Meta Partnership With Microsoft: టెక్నాలజీ రంగంలో పరస్పరం పోటీ పడుతున్న ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లు చేతులు కలిపాయి. కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను మరింత చక్కగా వినియోగించుకునేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించాయి.
నత్తనడకన వర్క్‌ప్లేస్
సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్‌బుక్ ప్రస్తుతం మేటాగా పేరు మార్చుకుంది. అయితే మేటా వీడియో చాట్ యాప్‌గా వర్క్‌ప్లేస్ ఉంది. ఈ వీడియో చాట్‌యాప్ ద్వారా ఉద్యోగులు వర్చువల్‌గా పని చేసుకునే వీలుంది. మేటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వర్క్‌ప్లేస్ పెద్దగా యూజర్ బేస్ సాధించలేక పోయింది. 2016 అక్టోబరులో వర్క్‌ప్లేస్ మార్కెట్‌లోకి వచ్చినా.. ఇప్పటి వరకు 7 మిలియన్లకు మించి పెయిడ్ యూజర్ బేస్ సాధించలేకపోయింది.
లక్ష్యానికి దూరంగా
మరోవైపు వీడియో చాట్ విభాగంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ టీమ్ యాప్‌ని అందిస్తోంది. వర్క్‌ప్లేస్‌తో పోల్చితే టీమ్ యాప్‌కి కస్టమర్ బేస్ ఎక్కువగానే ఉంది. 250 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్లు ఈ యాప్‌కి ఉన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ టీమ్ సైతం ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఎదగలేక పోయింది.
ఈజీగా రెండు పనులు
దీంతో వీడియో చాట్ విభాగంలో స్కైప్, జూమ్, గూగుల్ డుయోలకి పోటీగా మార్కెట్‌లో నంబర్ స్థానం లక్ష్యంగా మేటా, మైక్రోసాఫ్ట్‌లు జట్టు కట్టాయి. దీని ప్రకారం ఒకే యాప్‌లో ఉన్నప్పటికీ రెండు యాప్‌లలో ఉండే సౌకర్యాలను పొందవచ్చు. ఉదాహారణకు మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్‌లో ఉంటూనే వర్క్‌ప్లేస్ యాప్‌లో న్యూస్ ఫీడ్‌ను చూసుకోవచ్చు.
నంబర్‌వన్
రోనా సంక్షోభం తర్వాత వీడియో చాట్ యాప్‌ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వర్చువల్ కాన్ఫరెన్సులు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు యాప్‌లకు ఉన్న యూజర్ బేస్‌ను కాపాడుకుంటూ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్, మేటాలు జట్టుకట్టాయి. వీడియో చాట్ విభాగంలో నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
చదవండి:యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment