సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం(అక్టోబర్ 26) సాయంత్రం సమావేశమైంది. కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ములుగులో సమ్మక్క సారలమ్మ వర్శిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు..
- మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
- ఎల్బీనగర్ టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు, నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు హయత్‌నగర్ పొడిగింపు
- ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేందద్రాల ఏర్పాటునకు ఆమోదం
- ఉస్మానియా ఆస్పత్రి పునర్‌నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్స్ భూమి బదలాయింపు
- కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్
- రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయం
- ములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నిర్ణయానికి భూ కేటాయింపులు
- ఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు
- టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌కు నిర్ణయం
ఇదీ చదవండి: ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి
Comments
Please login to add a commentAdd a comment