న్యూఢిల్లీ: బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్ వ్యవస్థల(సిస్టమ్స్) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి.
ప్రాపర్టీ, క్యాజువాలిటీ, లైఫ్, యాన్యుటీ ఇన్సూరెన్స్ మార్కెట్లలో మైండ్‌ట్రీతో జత కడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు శాపియన్స్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్, జీఎం జామీ యోడర్ పేర్కొన్నారు. రెండు సంస్థల సంయుక్త సామర్థ్యాలు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, బిజినెస్ సొల్యూషన్స్‌లో గరిష్ట ప్రయోజనాలు కల్పించనున్నట్లు మైండ్‌ట్రీ బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ముకుంద్ తెలిపారు.
చదవండి: ఎంఈసీఎల్‌తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం!
Comments
Please login to add a commentAdd a comment