ధరలు పెంచేసిన టాటా మెటార్స్
ముంబై: ఆటో మేజర్ టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచేసింది. ప్యాసింజర్ వాహనాల ధరలను దాదాపు రూ.12వేల వరకు పెంచింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా తమ వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచినట్టు టాటా మోటార్స్ బిజినెస్ డైరెక్టర్ మయాంక్ పరీక్ మీడియాకు తెలిపారు. ప్యాసింజర్ వాహనాలు ధరలను రూ. 5,000 నుంచి రూ12 వేల మధ్య పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉక్కు ,జింక్ లాంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయని చెప్పారు.
టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ చిన్న కారు నానో, కొత్తగా విడుదలైన హ్యాచ్ బ్యాక్ టియాగో, ఎరియా, సహా ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తుంది. వీటి ధరలు సుమారు రూ 2.15 లక్షలనుంచి 16.3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి.
కాగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల నుంచి1 శాతం వరకు ధరలు పెంచగా, ఈ ఏడాది ఆగష్టు లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతి సుజుకి తమ వివిధ మోడళ్ల కార్ల ధరలను రూ.20వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే.
,