ఆర్ధిక మాంద్యం దెబ్బకు దిగ్గజ సంస్థలు కుదలేవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు స్టార్టప్‌ల నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. నియామకాల్ని రద్దు చేస్తున్నాయి. మరి కొన్ని వాయిదా వేస్తున్నాయి.తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగుల నియామకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ ఇటీవల ఫ్రెషర్స్‌ను నియమించుకోవడలేదని తెలిపింది.మైక్రోసాఫ్ట్ దాదాపు 1800మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.అయితే తరువాతి కాలంలో మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుంది. మెటా సైతం సీరియస్ టైమ్స్ అంటూ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ తరుణంలో యాపిల్ సైతం వచ్చే ఏడాది వరకు కొత్త ఉద్యోగుల్ని హయర్ చేసుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పింది.
బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..యాపిల్ ఇప్పట్లో ఉద్యోగాల నియమకం జరపదని, అయితే కొన్ని విభాగాల్లో మాత్రం వచ్చే ఏడాది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోనుందని పేర్కొంది. అదే సమయంలో ఉద్యోగుల నియామకం నిలిపివేతపై యాపిల్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదంటూ పలు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment