Russia: మాస్కోలో ఐసిస్‌ భారీ ఉగ్రదాడి | Massive terrorist attack in Russia | Sakshi
Sakshi News home page

Moscow concert attack: రష్యా మాస్కోలో ఐసిస్‌ భారీ ఉగ్రదాడి  

Published Sat, Mar 23 2024 6:07 AM | Last Updated on Sat, Mar 23 2024 12:22 PM

Massive terrorist attack in Russia - Sakshi

మాస్కోలోని ఓ సంగీత కచేరీపై దుండగుల దాడి

సైనిక దుస్తుల్లో వచ్చిన విచక్షణా రహితంగా కాల్పులు

కాల్పులతో పాటు బాంబులు విసిరిన వైనం

భారీగా మృతులు.. వందలాది మందికి గాయాలు

తమ పనేనని ప్రకటించుకున్న ఐసిస్‌ ఉగ్రసంస్థ

ఉపేక్షించేది లేదన్న అధ్యక్షుడు పుతిన్‌

మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్‌ హాల్లో­కి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా,  వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్విస్‌ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.

మాస్కో శివారులోని క్రోకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లో ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో  సైనిక దుస్తుల్లో కాన్సర్ట్‌హాల్‌లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్‌లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీ­పం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి.

దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్‌ పేర్కొన్నట్లు క్రెమ్లిన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.  పుతిన్‌ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు.  

దాడి మా పనే
ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్‌ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్‌ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement