
సోఫియాన్ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అరహమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతిచెందారు. చెడిపోయిన వాహనానికి మరమత్తులు చేస్తున్న పోలీస్ బృందంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌లు ఇష్‌వాక్ అహ్మద్ మిర్, జావెద్ అహ్మద్ భట్, మొహ్మద్ ఇక్బాల్ మిర్, ఎస్‌పీఓ అదిల్ మంజూర్ భట్‌లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment