collabaration
-
ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’
రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పదవిలో ఉండి కాలం చేసిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదని అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటిస్తారు. ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణులు పోటీ చేసిన బీజేపీకి చురుగ్గా సహకరిస్తాయి. కుట్ర రాజకీయాలు చేయడంలో టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మూడు ముక్కలాట తెరపై కనిపిచింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తొలుత కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైఎస్సార్సీసీకి కంచుకోటగా నిలుస్తోంది. ప్రజామద్దతు చూరగొని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదంటూ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా పోటీ చేసింది. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేశారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థిని బరిలో దింపలేదు. అయితే బీజేపీకి పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పని చేయడం చూస్తే రెండు పారీ్టల రహస్య ఎజెండా అర్థమవుతోంది. బీజేపీకి.. జనసేన, టీడీపీ ప్రత్యక్ష సహకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అరాచక పాలన సాగించింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని బీజేపీ ఛీత్కరించింది. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ప్రజా మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షోభాలు ఎదురైనా.. చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పాలన అందిస్తుండడంతో వైఎస్సార్సీపీ అపార ప్రజామద్దతు పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని నిలువరించడం కష్ట సాధ్యమని తెలుసుకున్న విపక్షాలు అంతర్గతంగా చేతులు కలుపుతున్నాయి. టీడీపీ బహిర్గతంగా బీజేపీ ఛీ కొట్టింది. అయినా అంతర్గతంగా బీజేపీకి లోపాయకారి మద్దతు ఇస్తూ టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఉప ఎన్నికల పోలింగ్‌లో తెర వెనుక రాజకీయాలకు తెర తీసిన టీడీపీ.. ఆఖరి క్షణంలో తెరపైకి ప్రత్యక్షమైయ్యారు. పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ వర్గీయులు అవతరించారు. జనసేన నేతలు సైతం అదే ధోరణి ప్రదర్శించారు. బీజేపీకి అండగా ప్రచార పర్వం నుంచి పోలింగ్ దాకా సహకారమందించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 2,314 ఓట్లతో 1.33 శాతానికి పరిమితమైన బీజేపీ, 2022 ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సహకారంతో 19,353 ఓట్లతో 14.1 శాతం ఓటు షేర్ దక్కిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బీజేపీకి రెండు పార్టీల నేతలు సహకరించినా ఓటింగ్ శాతం ఈ స్థాయికి పరిమితం కావడంతో చూస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసినా.. ఒంటరిగా పోటీ చేసినా.. ఆ పారీ్టలకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేసిస్తున్నారు. మేకపాటి మంచితనానికి ఆత్మకూరు ప్రజల జేజేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 74.47 శాతం ఓట్లు దక్కాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అర్హులందరికీ చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలు అందిస్తున్న తీరు, మేకపాటి గౌతమ్‌రెడ్డి మంచి తనం ఉప ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. 2014లో అత్యధిక మెజార్టీ రికార్డు మేకపాటి గౌతమ్‌రెడ్డికి దక్కగా, ఆ జాబితాలో తొలి స్థానాన్ని మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరగరాశారు. 82,888 ఓట్లు మెజార్టీ సాధించి భారీ రికార్డును మేకపాటి విక్రమ్‌రెడ్డి వశ పర్చుకుని, తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సోదరడు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం -
మైండ్‌ట్రీతో జట్టుకట్టిన, శాపియన్స్
న్యూఢిల్లీ: బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్ వ్యవస్థల(సిస్టమ్స్) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి. ప్రాపర్టీ, క్యాజువాలిటీ, లైఫ్, యాన్యుటీ ఇన్సూరెన్స్ మార్కెట్లలో మైండ్‌ట్రీతో జత కడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు శాపియన్స్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్, జీఎం జామీ యోడర్ పేర్కొన్నారు. రెండు సంస్థల సంయుక్త సామర్థ్యాలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, బిజినెస్ సొల్యూషన్స్‌లో గరిష్ట ప్రయోజనాలు కల్పించనున్నట్లు మైండ్‌ట్రీ బీఎఫ్ఎస్ఐ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ముకుంద్ తెలిపారు. చదవండి: ఎంఈసీఎల్‌తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం! -
చేతులు కలిపిన మేటా, మైక్రోసాఫ్ట్ ! వీడియో చాట్‌కి కొత్త సొబగులు
Meta Partnership With Microsoft: టెక్నాలజీ రంగంలో పరస్పరం పోటీ పడుతున్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు చేతులు కలిపాయి. కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను మరింత చక్కగా వినియోగించుకునేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. నత్తనడకన వర్క్‌ప్లేస్ సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మేటాగా పేరు మార్చుకుంది. అయితే మేటా వీడియో చాట్ యాప్‌గా వర్క్‌ప్లేస్ ఉంది. ఈ వీడియో చాట్యాప్ ద్వారా ఉద్యోగులు వర్చువల్‌గా పని చేసుకునే వీలుంది. మేటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తరహాలో వర్క్‌ప్లేస్ పెద్దగా యూజర్ బేస్ సాధించలేక పోయింది. 2016 అక్టోబరులో వర్క్‌ప్లేస్ మార్కెట్లోకి వచ్చినా.. ఇప్పటి వరకు 7 మిలియన్లకు మించి పెయిడ్ యూజర్ బేస్ సాధించలేకపోయింది. లక్ష్యానికి దూరంగా మరోవైపు వీడియో చాట్ విభాగంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ టీమ్ యాప్‌ని అందిస్తోంది. వర్క్ప్లేస్తో పోల్చితే టీమ్ యాప్‌కి కస్టమర్ బేస్ ఎక్కువగానే ఉంది. 250 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్లు ఈ యాప్‌కి ఉన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ టీమ్ సైతం ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఎదగలేక పోయింది. ఈజీగా రెండు పనులు దీంతో వీడియో చాట్ విభాగంలో స్కైప్, జూమ్, గూగుల్ డుయోలకి పోటీగా మార్కెట్లో నంబర్ స్థానం లక్ష్యంగా మేటా, మైక్రోసాఫ్ట్‌లు జట్టు కట్టాయి. దీని ప్రకారం ఒకే యాప్‌లో ఉన్నప్పటికీ రెండు యాప్‌లలో ఉండే సౌకర్యాలను పొందవచ్చు. ఉదాహారణకు మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్‌లో ఉంటూనే వర్క్‌ప్లేస్ యాప్‌లో న్యూస్ ఫీడ్‌ను చూసుకోవచ్చు. నంబర్‌వన్ రోనా సంక్షోభం తర్వాత వీడియో చాట్ యాప్‌ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వర్చువల్ కాన్ఫరెన్సులు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు యాప్‌లకు ఉన్న యూజర్ బేస్‌ను కాపాడుకుంటూ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్, మేటాలు జట్టుకట్టాయి. వీడియో చాట్ విభాగంలో నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. చదవండి:యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
టాటా మోటార్స్-మైక్రోసాఫ్ట్ మెగా భాగస్వామ్యం
ముంబై: దేశీయ ఆటో మేజర్ టాటా మోటార్స్ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియాతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వినియోగదారులకు మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే ఉద్దేశంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఇరుసంస్థలు ఒక ఉమ్మడి ప్రకటనలో గురువారం వెల్లడించాయి. ఈ ఒప్పందం ద్వారా కంపెనీలకు ఒకత్త ఆదాయం అవకాశాలు, కారు కొనుగోలు దారలు వాల్యూ యాడెడ్ సేవలు అందనున్నట్టు తెలిపాయి. వివిధ టెక్నాలజీ భాగస్వాములతో సహకారంతో అనుమతిస్తూ ఓపెన్ ప్లాట్ పాం టామో వ్యూహాన్ని ప్రకటించిన టాటా మోటార్స్ రెండు వారాల్లో దిగ్గజ సంస్థతో ఈ డీల్ కుదుర్చుకుంది. ప్యాసింజర్ కార్ల విభాగంలో గూగుల్, ఉబెర్ లాంటి టెక్ దిగ్గజాలనుంచి వస్తున్న పోటీని తట్టుకునే ఎత్తుగడలో కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కార్ల విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్న టాటామోటార్స్ మరిన్ని హైటెక్ కార్లను కార్ లవర్స్ కు అందుబాటులోకి తేనుంది. తమ మొదటి మెరుగైన వాహనాన్ని మార్చి 7 న జరిగే 87వ జెనీవా అంతర్జాతీయమోటార్ షోలో ఆవిష్కరించనున్నట్టు ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా టాటా మోటార్స్ ఇంటర్ ఫేస్ అప్లికేషన్ లో మైక్రోసాఫ్ట్ ఆధారిత అడ్డాన్స్డ్ నావిగేషన్, ప్రీ యాక్టివ్ మెంటినెన్స్, టెలీమాటిక్స్,రిమోట్ మానిటరింగ్ ఫీచర్స్‌ను జోడించనుంది. ఈ ఒప్పందం ద్వారా తమ వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్నిఅందించనున్నట్టు టాటా మోటార్స్ సిఈఓ గుయెంటర్ బుశ్చెక్ ప్రకటించారు. ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్), ఎఐ (కృత్రిమ మేధస్సు) మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా దేశీయంగా , ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన, ప్రొడక్టివ్ అండ్ ఫన్ డ్రైవింగ్ అనుభవాన్నిఅందిస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు.