Kashmiri pandits
-
కళకూ ప్రచారానికీ మధ్య...
భావాలను వ్యాప్తి చేయడంలో, ప్రజలను చైతన్య పర్చడంలో రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు జాకబ్ డ్రకెర్. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమా సాధనంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే ‘ద కశ్మీర్ ఫైల్స్’ మీద ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యలు మరింత బాగా అర్థమవుతాయి. అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే; రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉండాలి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఆ రేఖను ఉల్లంఘించింది. గోవాలో ఇటీవల ముగిసిన 53వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవంలో జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ‘ద కశ్మీర్ ఫైల్స్’పై చేసిన అవమానకర వ్యాఖ్యలు ఇప్పటికీ దేశంలో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. వివాదం రేగిన తర్వాత ఆయన క్షమాపణను ‘ఎన్డీటీవీ’ పతాక వార్తగా ప్రసారం చేయగా, మరోవైపున ‘ద వైర్’ కోసం నదావ్ లపీద్ ఇంటర్వ్యూ చేసిన పాత్రికేయుడు కరణ్ థాపర్ ఆ వార్తను ఖండించారు. తన వ్యాఖ్యను వెనక్కు తీసుకోవడానికి లేదా విరమించుకోవడానికి తిరస్కరించిన ఇజ్రాయిల్ దర్శకుడు ఆ ఇంటర్వ్యూలో తానెందుకలా అనవలసి వచ్చిందో స్పష్టం చేశారు. ‘‘అది నా కర్తవ్యం, నా విధి కూడా. వ్యర్థ ప్రసంగం చేయకుండా నిజా యితీగా ఉండటానికి నన్ను జ్యూరీకి ఆహ్వానించారు.’’ అయితే భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నష్టనివారణకు ప్రయత్నించారు. కశ్మీర్ పండిట్లు కశ్మీర్‌లోని తమ నివాసాలను బలవంతంగా వదిలివేయ వలసి వచ్చిన అంశంపై దృక్పథానికి సంబంధించినంత వరకూ, ఈ సినిమా బీజేపీకి ఒక పాక్షిక అధికారిక స్వరంగా ఉపయోగపడిందని ఇజ్రాయిల్ రాయబారి గుర్తించారు కనుకే తమ దేశస్థుడైన దర్శకుడి వ్యాఖ్యలను ఖండించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను చిత్రోత్సవంలో వీక్షించిన జ్యురీ సభ్యు లను అది ఇబ్బంది పెట్టిందనీ, షాక్‌కు గురిచేసిందనీ నదావ్ లపీద్ పేర్కొన్నారు. ఈ చిత్రం అసభ్యకరంగా ఉందనీ, వట్టి ప్రచార సినిమాలా ఉందనీ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్ర రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక సున్నితమైన విషయాన్ని మలిచిన విధానంపై లపీద్ చేసిన వ్యాఖ్యలు అసలు జరిగిన విషాదం వెనుక వాస్తవాలకు సంబంధించి గందరగోళాన్ని రేకెత్తించాయి. రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన కాలంలో – 1990ల మొదట్లో గవర్నర్ జగ్మోహన్ జమ్మూ కశ్మీర్ పాలనలో భాగమ య్యారు. అది కశ్మీర్ నుంచి ఉన్నట్లుండి హిందూ వలసలు ప్రారంభ మైన కాలం. శతాబ్దాలుగా తమతో కలిసి మెలిసి జీవిస్తున్న ఇరుగు పొరుగు హిందువులతో సంబంధాలను తెంచుకోవాలని మిలిటెంట్లు ముస్లిం మెజారిటీని ఒత్తిడికి గురిచేశారు. కశ్మీర్ నుంచి వలసల వెల్లువ మొదలైన ఇతివృత్తంతో తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి. ఆ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు థియేటర్లలో సినిమా విడుదల కాకముందే ప్రశంసలు గుప్పిం చడం, ప్రజలను విభజించే అభిప్రాయాలు వెల్లడించడం మొదలు పెట్టారు. సుప్రసిద్ధ ‘టైమ్ మ్యాగజైన్’ ఒక విశేష కథనాన్ని ప్రచురిస్తూ– ‘ద కశ్మీర్ ఫైల్స్: బాలీవుడ్ కొత్త సినిమా భారత్‌ని మరింతగా మత దురభిమానంలోకి ఎలా నెడుతోంది?’ అనే శీర్షిక పెట్టింది. ‘న్యూయార్క్ టైమ్స్’ సైతం ‘కశ్మీర్ హిందువుల బహిష్కరణపై వచ్చిన సినిమా భారత్‌ను వేరుచేస్తూ ప్రజాదరణ పొందుతోందా?’ అనే శీర్షికతో తన ఆలోచనలను ప్రతిధ్వనించింది. ఇక సింగపూర్ అయితే రెచ్చగొట్టేలా ముస్లింల గురించి ఏకపక్షంగా చిత్రించిందని పేర్కొంటూ సినిమా విడుదలపై నిషేధం విధించింది. వివిధ మతాల మధ్య ఇది శత్రుత్వాన్ని ప్రేరేపించేలా ఉందని పేర్కొంది. ఇదే ప్రాతిపదికన భారతదేశంలో అనేక చోట్ల ఎఫ్ఐఆర్లు నమోద య్యాయి. ఈ సినిమా ప్రకటించే భావాలు స్వల్ప స్థాయిలో అయినా సరే దాడులకు ప్రేరేపించే అవకాశమిస్తున్నప్పుడు, బీజేపీ, దాని భక్తులు దీన్ని ఎందుకు పనిగట్టుకుని ప్రోత్సహించినట్లు? కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యల్లో కొత్త విషయమూ లేదు, ఆశ్చర్యం కలిగించేదీ లేదు. అలాంటప్పుడు దీంట్లో సమస్య ఏంటి? చర్చ పాతదే. సాహిత్యం లేదా సినిమా ప్రజలకు వినోదం కలిగించాలా, చైతన్యం కలిగించాలా లేదా ఒకే సమయంలో రెండింటికీ అవకాశం కల్పించాలా? ‘ద హార్వర్డ్ క్రిమ్సన్’ పుస్తకంలో జాకబ్ ఆర్ డ్రకెర్... భావాలను వ్యాప్తి చేసే, ప్రజలను చైతన్య పర్చే రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు. కాబట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమాలు సాధనంగా మారవచ్చు. ఈ కోణంలో చూస్తే చారిత్రక దిద్దుబాటు పట్ల బీజేపీ జాగ్రత్తగా ఉన్నట్టు కనిపించదు. ‘టైటానిక్’ మునకను మరోసారి గుర్తు చేయడానికి లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ నటించిన లాంటి మానవ జ్ఞాపకాన్ని తిరిగి మల్చగలిగిన చిత్రాల ఉదాహరణలు మనకు అనేకం ఉన్నాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘లింకన్’ లేదా కెనడీపై అలివర్ స్టోన్ తీసిన ‘జేకేఎఫ్’ వంటివి వీక్షకుల దృష్టికోణంలోంచి గతంలోని చారిత్రక ఘటనలు, వ్యక్తులను సినిమా రూపంలో మలిచినవి. విషాదకరమైన ఉపద్రవాలతో కూడిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటి చిత్రీకరణ నిజంగానే సవాలు విసురుతుంది. ప్రత్యేకించి వీక్షకులు అలాంటి ఘటనలకు మరీ దూరమైన కాలంలో లేనప్పుడు, వాటిపట్ల నిర్మమకారంతో తమ అభిప్రాయాలు పంచు కోలేనప్పుడు ఇది మరింత సవాలుగా ఉంటుంది. అందుకే, కశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేసి ఉండకూడదని శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. ఎందుకు చేయకూడదని చాలా మంది ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా కౌంటర్ ప్రశ్నను సంధిం చాల్సిన అవసరం ఉంది. గోధ్రా అల్లర్లు లేదా బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ఘటనలపై అన్ని కోణాల్లో సత్యాన్ని చిత్రించే సినిమా తీసినట్లయితే దాని విడుదలకు బీజేపీ అనుమతిస్తుందా? అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని, లేదా ప్రపంచంలో తమ పాత్ర గురించి వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటా యన్నది నిజం. 1968లో వియత్నాం యుద్ధంపై అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న కాలంలో, నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘ద గ్రీన్ బెరెట్స్’ సినిమాను జాన్ వేయిన్ తీశారు. అమెరికా అసాధారణ వాదం నుంచి, అంతర్జాతీయ సుస్థిరతకు హామీ ఇవ్వడానికి, ప్రపంచ ఆధిపత్య శక్తిగా స్వీయ ప్రకటిత పాత్ర పోషించే నేపథ్యంలోంచి అనేక సూపర్ హీరో సినిమాలు వెల్లువెత్తాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే, రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉంటుంది. ఈ లక్ష్మణ రేఖను ‘ద కశ్మీర్ ఫైల్స్’ స్పష్టంగా మీరింది. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ఒక మూడో ప్రపంచ దేశాన్ని అవమానపర్చడంలో భాగంగా ఈ ‘ఈకలు పీకలేదు’. ఇదే రకమైన విమర్శలను ఆయన తన స్వదేశంలో కూడా చేశారు. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సెటిలర్లకు విరాళాలను పొడిగించడానికి లేదా వారి ఆక్రమణను సమర్థించే చిత్రాలను ప్రోత్సహిస్తున్న షోమ్రోన్ ఫిల్మ్ ఫండ్‌ను ఖండించడానికి ఆయన 250 మంది ఇజ్రాయిలీ ఫిలింమేకర్స్తో చేతులు కలిపారు. ఘటనల యధార్థాన్ని ప్రశ్నించ కుండానే కశ్మీర్ ఫైల్స్ చిత్రించిన తరహా విషాదాన్ని విమర్శించవచ్చని లపీద్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ నోరు విప్పి మాట్లాడటానికి భయపడుతున్న చోట నివసించడానికి ఎవరైనా ఇష్టపడతారా అని ఆయన ప్రశ్నించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వ సామర్థ్యాలు లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలోని ఉన్మాద ప్రకటనలు లేక ప్రభుత్వ ప్రతినిధి వెర్రి చేష్టల కంటే మనం చూడాల్సిన నిజమైన సమస్య ఇదే మరి. నిజాలను నిర్ధారించడానికీ, లేదా ప్రభుత్వం నిర్దేశిస్తున్న వాస్తవికతను ప్రశ్నించడానికీ భారతదేశంలో ఇప్పటికీ చోటుందా? కేసీ సింగ్ వ్యాసకర్త మాజీ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్‌కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్‌లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా మరోమారు రెచ్చిపోయారు ఉగ్రవాదులు. షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండింట్లే లక్ష్యంగా శనివారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో తన ఇంటి సమీపంలోనే పురాన్ క్రిష్ణ భట్ అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు.. బాధితుడు భట్‌కు ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, తాము భయం భయంగా బతుకుతున్నామని ఆయన బంధువు ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల భయంతో భట్ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టేందుకు సైతం భయపడేవాడని చెప్పారు. ఇంతకు ముందు ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కొద్ది రోజులు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా.. మరోమారు తూటా పేలటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పండిట్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఇదీ చదవండి: కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి -
కశ్మీరీ పండిట్లకు రక్షణ ఏదీ?: ఒవైసీ
ఢిల్లీ: కశ్మీరీ పండిట్ల రక్షణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా అక్కడ కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణ కరువైంది. కేంద్ర పాలన దారుణంగా విఫలమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు పండిట్లకు లాభం చేకూరుస్తుందని ప్రచారం చేసింది కేంద్రం. కానీ, ఇప్పుడు వాళ్లు అక్కడ అభద్రతా భావానికి లోనవుతున్నారు అని కేంద్రాన్ని నిందించారు ఒవైసీ. అక్కడ(జమ్ము కశ్మీర్)లో బీజేపీ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. నరేంద్ర మోదీ పాలనే అక్కడా సాగుతోంది. కానీ, చేతకానీ స్థితిలో ఉండిపోయారు వాళ్లు అంటూ విమర్శించారు. అలాగే.. గుజరాత్లో బిల్కిస్ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపైనా ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ నారీశక్తి గురించి మాట్లాడారు. అలాంటిది గ్యాంగ్‌రేప్ దోషులకు రిలీజ్ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఇక యూపీలో గాడ్సే ఫొటోతో తిరంగా యాత్రను నిర్వహించడంపై.. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ ఒవైసీ. మాటల్లో గాంధీని ఉపయోగిస్తున్నారని.. కానీ, చేతల్లో గాడ్సే మీద ప్రేమను ఒలకబోస్తున్నారంటూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో క(వ్య)థ ఇది! -
కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా టెర్రరిస్టుల కాల్పులు.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తూటా గాయాలయ్యాయి. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ‘షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కశ్మీర్ పోలీసులు. ఇదీ చదవండి: కరాచీలో దిగిన హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్.. విమానంలో 12మంది ప్రయాణికులు! -
మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో శాంతిని పునఃస్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహాయులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాటు ప్రజలూ, మీడియాను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి, మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. కాబట్టి, కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్త పడినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. గ్రీకు పురాణాల్లో ‘హుబ్రిస్’ అని పిలుస్తారు దాన్ని. ఇంగ్లిష్ నిర్వచనం ప్రకారం అధిక గర్వం లేదా మితిమీరిన అహంకారం అనవచ్చు. గ్రీకుల పురాతన మత బోధనల్లో ‘హుబ్రిస్’కు గురైన వారు... నెమిసిస్ అనే దేవత చేతిలో హతమవుతారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొం టున్నట్లు కనిపిస్తోంది! తిరిగి వెళ్తున్న పండిట్లు ఆర్టికల్ 370, 35ఏ రద్దు తరువాత కశ్మీర్ లోయలో శాంతిని పునః స్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహా యులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు వెళుతున్న పండిట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే కొన్ని వందల మంది పండిట్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూ చేరుకున్నారు. అంతేకాదు... ఉద్యోగం కోసం తప్పనిసరి చేస్తూ తమతో రాయించు కున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేల మంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం లభించాయి. ప్రభుత్వం వీరి కోసం వేర్వేరు జిల్లాల్లో తాత్కాలిక ఇళ్ల నిర్మాణమూ చేపట్టి పూర్తి చేసింది. పండిట్ల తిరుగు వలస నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఉద్యోగ ఒప్పందాలను చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రచార పటాటోపానికి మాత్రమే పనికొచ్చే నిర్మాణాలు కొన్ని చూపి అంతా బాగానే ఉందనే భ్రమను కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ ట్రాన్సిట్ క్యాంపుల వద్ద కనీస భద్రతా సౌకర్యాలు, సిబ్బంది కూడా లేకపోవడం మాత్రమే వాస్తవం. అణిచివేతే విధానం కశ్మీర్ విషయంలో ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. కశ్మీర్‌లోని మిలిటెంట్లూ, ఉగ్రవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ, మీడియాను కూడా అనూహ్య రీతిలో తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. అటు ఉగ్ర వాదులు, ఇటు ప్రభుత్వం మధ్యలో బలవుతున్నది మాత్రం నిరా యుధులైన అమాయకులు. మరీ ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు. వీరితో పాటు ప్రభుత్వ విధాన అమలుకు సహకరించారన్న అంచనాతో స్థానిక పోలీసు సిబ్బంది మీద కూడా ఉగ్రవాదుల దాడులు జరుగు తున్నాయి. పోలీసులను పరిస్థితులకు బందీలుగా కాకుండా ప్రభుత్వ ఉపకరణాలుగా ఉగ్రవాదులు చూస్తున్నారు. 2019 తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వివాదాస్పద విధానాన్ని అవలంబించిందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయన్న భ్రమలో దాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని కాస్తా కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి తగ్గించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచారు. పరిపాలన మొత్తం నేరుగా ఢిల్లీ నుంచే నడిచేది. వీటన్నింటికి తోడుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు నిర్వ హించిన ‘ఆపరేష¯Œ ఆలౌట్’ను మనం మరచిపోకూడదు. ఉగ్రవాద అణచివేతలో విజయం సాధించామన్న ప్రభుత్వ ప్రచారార్భాటాన్నీ గుర్తుంచుకోవాలి. వాస్తవిక పరిస్థితులు వేరే... 2021 డిసెంబరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి, కశ్మీర్ పాలనా వ్యవస్థకు అనధికార నేత అయిన అమిత్ షా మాట్లా డుతూ – ఆర్టికల్ 370 తొలగింపు ద్వారా కశ్మీర్లో శాంతి స్థాపనకు మార్గం ఏర్పడిందనీ, అభివృద్ధి సుసాధ్యమైందనీ మరోసారి వ్యాఖ్యా నించారు. అలాగే ఈ ఏడాది మార్చిలోనూ కశ్మీర్లో హింస తగ్గి పోయిందని నిరూపించేందుకు బోలెడన్ని గణాంకాలు వల్లెవేశారు. గణాంకాలు కాగితంపై బాగానే కనిపిస్తాయి కానీ... వాస్తవ పరిస్థి తులు పరిశీలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. తుదముట్టించిన మిలిటెంట్ల సంఖ్య, అరెస్ట్ అయినవారు, స్వాధీనం చేసుకున్న ఆయు ధాలు, పునరావాసం పొందిన పండిట్లు, కుదుర్చుకున్న ఒప్పందాల వంటివన్నీ అమిత్ షా మాటల్లో వినిపించాయి అయితే వీటన్నింటి మధ్య జన సామాన్యుల భావనలెలా ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఆరేళ్ల అణచివేత ధోరణుల ఫలితంగా ప్రజలు అప్పటికే విసుగెత్తి ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశమూ లేకపోయిన నేపథ్యంలో వారు ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తారని ఆశించలేము. ఉగ్రవాదం తీరు మారింది! ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సైనిక చర్యల కారణంగా గణనీయంగా తగ్గిపోయిన ఉగ్రవాద కార్యకలాపాలు కాస్తా మళ్లీ తీవ్రవాదం స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏకే 47, ఆర్‌పీజీలతో జరగడం లేదు కానీ... వ్యక్తులను ఎంచుకుని మరీ తుపాకులు, గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టారు. లక్ష్యితులు నిరాయుధులు కావడం, ఆయుధాలను దుస్తుల్లో దాచుకుని వెళ్లగలగడం ఉగ్రవాదుల పనిని మరింత సులువు చేస్తోంది. అతి సాధారణ జీవితం గడుపుతూ అవసరమైనప్పుడు పండిట్ల వంటి నిరాయుధులను, లేదంటే విధి నిర్వహణలో లేని పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపడం ఈ హైబ్రిడ్ మిలిటెన్సీ తీరుతెన్నులుగా మారాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని సైన్యం స్వయంగా గత ఏడాది జూ¯Œ లో ప్రకటించింది కాబట్టి... ఈ తాజా దాడులు, హైబ్రిడ్ మిలిటెన్సీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నలలోనే జరుగుతోందని మనం కచ్చితంగా అను కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే... మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మిలిటెంట్లు పని చేస్తున్నారని చెప్పాలి. తుపాకులకు చోటు లేదు! కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అణచివేతలో నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎంతో సమర్థతతో వ్యవహరించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకమార్లు ఏర్పడ్డాయి కూడా! అయితే ఒక మిలిటెంట్ హతమైతే... అతడి స్థానంలో ఇంకొకరు పుట్టుకొస్తున్నారు. అంటే... ఎంత మంది మిలిటెంట్లను చంపాం? ఎన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం? అన్నవి ముఖ్యం కాదన్నమాట. కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్తపడినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లు. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలేమిటన్నది బీజేపీ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం వారు వాటిని విస్మరి స్తున్నారు. ఇదీ రాజకీయం ప్రత్యేకత. పాకిస్తాన్ కారణంగా కశ్మీర్ విషయంలో దౌత్యమూ అత్యవసరం. కానీ అవేవీ చేయకుండా మనం అణచివేత రాజకీయాలకు పాల్పడతూ, ఉడికీ ఉడకని జాతీయత అనే భావన ఆధారిత విధానాలను అవలంబిస్తున్నాం. వ్యాసకర్త: మనోజ్ జోషీ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కశ్మీర్‌పై రాజకీయాలు వద్దు
న్యూఢిల్లి: జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల దాడుల వల్ల కశ్మీరీ పండిట్లు బలవంతంగా వలస వెళ్లాల్సి వస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ చెప్పారు. పండిట్లు కశ్మీర్ లోయను వదిలి, బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారని గుర్తుచేశారు. ఓ వర్గంపై దాడులను, టార్గెట్ కిల్లింగ్స్‌ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆప్ ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘జన ఆక్రోశ్ ర్యాలీ’లో కేజ్రివాల్ మాట్లాడారు. పండిట్ల దుస్థితిని చూస్తే అధికార బీజేపీకి నీచ రాజకీయాలు చేయడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే సత్తా లేదని తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఇండియా గనుక దృఢమైన నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ అనే దేశం మిగలదన్నారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో పండిట్లను, ముస్లిం భద్రతా సిబ్బందిని ఉగ్రవాదులు హత్య చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కొన్ని సినిమాల ప్రమోషన్లో బిజీ ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. -
రక్తపు కూడు తినమనడం ఏంటి? ఏం సినిమాలివి?
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్ధుల్లా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరిట దేశంలో మత ద్వేషాల్ని మరింత పెంచుతున్నారని, ఇలాంటి సినిమాలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ఉద్దేశిస్తూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి మతోన్మాద జాడ్యానికి ముగింపు పడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపడం, కశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేడం, వాళ్లను కట్టడి చేసేందుకు బలగాలు కఠిన చర్యలు చేపట్టడం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో కశ్మీరి పండిట్లకు మద్ధతుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు ఫరూక్ అబ్దుల్లా. ‘‘ఎల్జీ వద్ద కశ్మీర్ ఫైల్స్ ప్రస్తావన కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలు దేశంలో ద్వేషాలను పెంచుతున్నాయి. ఒక ముస్లిం హిందువును చంపి.. అతని రక్తపు కూడును భార్యతో తినమనడం ఏంటి? ఇలాగ జరుగుతుందా? అసలు.. సినిమా పేరుతో ఇష్టమొచ్చినట్లు చూపించి.. మనుషుల మధ్య చిచ్చు పెడతారా? ఇలాంటి వాటికి ముగింపు పడాల్సిన అవసరం ఉంది’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. #WATCH We met LG Manoj Sinha to raise the issue of the law & order situation in J&K. During the meeting, I told him that the film 'The Kashmir Files' has given birth to hate in the country. Such things (films) should be banned: Dr Farooq Abdullah, National Conference pic.twitter.com/Z1BkoNijRO — ANI (@ANI) May 16, 2022 కొందరు ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. వాళ్ల చర్యలు మంచివి కావు. కశ్మీరీలోని ముస్లిం యువత ఈ తీరుతో ఊగిపోతుంది అంటూ చెప్పుకొచ్చారాయన. అలాగే భద్రత కోరుతున్న కశ్మీరీ పండిట్లపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీ ప్రయోగించడం ఏంటి? ఆ అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ‘‘వాళ్లు(కశ్మీరీ పండిట్లు) రాళ్లు రువ్వారని భద్రతా సిబ్బంది చెప్తోంది. కానీ, ఈనాటికీ ఈ గడ్డపై కశ్మీరీ పండిట్లు రాళ్లు విసరడం నేను చూసింది లేదు’’ అని ఫరూఖ్ చెప్పారు. కశ్మీర్ పండిట్లతో కలిసిపోవాలనే మేం అనుకుంటాం. ఒకటి కలిసి బతకాలనే అనుకుంటున్నాం. బుద్గంలో నిరసనలు చెబుతున్న కశ్మీర్ పండిట్లకు సానుభూతి తెలిపేందుకు మమ్మల్ని అనుమతించడం లేదు. అనుమతించకపోతే.. అసలు వాళ్లకు దగ్గర అయ్యే అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుందని ఫరూఖ్ అన్నారు. చదవండి: చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కేజ్రీవాల్‌కు బీజేపీ కౌంటర్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం రీ కౌంటర్
న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై పాక్ ఉక్రమూకలు జరిపిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమాపై గత కొద్దిరోజులుగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలసిందే. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ అంశంపై మాట్లాడుతూ.. కశ్మీర్ పండిట్ల కష్టాలను పట్టించుకోని బీజేపీ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాత్రం శ్రద్ధ చూపిస్తోందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లు కేంద్రంలో అధికారం ఉన్న కాషాయ పార్టీ కశ్మీర్ పండిట్లకు ఏం న్యాయం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ పండిట్లు కశ్మీర్‌కు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోరుకుంటున్నారని సిసోడియా అన్నారు. బీజేపీ కేవలం కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఆందోళన చెందుతోందని, కాశ్మీరీ పండిట్లు కోసం కాదని ఆయన ధ్వజమెత్తారు. కాశ్మీరీ పండిట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా చేశారని ఆయన అన్నారు. సరైన డాక్యుమెంట్లు లేకపోయినా 223 మంది ఉపాధ్యాయులకు శాశ్వత హోదా కల్పించారని, వారి పెన్షన్ వ్యవస్థను క్రమబద్ధీకరించారని అన్నారు. ఢిల్లీలోని కాశ్మీరీ పండిట్లకు నెలకు రూ. 3000 కూడా అందించారని చెప్పారు. అయినా కాశ్మీరీ పండిట్లకు కావాల్సింది సినిమా కాదని వారికి తగిన న్యాయం జరగాలని సిసోడియా చెప్పారు. కాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్ను మినహాయింపు అంశంపై కేజ్రీవాల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరూ ఉచితంగా చూస్తారని వ్యాఖ్యానించారు. అలాగే సినిమా కలెక్షన్లను కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు.. ఇంతకూ ఢిల్లీలో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని కేజ్రీవాల్‌పై కౌంటర్ వేశారు. దీనికి స్పందనగా ఢిల్లీ డిప్యూటీ సీఎం రీకౌంటర్ వేశారు. -
కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా?
జమ్మూ: ఓట్ల కోసం బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని, కశ్మీరీ పండిట్ల ఆవేదనను, అగచాట్లను ఒక ఆయుధంగా వాడుకుంటోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను బీజేపీ తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. పరాయి ప్రాంతాలకు వలస వెళ్లిన హిందూ సోదరులు కశ్మీర్‌కు క్షేమంగా, గౌరవప్రదంగా తిరిగి రావాలని ఇక్కడ ముస్లింలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు కశ్మీరీ పండిట్లం అని చెప్పుకొంటూ ఢిల్లీలో టీవీ స్టూడియోల్లో కూర్చొని విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పండిట్లు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లతో కూడిన ప్రతినిధి బృందం తాజాగా మహబూబా ముఫ్తీతో సమావేశమయ్యింది. కశ్మీర్లో ఇటీవల సామాన్య పౌరులపై ఉగ్రవాదుల దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తమ భయాందోళనలను ఆమె దృష్టికి తీసుకెళ్లింది. పండిట్లు వలస వెళ్లడం వల్ల కశ్మీరీ ముస్లింలు ఎంతగానో నష్టపోయారని మహబూబా ముఫ్తీ చెప్పారు. మనల్ని విడదీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పండిట్లకు పిలుపునిచ్చారు. (చదవండి: ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి) -
వారు గాడిదలతో సమానం: దర్శకుడు
తన సినిమాపై ఆరోపణలు చేసిన వారు గాడిదలతో సమానమని బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘షికారా’ ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989-90 కాలంలో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీర్ పండితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు రాబట్టకపోవడంతో కొంతమంది సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తన్నారు. కశ్మీరీల జీవితాలను కమర్షియల్‌గా చూపించిన విధుకు సరైన శాస్తి జరింగిందంటూ విమర్శించారు. అలాగే ట్విటర్లో #BoycottShikara అంటూ హ్యష్‌ట్యాగ్‌తో సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ‘ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’ అని ఓ కశ్మీర్ మహిళ విధు చోప్రాపై విరుచుకుపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’) తాజాగా ఈ విమర్శలపై స్పందించిన విధు చోప్రా.. గాడిదలుగా మాట్లాడకండి అంటూ విమర్శకులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన 3 ఇడియట్స్ మొదటి రోజు రూ. 33 కోట్లు రాబట్టింది. అలాగే షికారా మొదటి రోజు రూ. 30 లక్షలు సాధించింది. అయినా ఈ సినిమా తీయడానికి మేము 11 సంవత్సరాల సమయం కేటాయించాం. నేను మొదటి రోజు రూ. 33 కోట్లు సాధించిన సినిమా చేశాను. కానీ నా తల్లి జ్ఞాపకార్థం కోసం చేసిన సినిమా మొదటి రోజు రూ. 30 లక్షలు వసూలు చేసింది. అయినా కశ్మీర్ ప్రజలు బాధను నేను వాణిజ్యపరంగా చేశానని ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధంగా భావించే వారు గాడిదలు అని నేను అనుకుంటున్నాను. నేను కేవలం వాస్తవాలనే మాత్రమే చిత్రీకరించాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. గాడిదలు కాకండి. ముందుగా సినిమా చూసి ఆ తరువాత ఓ అభిప్రాయానికి రండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘షికారా’ను నిలిపి వేయాలంటూ పిటిషన్) చదవండి : సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్ -
సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన తాజా మూవీ ‘షికారా’ ప్రీమియర్ షోను ఆదివారం ఢిల్లీలో ప్రదర్శించారు. జమ్మూలోని జగ్తి క్యాంపస్‌కు చెందిన సుమారు 300 మంది కాశ్మీరీ పండితులు, ఇతర ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. వీరిలో చాలా మంది పండితులు సినిమాలో కూడా నటించారు. కశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ పండితులను బషిష్కరించి 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 1990 జనవరి 19, 20 తేదీల్లో కాశ్మీరీ పండితులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కశ్మీర్‌ను వదిలి వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 4 లక్షల మంది వలస వెళ్లిన పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా వినోద్ చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రాన్ని తన తల్లి శాంతి దేవికి అంకితం చేస్తున్నానని తెలిపారు. వినోద్ చోప్రా తల్లి శాంతి.. పరిందా చిత్రం కోసం 1989లో కశ్మీర్ నుంచి ముంబై వచ్చి 1999లో తిరిగి కశ్మీర్ వెళ్లే క్రమంలో మరణించారు. ఈ సినిమా కేవలం చిత్రం మాత్రమే కాదని కశ్మీర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లకముందే మరణించిన తన తల్లి కోసం రూపోందించానని వినోద్ చోప్రా తెలిపారు. తన కలను సాధ్య పరచడంలో సహకరించిన కాశ్మీరీ పండితులకు చోప్రా కృతజ్ఞతలు తెలిపారు. కాగా షికారాను తెరకెక్కించడానికి తనకు 11 ఏళ్లు పట్టిందని అన్నారు. ఈ మధ్యలో మూడు మున్నా భాయ్ సినిమాలు రెండు 3 ఇడియట్స్ సినిమాలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో షికారా ప్రివ్యూతో పాటు మరో రెండు వీడియోలు కూడా ప్రదర్శించారు. సినిమా రచయితలో ఒకరైన రాహుల్ పండిట్ కూడా 990 లో కశ్మీర్‌ను వదిలి వచ్చిన పండితులలో ఒకరు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.."ఈ సినిమా మన కథను ప్రపంచానికి తెలియజేసే మొదటి ప్రయత్నం. మేము వలవ వెళ్లి 30 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం జరగాలి’’ అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. తమ పాత్రల కోసం దాదాపు రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నట్లు విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది -
భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..
జమ్మూ: ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.. కుటుంబానికో వ్యథ. తమ సంస్కృతిని మరచిపోయారు. సంప్రదాయాలు వదిలేశారు. ప్రాణ సమానంగా ప్రేమించిన సాహిత్యం, కవిత్వం, సంగీతం గుర్తు కూడా లేదు. ఇస్లాం ఉగ్రవాదుల దాడుల భయంతో మూడు దశాబ్దాల కిందట కట్టుబట్టలతో తమ సొంత గడ్డను వీడిన కశ్మీర్ పండిట్లలో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో తిరిగి మాతృభూమికి చేరుకోవాలని పండిట్లు అందరూ తహతహలాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం 1990, జనవరి 19 అర్ధరాత్రి ఇస్లాం జీహాదీల ఊచకోతతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన పండిట్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ఒకటయ్యారు. తాము లోయను విడిచి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో హమ్ వాపస్ ఆయేంగే హ్యాష్ ట్యాగ్‌తో వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. కొందరు అప్పట్లో శ్రీనగర్ నుంచి జమ్మూకి కొన్న బస్సు టిక్కెట్లు షేర్ చేస్తూ ఉంటే, మరికొందరు పీడకలలా ఇప్పటికీ వెంటాడుతున్న ఆనాటి అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు నష్టపరిహారం చెల్లించి లోయలో భద్రత కల్పించాలని ఆనాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి సర్వానంద్ కౌల్ ప్రేమి కుమారుడు రాజేందర్ కౌల్ ప్రేమి డిమాండ్ చేస్తున్నారు. ఇక జమ్ములో ఆదివారం పండిట్లు కశ్మీర్ లోయని విడిచి పెట్టి 30 ఏళ్లయిన సందర్భంలో ఆల్ స్టేట్ కశ్మీరీ పండిట్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సొంతింటికి తాము తిరిగి వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూతల స్వర్గం నరకంగా మారిన వేళ.. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో మైనర్లుగా ఉన్న పండిట్లపై ఇస్లాం వేర్పాటువాద తీవ్రవాదులు దాడులకు దిగారు. జేకేఎల్ఎఫ్, ఇతర ఇస్లాం జీహాదీలు హిందువులు ఇస్లాంలోకి మారాలని, మారకపోతే లోయని విడిచిపెట్టి పోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. 1989–90 మధ్య కాలంలో వందలాది మంది కశ్మీర్ పండిట్లను చంపేశారు. మహిళలపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు. హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు. కశ్మీర్‌ని అల్లాయే పరిపాలించాలి అంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు. దీంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని 5 లక్షల మంది వరకు కశ్మీర్ పండిట్లు లోయని విడిచిపెట్టి జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పారిపోయారు. మోదీ సర్కార్ ప్రణాళికలేంటి ? కేంద్రంలో మోదీ సర్కార్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. కశ్మీర్ ఘర్షణల్లో చెల్లాచెదురైన 5 లక్షల మంది పండిట్లను తిరిగి కశ్మీర్ లోయకి తెప్పించడానికి 2015లో రోడ్ మ్యాప్ రచించింది. వీరి కోసం సురక్షితమైన టౌన్‌షిప్‌లు నిర్మించాలని, అందులోనే షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇప్పుడు కశ్మీర్‌ను తన పాలన కిందకి తెచ్చుకోవడంతో పాటు పండిట్లు కూడా తిరిగి సొంత గూటికి చేరుతామన్న డిమాండ్లతో అది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. -
పండిట్లలో ఆ ఆగ్రహం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో మిలిటెంట్ల అరాచకాలను, హింసాకాండను తట్టుకోలేక కశ్మీర్ నుంచి చెల్లా చెదురై నేడు దేశవ్యాప్తంగా స్థిరపడిన పండిట్ల కుటుంబాలు కశ్మీర్ పట్ల కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను ఎత్తివేయడం సబబేనని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకాలానికి తమ ప్రతికారం తీరిందని, తమకు న్యాయం దక్కిందని వారు అంటున్నారు. ప్రతికారాత్మక వాంఛతోనే వారిలో ఎక్కువ మంది కేంద్రం నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. వారిలో ఎందుకు అంత ఆగ్రహం పేరుకుపోయింది? జమ్యూ కశ్మీర్లో 1989 నుంచి మిలిటెంట్ కార్యకలాపాలు పెరిగిపోయాయి. వారికి హిందువులైన పండిట్లంటే అసలు పడలేదు. వారి కుటుంబాలు లక్ష్యంగా మిలిటెంట్లు దాడులు జరిపారు. 1990వ దశకంలో జరిగిన ఈ దాడుల్లో 219 మంది మరణించినట్లు 2010లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన ఓ నివేదికనే వెల్లడించింది. నాడు పండిట్ల ఇళ్లను తగులబెట్టారు. దోచుకున్నారు. వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెల్లా చెదురుగా పారిపోయారు. నాడు కశ్మీర్ నుంచి పారిపోయిన ఓ పండిట్ కుటుంబానికి చెందిన ఆషిమా కౌల్ కేంద్రం నిర్ణయాన్ని హర్షించారు. అమె ప్రస్తుతం జమ్మూలో స్థిరపడి వివిధ సామాజిక వర్గాల ఐక్యతకు కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని ఫరిదాబాద్‌లో స్ధిరపడిన అముల్ మాగజైన్ చెప్పారు. గురుగ్రామ్‌లో స్థిరపడిన మీనాక్షి భాన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికి కశ్మీర్‌లోనే స్థిరపడిన పండిట్ కుటుంబాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేస్తున్నాయి. ఇది అప్రజాస్వామికం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, ఏకపక్షమని పండిట్లు, డోగ్రాలు, సిక్కులతో కూడిన ఓ 65 మంది సభ్యుల బృందం విమర్శించింది. ఈ మేరకు వారు ఓ ఖండనను విడుదల చేశారు. దానిపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ కార్డియోలాజిస్ట్ ఉపేంద్ర కౌల్, రిటైర్ ఏర్ వైస్ మార్షల్ కపిల్ కాక్, జర్నలిస్టులు ప్రదీప్ మాగజైన్, శారదా ఉగ్రాలతోపాటు పలువురు విద్యావేత్తలు సంతకాలు చేశారు. 1949లో రాజ్యాంగ పరిష్యత్తుతో సమగ్రంగా చర్చించే 370 ఆర్టికల్ తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎలా ఏకపక్షంగా ఎత్తివేస్తారని వారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. -
పండిట్ల ఘర్ వాపసీ!
దేశమంతా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై వాదోపవాదనలు జరుగుతుంటే.. కశ్మీరీ పండిట్లు సంబరాలు చేసుకుంటున్నారు. వీరు కశ్మీర్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. ఎందరు విడిచి వెళ్లారు? ఇప్పుడెక్కడ స్థిరపడ్డారు? లోయలో ఇప్పుడెందరున్నారు? చూద్దాం... మూడు కేటగిరీలు పండిట్లు.. కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి.. కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి. డోగ్రా పాలనలో.. 1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది. ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం. పెరిగిన అకృత్యాలు 1989 మధ్య నాటికి ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగిపోయింది. పండిట్లలోని పురుషులను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరపడం, వారి ఇళ్లలో చోరీలు చేయడం అధికమయ్యాయి. తప్పనిసరి పరిస్థితులో పండిట్లు లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా.. వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పండిట్లకు బాల్ థాక్రే సాయం.. కశ్మీర్ నుంచి వలస వచ్చిన పండిట్లకు మొదటగా సాయం చేసింది శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే. ఇంజనీరింగ్ కాలేజీల్లో పండిట్ల కుటుంబాల్లోని పిల్లలకు ఆయన రిజర్వేషన్లు కల్పించారు. కాగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లెక్కల ప్రకారం 2010లో కశ్మీర్లో 808 పండిట్ల కుటుంబాల్లో మొత్తం 3,445 మంది జనాభా ఉన్నట్లు తేలింది. -
పప్పులో కాలేసిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పప్పులో కాలేశారు. నిజమైన పప్పులో కాదండోయ్. కశ్మీరీ పండిట్లకు నూతన సంవత్సర (నవ్రే) శుభాకాంక్షలను తెలపాలనే ఉద్దేశంతో ప్రియాంక చేసిన ట్వీటు హాస్యాస్పదం అవుతోంది. కశ్మీరీల పండుగ నర్మేకు బదులు నౌరోజ్ ముబారక్ అని ప్రియాంక తప్పుగా ట్వీటారు. దీంతో ప్రియాంక ట్వీటును విమర్శిస్తూ, ఆమె మీద జోకులు పేలుస్తూ చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తన్నారు. ‘మేడమ్ ప్రియాంక గారు, నౌరోజ్‌ను మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు ఏప్రిల్ 5. మీరు చాలా ఆలస్యంగా విష్ చేశారు. కానీ, మీకు తెలియని విషయమేంటంటే.. ఇవాళ నవ్రే పండుగ. నవ్రే శుభాకాంక్షలు తెలిపితే బాగుండేది’ అని ఓ నెటిజన్ చురకలంటించారు. ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ నౌరుజ్ అనేది పార్సీల కొత్త సంవత్సరం పేరు. కశ్మీరీ బ్రాహ్మణుల పండుగను నవ్రే అని పిలుస్తారు. నవ్రే అనే పదం, సంస్కృత పదమైన నవ వర్ష నుంచి పుట్టింది. క్రియాశీల రాజకీయాల్లోకి ఈ మధ్యే అడుగిడిన ప్రియాంక.. గాయాలపాలైన విలేకరులకు సహాయం చేయడం, ప్రముఖ ఆలయాల సందర్శన, లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో జోరుగా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, ఈ ట్వీట్ ఆమెను అభాసుపాలు చేస్తోంది. -
‘ఘర్ వాపసీ’ చేసే ధైర్యముందా?
ముంబై: కేంద్ర పౌర జాబితా(ఎన్నార్సీ) విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని శివసేన సమర్థించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో తమ మద్దతుంటుందని తెలిపింది. ప్రభుత్వాన్ని అభినందించింది. దేశంలో అక్రమంగా ఉండే పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, శ్రీలంకన్లు, రోహింగ్యా ముస్లింలు ఎవరైనా వారిని బహిష్కరించాలని కోరింది. అయితే.. కశ్మీర్లోకి పండిట్ల ‘ఘర్ వాపసీ’ చేసే విషయంలో కేంద్రానికి ధైర్యముందా అని పార్టీ పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్ నుంచి హిందువులను (పండిట్లను) బలవంతంగా పంపేసిన విషయాన్ని మరిచిపోవద్దని సూచించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అసోంలో ప్రకటించినట్టుగా కశ్మీర్‌లోనూ కేంద్ర పౌర జాబితా ప్రకటించాలని కోరింది. దేశంలోని ప్రతి ఇంటిపై హిందుత్వ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించింది. -
సీనియర్ నటుల మాటల వార్!
బాలీవుడ్లో సీనియర్ నటులైన నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కశ్మీర్ పండిట్ల విషయంలో ఈ ఇద్దరు నటులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నసీరుద్దీన్ షా వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సమసిపోయే అవకాశం కనిపిస్తోంది. వివాదం ఏమిటి? తన తాజా చిత్రం 'వెయిటింగ్' ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నసీరుద్దీన్ షా అనుపమ్ ఖేర్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు. 'ఎన్నడూ కశ్మీర్లో నివసించని వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడు. నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్టు వ్యవహరిస్తున్నాడు' అని షా పేర్కొన్నాడు. షా విమర్శలపై ఖేర్ ట్విట్టర్లో బదులిచ్చాడు. 'జయహో షాగారు. మీ లాజిక్ ప్రకారం ఎన్నారైలు ఇండియా గురించి మాట్లాడవద్దన్న మాట' అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఖేర్‌కు బాలీవుడ్ ప్రముఖులు అశోక్ పండిట్, మధుర్ బండార్కర్ మద్దతు పలికారు. ఖేర్‌కు షా క్షమాపణ చెప్పాలని దర్శకుడు అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. దీంతో నసీరుద్దీన్ షా స్పందిస్తూ ఖేర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చాడు. -
ఇన్నేళ్లయినా అస్సలు హ్యాపీ లేదట
శ్రీనగర్: కొంతమంది వ్యక్తుల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవరికీ అర్ధంకాదు. ఒక్కోసారి ఏం లేకపోయినా సంతోషం ఉంటే ఒక్కోసారి మాత్రం అన్నీ ఉన్నా సంతోషం మాత్రం దగ్గరికి రాదు. ప్రస్తుతం కాశ్మీర్‌లోని పండిట్ల అంశం కూడా అలాగే తయారైంది. దాదాపు 20 ఏళ్లపాటు జమ్మూప్రాంతంలో గడిపిన వీరంతా ప్రస్తుతం కశ్మీర్ లోయ ప్రాంతానికి తరలి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఆనందం మాత్రం తమ దరి చేరలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా బుద్గా జిల్లాలోని షేకాపోరా అనే ప్రాంతంలో ఉంటున్న వీణా కౌల్(60) అనే వ్యక్తిని ప్రశ్నించినప్పుడు వారి దయనీయ పరిస్థితి కనిపించింది. ఒకే అపార్ట్ మెంట్లలో రెండు రెండు కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఒకటే కిచెన్, ఒకటే బాత్ రూం, ఇతర అంశాలు కూడా పరస్పరం పంచుకోవాల్సి రావడంతోపాటు మరింకెన్నో సమస్యలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాండవిస్తున్నాయి. దీంతో తిరిగి తమ నివాస ప్రాంతానికి వచ్చామన్న సంతోషం మాత్రం కరువైందని వారు వాపోతున్నారు. మొత్తం 1200 మంది కశ్మీర్ పండిట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయా ప్రాంతంలో స్థిరపడ్డారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, రేషన్ కార్డులుగానీ, ఓటరు గుర్తింపుకార్డులుగానీ ఇవ్వలేదు. పునరావాసానికి సంబంధించి ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. తీవ్రవాదం కారణంగా కశ్మీర్ పండిట్లు చెల్లా చెదురవగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వారిని ఒకచోటకు చేరుస్తున్న విషయం తెలిసిందే.