
ఢిల్లీ : తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఉగాదిలోపే క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన పలువురు ముఖ్యనేతలు ఢిల్లీకి పయనమై వెళ్లారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ లు ఢిల్లీకి వెళ్లారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఈరోజు(సోమవారం జరిగే సమావేశం అనంతరం క్యాబినెట్ విస్తరణ అనేది ఓ కొలిక్కే వచ్చే అవకాశం ఉంది. నేడో, రేపో క్యాబినెట్ మంత్రులపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment