![Vidhu Vinod Chopra: Dedicated The Film To My Mother Shanti Devi - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/20/vidhu.jpg.webp?itok=4UGrAXmr)
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన తాజా మూవీ ‘షికారా’ ప్రీమియర్ షోను ఆదివారం ఢిల్లీలో ప్రదర్శించారు. జమ్మూలోని జగ్తి క్యాంపస్‌కు చెందిన సుమారు 300 మంది కాశ్మీరీ పండితులు, ఇతర ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. వీరిలో చాలా మంది పండితులు సినిమాలో కూడా నటించారు. కశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ పండితులను బషిష్కరించి 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 1990 జనవరి 19, 20 తేదీల్లో కాశ్మీరీ పండితులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కశ్మీర్‌ను వదిలి వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 4 లక్షల మంది వలస వెళ్లిన పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా వినోద్ చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రాన్ని తన తల్లి శాంతి దేవికి అంకితం చేస్తున్నానని తెలిపారు. వినోద్ చోప్రా తల్లి శాంతి.. పరిందా చిత్రం కోసం 1989లో కశ్మీర్ నుంచి ముంబై వచ్చి 1999లో తిరిగి కశ్మీర్ వెళ్లే క్రమంలో మరణించారు. ఈ సినిమా కేవలం చిత్రం మాత్రమే కాదని కశ్మీర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లకముందే మరణించిన తన తల్లి కోసం రూపోందించానని వినోద్ చోప్రా తెలిపారు. తన కలను సాధ్య పరచడంలో సహకరించిన కాశ్మీరీ పండితులకు చోప్రా కృతజ్ఞతలు తెలిపారు. కాగా షికారాను తెరకెక్కించడానికి తనకు 11 ఏళ్లు పట్టిందని అన్నారు. ఈ మధ్యలో మూడు మున్నా భాయ్ సినిమాలు రెండు 3 ఇడియట్స్ సినిమాలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో షికారా ప్రివ్యూతో పాటు మరో రెండు వీడియోలు కూడా ప్రదర్శించారు.
సినిమా రచయితలో ఒకరైన రాహుల్ పండిట్ కూడా 990 లో కశ్మీర్‌ను వదిలి వచ్చిన పండితులలో ఒకరు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.."ఈ సినిమా మన కథను ప్రపంచానికి తెలియజేసే మొదటి ప్రయత్నం. మేము వలవ వెళ్లి 30 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం జరగాలి’’ అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. తమ పాత్రల కోసం దాదాపు రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నట్లు విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది
Comments
Please login to add a commentAdd a comment