కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పప్పులో కాలేశారు. నిజమైన పప్పులో కాదండోయ్. కశ్మీరీ పండిట్‌లకు నూతన సంవత్సర (నవ్రే) శుభాకాంక్షలను తెలపాలనే ఉద్దేశంతో ప్రియాంక చేసిన ట్వీటు హాస్యాస్పదం అవుతోంది. కశ్మీరీల పండుగ నర్మేకు బదులు నౌరోజ్ ముబారక్ అని ప్రియాంక తప్పుగా ట్వీటారు. దీంతో ప్రియాంక ట్వీటును విమర్శిస్తూ, ఆమె మీద జోకులు పేలుస్తూ చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తన్నారు. ‘మేడమ్ ప్రియాంక గారు, నౌరోజ్‌ను మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు ఏప్రిల్ 5. మీరు చాలా ఆలస్యంగా విష్ చేశారు. కానీ, మీకు తెలియని విషయమేంటంటే.. ఇవాళ నవ్రే పండుగ. నవ్రే శుభాకాంక్షలు తెలిపితే బాగుండేది’ అని ఓ నెటిజన్ చురకలంటించారు.
ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్
నౌరుజ్ అనేది పార్సీల కొత్త సంవత్సరం పేరు. కశ్మీరీ బ్రాహ్మణుల పండుగను నవ్రే అని పిలుస్తారు. నవ్రే అనే పదం, సంస్కృత పదమైన నవ వర్ష నుంచి పుట్టింది. క్రియాశీల రాజకీయాల్లోకి ఈ మధ్యే అడుగిడిన ప్రియాంక.. గాయాలపాలైన విలేకరులకు సహాయం చేయడం, ప్రముఖ ఆలయాల సందర్శన, లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో జోరుగా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, ఈ ట్వీట్ ఆమెను అభాసుపాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment