Shopian
-
కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా టెర్రరిస్టుల కాల్పులు.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ‘షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కశ్మీర్ పోలీసులు. ఇదీ చదవండి: కరాచీలో దిగిన హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్.. విమానంలో 12మంది ప్రయాణికులు! -
మైండ్‌ట్రీతో జట్టుకట్టిన, శాపియన్స్
న్యూఢిల్లీ: బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్ వ్యవస్థల(సిస్టమ్స్) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి. ప్రాపర్టీ, క్యాజువాలిటీ, లైఫ్, యాన్యుటీ ఇన్సూరెన్స్ మార్కెట్లలో మైండ్‌ట్రీతో జత కడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు శాపియన్స్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్, జీఎం జామీ యోడర్ పేర్కొన్నారు. రెండు సంస్థల సంయుక్త సామర్థ్యాలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, బిజినెస్ సొల్యూషన్స్‌లో గరిష్ట ప్రయోజనాలు కల్పించనున్నట్లు మైండ్‌ట్రీ బీఎఫ్ఎస్ఐ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ముకుంద్ తెలిపారు. చదవండి: ఎంఈసీఎల్‌తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం! -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
సెలవులో ఉన్న జవాను కిడ్నాప్!
శ్రీనగర్ : ఈద్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి జమ్ము కశ్మీర్‌లోని సోఫియాన్‌కు వెళ్లిన జవాను ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయారు. జవానుకు చెందిన దగ్ధమైన కారును కుల్గామ్ జిల్లాకు సమీపంలోని రంభమా ప్రాంతంలో ఆర్మీ అధికారులు గుర్తించారు. 162వ బెటాలియన్‌కు చెందిన శిఖర్ మంజూర్ సెలవులో ఉన్నారు. జవానును ఉగ్రవాదులే కిడ్నాప్ చేసినట్టుగా ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విధుల్లోలేని జవానులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2017లో సెలవుపై సోఫియాన్ వెళ్లిన లెఫ్ట్‌నెంట్ ఉమర్ ఫయాజ్ను కిడ్నాప్ చేసి ఉగ్రవాదులు హత్య చేశారు. 2018 జూన్‌లో ఈద్‌కు పూంచ్ వెళ్లిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. -
పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు. ‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్ జిల్లాలో స్థానికులతో దోవల్ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. -
కెల్లార్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: షోపియాన్ జిల్లాలోని కెల్లార్ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలు సంయుక్తంగా కెల్లార్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చారు. ఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై ఆర్మీ బలగాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. -
షోపియాన్‌లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపి కొన్ని గంటలైన గడవకముందే.. మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. షోపియాన్ జిల్లాలో మెమందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రత బలగాలపై కాల్పులు దిగినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టడానికి భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎవరు గాయపడలేదని సమాచారం. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డ పాక్.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. మంగళవారం సాయంత్రం నుంచి సరిహద్దు వెంబడి దాదాపు 15 చోట్ల ఇష్టా రాజ్యంగా పాక్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పులో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సరిహద్దులోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పాక్ ఆర్మీకి ధీటుగా బదులిచ్చిన భారత దళాలు పాకిస్తాన్‌కు చెందిన ఐదు పోస్టులను ధ్వంసం చేశాయి. (సర్జికల్ స్ట్రయిక్స్ 2 సక్సెస్) -
ఉగ్రదాడిలో నలుగురు పోలీసుల మృతి
సోఫియాన్ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అరహమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతిచెందారు. చెడిపోయిన వాహనానికి మరమత్తులు చేస్తున్న పోలీస్ బృందంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్లు ఇష్వాక్ అహ్మద్ మిర్, జావెద్ అహ్మద్ భట్, మొహ్మద్ ఇక్బాల్ మిర్, ఎస్పీఓ అదిల్ మంజూర్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. -
వైరల్ ఫొటో.. వాళ్ల ఫేట్ రివర్సైంది!
జమ్ము: వేర్పాటువాదం తలకెక్కించుకున్న ఆ యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఆ ఫొటో.. వాళ్ల తలరాతను మార్చేసింది. జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. రెండేళ్ల కిందటి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. అరెస్టైన ఒక్కడు మాత్రం జైలులో ఉన్నాడు. ఆదివారం నాటి ఎన్కౌంటర్లో వనీ అనుచరుడైన పద్దేర్ సహా హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఎన్కౌంటర్లను నిరసిస్తూ లోయలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో మరో ఐదుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లోయలో వరుస ఘటనలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. తుపాకులు, రాళ్లను చేతబడుతున్నది పేదలేనని, అలాంటి యువకుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో ఒక మధ్యంతర విధానం అవసరం ఉన్నదని ఆమె అన్నారు. ఒక్కరోజు ఉగ్రవాది: షోఫియాన్ ఎన్కౌంటర్లో చనిపోయిన రఫీభట్.. కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసేవాడు. శుక్రవారమే హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరిన అతను.. ఆదివారానికి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయమే భట్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్ కాల్’ అని చెప్పాడు. (చదవండి: ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్) -
ఆరుగంటల్లో.. 5గురు ఉగ్రవాదులు హతం
షోఫియాన్: జమ్మూ-కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లా బడిగాం వద్ద ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఐదుమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బడిగాంలోని ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ‘ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీనికి భారతసైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. హతులను హిజ్యుల్ ముజాహిద్దీన్ ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. కశ్మీర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు పౌరులు కూడా మరణించారు.’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ విజవంతం చేసిన దళాలను అభినందిస్తూ జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ ట్వీట్ చేశారు. ‘ షోఫియాన్ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కానీ, ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందడంతో దక్షిణ కశ్మీర్లో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా షోఫియాన్, పుల్వామా, తదితర దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
వనీ బ్రిగేడ్‌లో ఆఖరి కమాండర్ హతం
శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ : హిజ్బుల్ మొజాహిదీన్(ఐఎమ్) ప్రముఖ ఉగ్రవాది బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లోని ఆఖరి కమాండర్‌ను భారత భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. ఇప్పటికే పలువురు కీలక కమాండర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లో ఆఖరివాడైన సద్దాం పద్దర్ మృతి చెందిన్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. షోపియాన్‌లో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. జైనాపుర ప్రాంతంలోని బడిగాం గ్రామంలో ఉగ్రవాదులు నక్కారనే సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. తీవ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కార్డన్ సెర్ఛ్ ఆపరేషన్ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు దిగారు. ప్రతిగా రక్షక దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా, ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, పోలీసు అధికారి గాయపడ్డారు. కొంత కాలంగా తీవ్రవాద సంస్థలో పని చేస్తున్న కశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మర్ రఫి బట్ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురిని గుర్తించాల్సివుందని పోలీసులు పేర్కొన్నారు. Encounter concluded at Badigam Zainpora Shopian, 5 bodies of terrorists recovered. Well done boys - Army/ CRPF/J&K Police. — Shesh Paul Vaid (@spvaid) May 6, 2018 -
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి
-
సరిహద్దులో అలజడి; వరుస ఎన్కౌంటర్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్‌గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఎఫ్ఐఆర్లో మేజర్ ఆదిత్య పేరు చేర్చలేదు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో జనవరి 27న జరిగిన షోపియాన్ కాల్పుల కేసులో మేజర్ ఆదిత్య కుమార్‌కు ఊరట లభించింది. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య పేరును నిందితునిగా చేర్చలేదని సుప్రీంకోర్టుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏప్రిల్ 24 వరకు కేసులో తదుపరి దర్యాప్తు నిలిపేయాలని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జనవరి 27న భారత సైన్యంపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సైన్యం కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు మృతిచెందారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించగా.. 10 గర్వాల్ రైఫిల్‌కు చెందిన ఆర్మీ అధికారులపై సెక్షన్ 302, 307 కింద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో తన కొడుకు పేరును ఏకపక్షంగా నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆదిత్య తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) కరమ్‌వీర్ సింగ్ సుప్రీంను ఆశ్రయించారు. -
ఆర్మీ మేజర్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ/ శ్రీనగర్: షోపియన్ కాల్పుల ఘటన నేరగాళ్లకు సంబంధించిన కేసు కాదని, ఓ ఆర్మీ మేజర్ కేసుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికి మేజర్ ఆదిత్య కుమార్ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడిపై తప్పుడు కేసు నమోదు చేశారని, అతడు అమాయకుడని మేజర్ ఆదిత్యకుమార్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు కేసు దర్యాప్తును నిలిపివేయడంతో పాటు తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ జనవరిలో షోపియన్‌లోని గనోవ్పోరా గ్రామంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆర్మీ వాహనాలపై రాళ్లు విసిరి, విధ్వంసం సృష్టించారు. దీంతో ఆర్మీ సిబ్బంది ఆ అల్లరి మూకపై కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాద్ధాంతం కాగా, స్పందించిన సీఎం మెహబూబా ముఫ్తీ ఆర్మీ కాల్పులపై విచారణకు ఆదేశించగా.. పోలీసులు మేజర్ ఆదిత్యకుమార్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన సమయంలో మేజర్ ఆదిత్య అక్కడలేదని, అయినా కేసులు పెట్టారంటూ ఆయన తండ్రి సుప్రీంను ఆశ్రయించారు. కేసు విచారణ అనంతరం సీజేఐ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఇది క్రిమినల్ కేసు కాదని.. ఓ ఆర్మీ అధికారికి సంబంధించిన కేసు అని పేర్కొన్నారు. సైనికులపై విచారణ చేపట్టి అంత అనైతికంగా ప్రవర్తించే ప్రసక్తే లేదన్నారు. ఏప్రిల్ 24న ఈ పిటిషన్‌పై తీర్పు ఉంటుందని, అంతవరకూ మేజర్ ఆదిత్యకుమార్‌పై విచారణ చేపట్టవద్దని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని సీజేఐ ఆదేశించారు. ఆదిత్యనే కాన్వాయ్కి హెడ్‌గా వ్యవహరించినట్లు గుర్తించినా.. మేజర్‌ను ఎఫ్ఐఆర్లో తాము నిందితుడిగా పేర్కొనలేదని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. -
భారీ ఎన్కౌంటర్.. టాప్ హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియన్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ యాతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు కూడా అమరులు అయ్యారు. షోషియన్ జిల్లాలోని అన్వీరా గ్రామంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల ఏరివేతతో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముగిసింది. -
భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ షురూ!
ఉగ్రవాదులు వరుస బ్యాంకు లూటీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో వారిని ఉక్కుపాదంతో అణిచేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. తుర్కవాన్ గావ్ ప్రాంతంలోని 20 గ్రామాలను దిగ్బంధించి భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. షోపియన్ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లిన మిలిటెంట్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో యువత గుమిగూడి.. జవాన్లపై రాళ్లు రువ్వుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు. -
కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత
-
కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆందోళనకారులు భద్రతాబలగాల పైకి రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు 58 వ రోజుకు చేరుకోగా సుమారు 70 మంది మృతి చెందారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఇవాళ కశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో అఖిలపక్షం నేడు భేటీ కానుంది. అలాగే అక్కడి రాజకీయ పార్టీలతోనూ అఖిలపక్షం సమావేశం కానుంది. కాగా జమ్మూకశ్మీర్‌లో జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే కొత్త డిమాండ్ వినిపిస్తోంది. -
గ్రెనేడ్ దాడులతో దద్దరిల్లిన షాపియన్!
శ్రీనగర్ః జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు దాడులకు దిగారు. పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు ఓ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరారు. మరోచోట పోలీస్ చెక్ పోస్ట్ పై కూడ గ్రెనేడ్ తో దాడి చేశారు. గ్రెనేడ్ స్టేషన్ బయటే పేలిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పగా, చెక్ పోస్ట్ ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి. కాశ్మీర్ లోని షాపియన్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడుల్లో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు. సాయంత్ర 5.30 ప్రాంతంలో షాపియన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ బిల్టింగ్ ప్రాంతంలో టెర్రరిస్టులు పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గ్రెనేడ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోపలే పడిపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలోనే ఉన్న చెక్ పోస్టుపై కూడ టెర్రరిస్టులు గ్రెనేడ్ తో దాడులు జరిపారని, ఆ దాడుల్లో ఇద్దరు పౌరులు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్సకోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నట్లుండి జరిగిన దాడులతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి మిలిటెంట్లకోసం గాలిస్తున్నారు. -
షోపియాన్‌లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రత దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. కెల్లార్ ప్రాంతంలోని కద్దార్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపై కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన భద్రత దళాలు వెంటనే తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరు గయపడలేదని భద్రత దళాలకు చెందిన ఉన్నాతాధికారులు వెల్లడించారు. -
కశ్మీర్లో ‘ఉగ్ర’ ఘాతుకం
* యూరీ పట్టణంలోని ఆర్మీ క్యాంప్‌పై భీకర దాడి * లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసుల మృతి * 8 మంది మిలిటెంట్లను హతమార్చిన భద్రతా బలగాలు శ్రీనగర్: కశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందన్న ఆనందాన్ని ఆవిరిచేస్తూ.. మిలిటెంట్లు యూరీలోని ఆర్మీ క్యాంప్ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడ్డారు. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో మూడో విడత ఎన్నికలు జరగనుండటంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం శ్రీనగర్‌లో ఎన్నికల సభలో పాల్గొననున్న నేపథ్యంలో.. ఈ ఘటనలతో భద్రతాబలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులపై, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు తీవ్రం చేశారు. దాడులు జరిగిన యూరీ, శ్రీనగర్, త్రాల్, షోపియన్‌లలో 3, 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బారాముల్లా జిల్లా, యూరీలోని మొహ్ర ఆర్మీ క్యాంప్‌పై శుక్రవారం తెల్లవారుజామున 3.10 గంటలకు ఆరుగురు మిలిటెంట్లు అత్యాధునిక ఆయుధాలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన భద్రతతో ఉన్న మొదటి బ్యారక్‌లోని సిబ్బందిపై ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో క్యాంప్‌లో మంటలు చెలరేగాయి. దాంతో బుల్లెట్ గాయాలైన నలుగురు సైనికులు బ్యారక్ నుంచి బయటకు రాలేక, మంటలకు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న దగ్గర్లోని పంజాబ్ రెజిమెంట్‌లోని తక్షణ స్పందన దళం, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో లెఫ్టినెంట్ కల్నల్ సంకల్ప్ కుమార్, మరో ముగ్గురు సైనికులు, ముగ్గురు పోలీసులు(ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు) ప్రాణాలు కోల్పోయారు. జవాన్ల ప్రతిదాడుల్లో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆరు గంటల పాటు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద 6 ఏకే రైఫిళ్లు, 2 షాట్గన్లు, 32 గ్రెనేడ్లు, 4 రేడియో సెట్లు, పెద్ద ఎత్తున బుల్లెట్లు, మందుగుండు సామగ్రి లభించింది. మరో ఘటనలో శ్రీనగర్ శివారైన సౌరాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖారీ ఇస్రార్‌ను, మరో మిలిటెంట్‌ను పోలీసులు హతమార్చారు. శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిరువురినీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో వారిద్దరూ చనిపోయారు. రానున్న రోజుల్లో శ్రీనగర్‌లో ఒక భారీ దాడికి మిలిటెంట్లు వ్యూహం పన్నినట్లుగా సమాచారం ఉందని కశ్మీర్ ఐజీపీ అబ్దుల్ మిర్ వెల్లడించారు. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్, షోపియన్లలోనూ మిలిటెంట్లు గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. త్రాల్ బస్టాండ్ సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పౌరులు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. షోపియన్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పీర్ పంజల్ పర్వతాల గుండా దోడా ప్రాంతం నుంచి మిలిటెంట్లు తరచుగా షోపియన్లోకి వస్తుంటారు. కాగా, ఉగ్ర దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రధాని నరేంద్రమోదీ శ్రీనగర్ వెళ్తున్నారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కశ్మీర్లో సోమవారం మోదీ రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ‘జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పెరిగిన ఓటింగ్ శాతంతో నెలకొన్న ఆశావహ వాతావరణానికి విఘాతం కలిగించే లక్ష్యంతో జరిగిన దాడులివి. ఉగ్రవాదులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు 125 కోట్ల భారతీయులు శిరసు వంచి శ్రద్ధాంజలి par ఘటిస్తున్నారు’. - ట్వీటర్లో ప్రధాని మోదీ ‘ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొంటుండటంతో నిరాశలకు లోనైన ఉగ్రవాదులు ఈ దాడులకు దిగుతున్నారు. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నించాలి. సరిహద్దుల నుంచి మిలిటెంట్లు భారత్‌లోకి విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనికి పాక్ బాధ్యత వహించదా?’. - కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం వల్లనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు’. - రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ‘రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతియుత, సాధారణ పరిస్థితులకు విఘాతం కలిగించేందుకే ఈ దాడులు చేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల్లోని లోపాలను కేంద్రం సరిదిద్దుకోవాల్సి ఉంది’. - జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా -
షోపియాన్‌లో కర్ఫ్యూ సడలింపు
షోపియాన్ పట్టణం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా కొనసాగిన కర్ఫ్యూను ఎత్తివేసినట్లు తెలిపారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది, ఇటీవల ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్లు తమకు సమాచారం అందలేదని చెప్పారు. సెప్టెంబర్ 8న సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో షోపియాన్‌లో మొట్టమొదటిసారిగా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఎత్తివేశారు. ఆ మరునాడు ఆందోళనకారులు, జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో మరో యువకుడు మరణించారు. దాంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే గగరన్ పట్టణంలోని స్థానికులు మాత్రం సీఆర్పీఎఫ్ జవాన్లపై కేసు నమోదు చేయాలని, అలాగే వారి శిబిరాన్ని అక్కడ నుంచి తరలించాలని ఒమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
షోపియాన్‌లో కొనసాగుతోన్న కర్ప్యూ
శాంతిభద్రతల దృష్ట్యా షోపియాన్, కుల్గం, జమ్మూ కాశ్మీర్‌లోని పలు పట్టణాల్లో విధించిన నిరవధిక కర్ప్యూను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అయితే షోపియన్ పట్టణంలో అందోళనలు అదుపులోకి వచ్చాయన్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రంలో కర్ప్యూను పాక్షికంగా సడలిస్తామన్నారు. బుధవారం గగరన్ ప్రాంతంలోని సీఆర్పీఎప్ శిబిరం వద్ద జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ ఘటనను జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ జిలానీ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన అనంతరం నిరసన తెలపాలని ఆయన ముస్లిం మతస్థులకు పిలుపునిచ్చారు. అలాగే గగరన్ ఘటనకు నిరసనగా జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు మహ్మమద్ యాసిన్ మాలిక్ శుక్రవారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే జమ్ముకాశ్మీర్‌లో గగరన్ ప్రాంతంలో ఈ నెల 7, 11 తేదీల్లో జరిగిన కాల్పుల ఘటనపై ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే గగరన్లోని సీఆర్పీఎఫ్ శిబిరాన్ని మరోక చోటుకు తరలించాలని అబ్దుల్లా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి: ముగ్గురు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని షాపియన్ జిల్లా, గగ్రన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మధ్యాహ్నం తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. భద్రతాదళాలు వెంటనే తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించారని ఐజీ ఏ.జీ.మిర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. మృతులు ఏ సంస్థకు చెందిన తీవ్రవాదులో ఇంకా తెలియలేదని తెలిపారు.