాబాద్‌లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులకు సైతం ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందిన్నట్టు గుర్తించారు. దాడులు చేసేందుకు నాలుగు గ్రనేడ్స్‌ను జాహిద్‌కు పంపిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ పంపించారు. సోదాల్లో భాగంగా నిందితుల నుంచి 4 గ్రనేడ్లతో పాటు రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. జాహిద్‌తో పాటు మరో ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమీయుద్దీన్, అదీల్, అప్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషిను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందినట్టు తెలుసుకున్నారు. కాగా, గతంలో పలు బ్లాస్ట్ కేసుల్లో అబ్దుల్ జాహిద్ నిందితుడిగా ఉన్నాడు. 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై సూసైడ్ అటాక్‌కు జాహిద్ ప్లాన్ చేశాడు. ఫర్హతుల్లా ఘోరీ, అణు హంజాల, అబ్దుల్ మజీద్‌లతో కలిసి కుట్ర చేశారు. 2002 సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్ద కుట్రకు ప్లాన్ చేశారు. 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ మానవ బాంబు పేలుళ్లను సైతం జాహిద్ ప్లాన్ చేశాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ జాహిద్ ఉగ్ర కుట్రలు చేస్తున్నాడు. -
కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా టెర్రరిస్టుల కాల్పులు.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ‘షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కశ్మీర్ పోలీసులు. ఇదీ చదవండి: కరాచీలో దిగిన హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్.. విమానంలో 12మంది ప్రయాణికులు! -
జమ్మూకశ్మీర్: ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు వీర మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు. చదవండి: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా -
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్‌షా ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో హిందువులపై జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ చీఫ్ సమంత్ సమంత్ గోయల్ హాజరయ్యారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు. కాగా జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని నెలలుగా హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు జరగుతున్నాయి. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షిత హత్యలు జరిగాయి. గురువారం బీహార్‌కు చెందిన దిల్ఖుష్ కుమార్ (17) అనే కార్మికుడు బుద్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అదే రోజు కుల్గామ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు గోపాల్‌పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తోన్న రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. అయితే ఇటీవల జరిగిన దాడులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి వారిని జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో కాశ్మీర్ లోయలోని 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ మనోజ్ సిన్హాకు రాజీనామాలు సమర్పించారు. చదవండి: ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఉగ్రకాండ.. అమిత్ షా మీటింగ్ ముందర మరొకటి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం. మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్‌గఢ్. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్ భట్ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కూడా దారుణ హత్యకు గురైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా?