టాటా మోటార్స్-మైక్రోసాఫ్ట్ మెగా భాగస్వామ్యం
ముంబై: దేశీయ ఆటో మేజర్ టాటా మోటార్స్ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియాతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వినియోగదారులకు మరింత మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే ఉద్దేశంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఇరుసంస్థలు ఒక ఉమ్మడి ప్రకటనలో గురువారం వెల్లడించాయి. ఈ ఒప్పందం ద్వారా కంపెనీలకు ఒకత్త ఆదాయం అవకాశాలు, కారు కొనుగోలు దారలు వాల్యూ యాడెడ్ సేవలు అందనున్నట్టు తెలిపాయి.
వివిధ టెక్నాలజీ భాగస్వాములతో సహకారంతో అనుమతిస్తూ ఓపెన్ ప్లాట్ పాం టామో వ్యూహాన్ని ప్రకటించిన టాటా మోటార్స్ రెండు వారాల్లో దిగ్గజ సంస్థతో ఈ డీల్ కుదుర్చుకుంది. ప్యాసింజర్ కార్ల విభాగంలో గూగుల్, ఉబెర్ లాంటి టెక్ దిగ్గజాలనుంచి వస్తున్న పోటీని తట్టుకునే ఎత్తుగడలో కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కార్ల విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్న టాటామోటార్స్ మరిన్ని హైటెక్ కార్లను కార్ లవర్స్ కు అందుబాటులోకి తేనుంది.
తమ మొదటి మెరుగైన వాహనాన్ని మార్చి 7 న జరిగే 87వ జెనీవా అంతర్జాతీయమోటార్ షోలో ఆవిష్కరించనున్నట్టు ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా టాటా మోటార్స్ ఇంటర్ ఫేస్ అప్లికేషన్ లో మైక్రోసాఫ్ట్ ఆధారిత అడ్డాన్స్‌డ్ నావిగేషన్, ప్రీ యాక్టివ్ మెంటినెన్స్, టెలీమాటిక్స్,రిమోట్ మానిటరింగ్ ఫీచర్స్‌ను జోడించనుంది. ఈ ఒప్పందం ద్వారా తమ వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్నిఅందించనున్నట్టు టాటా మోటార్స్ సిఈఓ గుయెంటర్ బుశ్చెక్ ప్రకటించారు.
ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్), ఎఐ (కృత్రిమ మేధస్సు) మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా దేశీయంగా , ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన, ప్రొడక్టివ్ అండ్ ఫన్ డ్రైవింగ్ అనుభవాన్నిఅందిస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు.