ఆర్మీ మేజర్‌కు సుప్రీంకోర్టులో ఊరట! | Shopian Firing Case Against Major Aditya Kumar Is Put On Hold | Sakshi
Sakshi News home page

ఆర్మీ మేజర్‌కు సుప్రీంకోర్టులో ఊరట!

Published Mon, Mar 5 2018 10:06 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Shopian Firing Case Against Major Aditya Kumar Is Put On Hold - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ శ్రీనగర్: షోపియన్‌ కాల్పుల ఘటన నేరగాళ్లకు సంబంధించిన కేసు కాదని, ఓ ఆర్మీ మేజర్ కేసుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికి మేజర్ ఆదిత్య కుమార్ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడిపై తప్పుడు కేసు నమోదు చేశారని, అతడు అమాయకుడని మేజర్ ఆదిత్యకుమార్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు కేసు దర్యాప్తును నిలిపివేయడంతో పాటు తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది.

ఈ జనవరిలో షోపియన్‌లోని గనోవ్‌పోరా గ్రామంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆర్మీ వాహనాలపై రాళ్లు విసిరి, విధ్వంసం సృష్టించారు. దీంతో ఆర్మీ సిబ్బంది ఆ అల్లరి మూకపై కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాద్ధాంతం కాగా, స్పందించిన సీఎం మెహబూబా ముఫ్తీ ఆర్మీ కాల్పులపై విచారణకు ఆదేశించగా.. పోలీసులు మేజర్ ఆదిత్యకుమార్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన సమయంలో మేజర్ ఆదిత్య అక్కడలేదని, అయినా కేసులు పెట్టారంటూ ఆయన తండ్రి సుప్రీంను ఆశ్రయించారు. 

కేసు విచారణ అనంతరం సీజేఐ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఇది క్రిమినల్ కేసు కాదని.. ఓ ఆర్మీ అధికారికి సంబంధించిన కేసు అని పేర్కొన్నారు. సైనికులపై విచారణ చేపట్టి అంత అనైతికంగా ప్రవర్తించే ప్రసక్తే లేదన్నారు. ఏప్రిల్ 24న ఈ పిటిషన్‌పై తీర్పు ఉంటుందని, అంతవరకూ మేజర్ ఆదిత్యకుమార్‌పై విచారణ చేపట్టవద్దని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని సీజేఐ ఆదేశించారు. ఆదిత్యనే కాన్వాయ్‌కి హెడ్‌గా వ్యవహరించినట్లు గుర్తించినా.. మేజర్‌ను ఎఫ్ఐఆర్‌లో తాము నిందితుడిగా పేర్కొనలేదని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement