కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు.
జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి.
బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్‌లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి.
ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు
Comments
Please login to add a commentAdd a comment