సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(జనవరి14) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం,పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కాగా,ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు.
వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది. సింగపూర్ పర్యటన తర్వాత ఈనెల 20 నుంచి 22 వరకు రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు.గతేడాది కొత్తగా సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంతత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంతత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఇటు కాంగగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment