
శ్రీనగర్: కశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
‘షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కశ్మీర్ పోలీసులు.
ఇదీ చదవండి: కరాచీలో దిగిన హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్.. విమానంలో 12మంది ప్రయాణికులు!
Comments
Please login to add a commentAdd a comment